S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పెరిగిన నైరుతి మూల

ఆంజనేయులు (కరీంనగర్)
ప్రశ్న: మేము ఇటీవల ఒక ‘లే అవుట్’ వేశాం. కానీ అందులోగల స్థలాలను ఒక్కదాన్ని కూడా అమ్మలేక పోతున్నాం. దీనికి పరిష్కారం సూచించగలరు.
జ: దీనికి సంబంధించి కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా పరిష్కారం చేయవలసి ఉంటుంది.
దుర్గాదేవి (ఒంగోలు)
ప్రశ్న: ఆర్థిక పరమైన ఇబ్బందులు చాలా ఉన్నాయి. దీనికి కారణం మేము నివసించే ఇల్లేనా?
జ: నైరుతిలో, ఉత్తరంలో దోషాలు ఉంటే తప్పకుండా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. మీరు ఆ రెండు మూలల దోష నివారణ చేసుకోండి. మీ సమస్యలు పరిష్కారమవుతాయి.
కె.రామారావు (తాడేపల్లి)
ప్రశ్న: మేం 15 సం.లుగా ఈ ఇంట్లో నివసిస్తున్నాం. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి తరచూ ఆరోగ్యం బాగోలేక పోవడం జరుగుతోంది. కారణం తెలియడం లేదు.
జ: ఇంటి స్థలంలో నైరుతి మూల పెరగడం జరిగింది. అదే విధంగా నైరుతి భాగం ఇంటి కట్టుబడిలో కూడా పెరిగింది. ముందుగా స్థలంలో పెరిగిన నైరుతి భాగాన్ని వేరుచేస్తూ బేస్‌మెంట్ నిర్మాణం చేసి తర్వాత ప్రహరీగోడను నిర్మించుకోండి. దీనివల్ల నైరుతి దోషం పోతుంది. తర్వాత ఇంటి కట్టుబడిలో పెరిగిన నైరుతి దోషాన్ని యంత్రాల ద్వారా సరిచేసుకోండి. ఈ నైరుతి దోషం కూడా తొలగిపోతుంది. మీ ఇంట్లో ఉన్న ఆరోగ్యపరమైన సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు.
మార్కండేయులు (నిజామాబాద్)
ప్రశ్న: మేం ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఆర్థికంగా చాలా బాధలు పడుతున్నాం. ఎప్పుడూ అప్పు చేయని మేం ఇక్కడకు వచ్చిన దగ్గర నుండి అప్పులు చేయాల్సిన పరిస్థితి.
జ: మీరు నివసిస్తున్న ఇంటకి ఉత్తరంలోని ఇల్లు ఎత్తుగా ఉంది. ఇది ఒక కాణం. అలాగే నైరుతిలో టాయిలెట్స్ ఉన్నాయి. ముందుగా నైరుతిలో ఉన్న టాయిలెట్స్‌ని తీసివేసి దక్షిణ మధ్యభాగంలోకి నిర్మించుకోండి. దీనివల్ల కొంత పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఉత్తర దోష నివారణకు యంత్రాన్ని ప్రతిష్ఠించుకోండి.
*

-వాస్తు శిఖామణి చివుకుల రాఘవేంద్ర శర్మ -96 42 70 61 28