S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

యాపిల్ వచ్చింది!

హైదరాబాద్, మే 19:ప్రపంచ ప్రఖ్యాత యాపిల్ కంపెనీ హైదరాబాద్‌లో గురువారం మాప్స్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించింది. యాపిల్ సిఇఓ టిమ్ కుక్, ముఖ్యమంత్రి కెసిఆర్, ఐటి మంత్రి కెటిఆర్, అధికారులు, ఐటి కంపెనీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నానక్‌రామ్‌గూడలోని వేవ్ రాక్‌లో యాపిల్ సంస్థ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. యాపిల్ ఉత్పత్తులైన ఐ ఫోన్, ఐ ప్యాడ్, యాపిల్ వాచ్‌ల వంటి ఉత్పత్తులకు మ్యాప్‌ల అభివృద్ధి పనులను ఈ కేంద్రం నుంచి సాగిస్తారు. నాలుగువేల మందికి ఈ కేంద్రంలో ఉద్యోగాలు లభిస్తాయి. మ్యాప్స్ డెవలప్‌మెంట్‌కోసం హైదరాబాద్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు ఆపిల్ సిఇఓ టిమ్ కుక్ ప్రకటించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ యాపిల్ కంపెనీ ప్రపంచ ప్రఖ్యాత వస్తూత్పత్తి సంస్థగా ప్రఖ్యాతి గాంచినట్లే, తెలంగాణ ఆదే స్థాయిలో పారిశ్రామిక విధానానికి ప్రఖ్యాతి గాంచిందని చెప్పారు. తెలంగాణ పురోభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకునేందుకు యాపిల్ సంస్థ ముందుకు వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో బిగ్ న్యూస్ చెబుతాను అంటూ ఐటి మంత్రి కెటిఆర్ కలిగించిన సస్పెన్స్‌కు టిమ్‌కుక్ హైదరాబాద్ రాకతో తెరపడిందన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి పరస్పరం అభివృద్ధి చెందేందుకు దోహదపడండి అని పారిశ్రామికవేత్తలకు కెసిఆర్ పిలుపు ఇచ్చారు. అత్యున్నత స్థాయి పారిశ్రామిక విధానాన్ని తమ ప్రభుత్వం అమలు చేస్తున్నదని చెప్పారు.
ఐటి దిగ్గజాలయిన ఫేస్‌బుక్, అమెజాన్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు తమ కార్యాలయాలను హైదరాబాద్‌లో స్థాపించాయని, వాటికి యాపిల్ సంస్థ తోడవడం తెలంగాణ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేసిందని కెసిఆర్ అన్నారు.
ఐలవ్ హైదరాబాద్
యాపిల్ సంస్థ సిఇఓ కుక్ మాట్లాడుతూ భారతదేశం, ఇక్కడి ప్రజల ఆతిథ్యం తనకు ఎంతో నచ్చిందంటూ ‘ఐ లవ్ హైదరాబాద్’ అన్నారు. తెలంగాణతో జీవితకాల స్నేహం కొనసాగుతుందని చెప్పారు. అతిథులకు సహకారం అందించడంలో భారతదేశం తమ దేశం కన్నా ముందు నిలుస్తుందని కొనియాడారు. ఐదువేలమంది ఉద్యోగులతో యాపిల్ సంస్థ పూర్తిస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు టిమ్ కుక్ ప్రకటించారు.
కార్యక్రమంలో ఐటి శాఖ మంత్రి కెటిఆర్ రాష్ట్ర పారిశ్రామిక విధానాలను వివరించారు. పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు ఇచ్చే విధానం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని తెలిపారు.

చిత్రం యాపిల్ సిఇఓ టిమ్ కుక్, సీఎం కెసిఆర్‌తో సెల్ఫీ దిగుతున్న ఐటి మంత్రి కెటిఆర్