S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

టిడిపిలో చేరిన కొత్తపల్లి

విజయవాడ, మే 19: తెలుగుదేశం.. ప్రజారాజ్యం... కాంగ్రెస్ పార్టీలలో కొనసాగి ప్రస్తుతం వైకాపా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు గురువారం రాత్రి తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పసుపు కండువా కప్పించుకున్నారు. భారీ వర్షంలోనూ స్కూల్ బస్సులు, కారులలో పెద్ద సంఖ్యలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అభిమానులు ఎంతో ఉత్సాహంగా తరలివచ్చారు.
ఆసక్తికర విషయం ఏమిటంటే తెలుగుదేశంకు చెందిన నరసాపురం శాసనసభ్యులు బండారు మాధవ నాయుడు గైర్హాజరుకావటం సభలో చర్చనీయాంశంగా మారింది. అయితే జెడ్‌పి చైర్‌పర్సన్, మంత్రి పీతల సుజాత, ముళ్లపుడి బాపిరాజు, శాసనసభ్యులు కోట రామారావు, చింతమనేని ప్రభాకర్, పీతాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే వైటి రాజా తదితరులు హాజరయ్యారు.