S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పెండింగ్ ప్రాజెక్టులపై కాలయాపన తగదు

మహబూబ్‌నగర్, మే 13: పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వానికి కాలయాపన తగదని టిడిపి జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు ఆరోపించారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బక్కని నర్సింహులు మాట్లాడుతూ జిల్లాలోని కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికి ఇంకా ముఖ్యమంత్రి కెసిఆర్ సెంటిమెంట్‌ను వాడుకోవాలని చూస్తున్నారని తెలుగు ప్రజల మధ్య రాజకీయ చిచ్చుపెట్టడానికి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఇంకా ఎన్ని రోజులు అంటూ ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి కాలం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం నిరంతరంగా రైతులకు కరెంట్ సరఫరా చేసిన ఫలితం ఏమిటని ముఖ్యమంత్రికి నిజంగా రైతులపై చిత్తశుద్ధి ఉంటే ఖరీఫ్‌లో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం బోరుబావుల్లో నీరులేక బోర్లే నడవకుంటే కరెంట్ ఏమీ చేస్తారని అన్నారు. జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొని దుర్భిక్షంలో ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం రాజకీయాలపై దృష్టి పెట్టారని ఆరోపించారు. ఏ పార్టీ నాయకుడు గులాబీ కండువా కంపుకుంటారోనని ఎదురుచూస్తున్నారే తప్పా. కరువు నివారణ చర్యలు మాత్రం చేపట్టడం లేదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కరువు తాండవిస్తుందని పశువులకు గ్రాసం లేక తల్లడిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కరువు సహయక చర్యల్లో భాగంగా రూ.790కోట్లు ప్రకటించి రూ.350కోట్ల నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ నిధులను రైతుల ఖాతాల్లోకి వేయకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతులకు కరువు భత్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రలో చంద్రబాబునాయుడు ఏకకాలంలో రుణమాఫీ చేయడంతో అక్కడి రైతులకు మేలు జరిగిందని కానీ ఇక్కడ మాత్రం ఏకకాలంలో రుణమాఫీ చేయకుండా విడతల పేరిట రైతులను నట్టెట ముంచారని ఆరోపించారు. మరో నెలరోజులలోపు ఖరీఫ్ సిజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఓ ప్రణాళిక అంటూ ఏమీ లేదని ఖరీఫ్‌లో రైతులకు రుణాలు ఎలా ఇస్తారో ముందుగానే ముఖ్యమంత్రి ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కరువు నివారణ చర్యలను జిల్లాలో చేపట్టాలని ఆయన కోరారు. జిల్లా మంత్రులు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి జిల్లాలో ఉచితంగా పశుగ్రాసం ఇవ్వాలని కోరారు. మాటలతో కాలయాపన చేయడం తగదని ఆయన హితవు పలికారు. కరువు తీవ్రరూపం ఉండడంతో వచ్చే ఖరీఫ్‌లో రైతులకు ఉచితంగా ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయాలని అందుకు రైతులతో కలిసి జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. విలేఖరుల సమావేశంలో టిడిపి నాయకులు ఎన్‌పి వెంకటేష్, బాలప్ప, మల్యాద్రి పాల్గొన్నారు.