S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నాణ్యత తెలియకుండా ప్రచారం చేస్తే భారీ మూల్యం తప్పదు

పాట్నా, మే 17: ప్రస్తుతం అమల్లో ఉన్న వినియోగదారుల రక్షణ చట్టం-1986 స్థానం లో కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వస్తువుల నాణ్యత గురించి తెలుసుకోకుండా వాటి అమ్మకాలను ప్రమోట్‌చేసే ప్రముఖులకు 50 లక్షల రూపాయల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధించేందుకు వీలు కల్పించే నిబంధనలతో కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నట్లు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మంగళవారం వెల్లడించారు. ఇందుకోసం ప్రతిపాదించిన వినియోగదారుల పరిరక్షణ బిల్లు-2016ను పార్లమెంటరీ స్థారుూ సంఘం ఇప్పటికే ఆమోదించిందని, వచ్చే సమావేశాల్లో దీనిని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం జరుగుతుందని ఆయన న్యూఢిల్లీలో విలేఖరులకు తెలిపారు. ‘తాము ప్రమోట్ చేస్తున్న ఉత్పత్తులను ఉపయోగిస్తే బలం పెరుగుతుందనో లేక బట్టతలపై వెంట్రుకలు మొలుస్తాయనో అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ లాంటి కొంత మంది ప్రముఖ నటీనటులు చెబుతున్నారు. ఎంతమాత్రం నిజం లేని ఇటువంటి మాటలను కట్టిపెట్టాలి. ఏదైనా వస్తువు గురించి మీరు ప్రచారం చేయదలుచుకుంటే ముందుగా మీరు దానిని ఉపయోగించి నాణ్యతా ప్రమాణాలతోపాటు ఫలితాలపై సంతృప్తి చెందిన తర్వాతే ఆ వస్తువు గురించి ప్రచారం చేయా లి’ అని పాశ్వాన్ స్పష్టం చేశారు. తప్పుడు వాణిజ్య ప్రకటనలతో ప్రజలను మోసగించే వారికి విధించే జరిమానాను రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షలకు, జైలు శిక్షను రెండేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచుతూ కొత్త చట్టంలో కట్టుదిట్టమైన నిబంధనలు తెస్తామన్నారు.