S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో-మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

సీరపు మల్లేశ్వరరావు, కాశీబుగ్గ
ఇంకా ఎనిమిదిన్నర సంవత్సరాలు గడువుంది కదా! అమరావతి నిర్మాణం జరగలేదు కదా! అద్దె కొంపల్లో విజయవాడ తాత్కాలిక రాజధానికి సెక్రటేరియట్ వారు అన్ని శాఖల ఉద్యోగులు రావాలని సి.ఎం. హుకుం. మరి విద్యా విధానం, వ్యాపారాలు, ఆస్తుల సంగతేమిటి?
పదేళ్ల వరకూ హైదరాబాద్‌లో ఉండవచ్చు అంటే అర్థం పదేళ్ల దాకా రాజధాని అక్కడి నుంచి కదలకూడదని కాదు. ప్రభుత్వం ఉన్నది ప్రజల సేవకు. ఉద్యోగుల సౌకర్యం కోసం కాదు. రాష్ట్రం లోపలే రాజధాని ఎంత త్వరగా నెలకొంటే జనానికి అంత మంచిది. అమరావతి స్వప్న నగరం వెలిసేదాకా వేచి ఉండాలనటం సరికాదు.

సి.మనస్విని, విజయవాడ
దేశానికి ప్రధానిగా ఐదేళ్లు పరిపాలించిన వ్యక్తి చనిపోతే ఆయన శవాన్ని పార్టీ ఆఫీసుకు రానీకుండా, అసలు దేశ రాజధానిలో కూడా ఉంచనీకుండా - తన తాబేదారు ముఖ్యమంత్రితో కలిసి శవాన్ని కూడా పూర్తిగా కాల్చనీయకుండా అసహనం ప్రదర్శించిన మహిళ - ఇవ్వాళ దేశంలో ఉన్న ‘అసహన ధోరణి’ని గురించి ఫిర్యాదు చేయడానికి రాష్టప్రతిని కలిసిందట. ఏమిటీ విడ్డూరం?
దయ్యాల నోట వేదాలు...

అపర్ణా దీక్షిత్, విజయవాడ
‘కాశ్మీర్‌లో కల్లోలం’ చదివి చాలా రోజులు బాధపడ్డాను. మరీ ఇంతగా హింసలు పెట్టి... అలాంటి వారిని కూడా మనం క్షమించి మన మధ్య తిరగనిస్తున్నాం. ఉన్నమాట చదివిన తరువాత మళ్లీ వేదన... బాధ. ఇక ఇలాంటివి చదివి బాధపడటమెందుకు? చదవకుండా ఉండలేనే...
పాపం!

కురువ శ్రీనివాసులు, హైదరాబాద్
ఇద్దరు చంద్రుల రాజధానుల్లో అన్నీ సమస్యలమయం. హైదరాబాద్‌లో ఎటు చూసినా చెత్తమయం. భరించలేని దుర్గంధం. డెంగ్యూ, వైరల్ ఫీవర్స్‌తో సామాన్యులు సతమతం. మరోవైపు టాంక్‌బండ్‌పై కోట్ల రూపాయలతో సంబరాలు.. మరోవైపు రైతుల ఆత్మహత్యలు.. అటు అమరావతి శంఖుస్థాపన సంబరాలు.. ఇదంతా అవసరమా.. మన నేతలకు!
వారికి అవసరమే.

pydipati.pv@gmail.com
నేటి ఫ్రపంచీకరణ ఒప్పందాల నేపథ్యంలో ప్రభుత్వాలు విదేశీ వస్తువులను నిషేధించలేని పరిస్థితులలో ప్రజలే స్వదేశీ వస్తువులను ప్రోత్సహించే బాధ్యత తీసుకోవాలి. మీరేమంటారు?
దానికి ఒక ఉద్యమమే మళ్లీ రావాలి.

ఎ.శివప్రసాద్, సంగారెడ్డి
నేను మీ అభిమానిని. మీ సంపాదకీయాలు, వ్యాసాలు ముఖ్యంగా చారిత్రక రచనలను తప్పకుండా చదువుతాను. అప్పట్లో మీరు వ్రాసిన ‘ఏది చరిత్ర?’ రచన వల్ల వాస్తవిక చరిత్ర గూర్చి తెలుసుకోగలిగాము. ఆ సీరియల్‌ను పుస్తకంగా ప్రచురించారా? ప్రచురించి ఉంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరు.
దుర్గా పబ్లికేషన్స్. 9441257962

ఘనౄజఇఖజ్ద్ఘ్ఘూబఘౄజ.ష్యౄ
సర్, నేను ఫ్రతి ఆదివారం అన్ని పత్రికల ఆదివారం పుస్తకాలు చదువుతాను. ఆంధ్రభూమి ‘మనలో మనం’ ఎడిటర్‌తో ముఖాముఖి తప్పక చూస్తాను. దానిలోని ప్రశ్నలు వాటికీ మీరు ఇచ్చే జవాబులు చాలా ఆసక్తిగా ఉంటాయి. నేను తప్పకుండా చూసే పేజీ ఇది. ఇందులో ఏ మాత్రం అబద్ధం లేదు. సర్. నాకు కథలు రాసి పంపాలనే ఆసక్తి. రాయగలను అనే నమ్మకం ఉంది. నేను రాసి పంపిస్తే అది మీకు నచ్చితే అచ్చు వేస్తారా?
తప్పక. దానికీ మీకు ‘మనలో మనం’ నచ్చడానికీ సంబంధం లేదు.

బి.సుమతి, జడ్చర్ల
భారతదేశంలోని గుప్త నిధులన్నింటిని ప్రభుత్వం బాధ్యతాయుతంగా వెలికితీసి ఆ బంగారాన్నంతటిని విక్రయించి, పుట్టు అంధులకు, చేతులు, కాళ్లు లేని వారికి నిత్యాన్నదానం చేస్తే, పుణ్యం వస్తుంది. దేశ దరిద్రం తొలగిపోతుంది. అలా చెయ్యకుండా వాటిని భూమిలోనే భద్రంగా ఉంచేసుకొని ఏం చేసుకుంటారు?
వాటి ఆచూకీ మీకు తెలిస్తే చెప్పండి. అలాగే చేయద్దాం.

గుండు రమణయ్య, పెద్దాపూర్
నవంబర్ 16 నుండి డిసెంబర్ 15 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇంటింటి సర్వే పనులు అప్పగిస్తే మరి విద్యార్థుల చదువులు సాగేదెలా?
తేరగా దొరికేది వారే కదా?

యశ్వంతరావు శేషగిరిరావు, ధవళేశ్వరం
మన దౌత్య - విదేశాంగ విధానంలో మెతకతనానికి నెహ్రూ నుంచి మోదీ వరకు అందరూ ఒకటే. వాళ్లందరికీ సదరు దుర్మార్గ దేశాల ప్రభుత్వాలతో మొగమాటాలా? వేరే మతలబులున్నాయా? మీ కామెంట్ ప్లీజ్!
ఇందులో మోదీని కలపటం అన్యాయం. అతడొచ్చాక పరిస్థితి మారింది.

పి.వి.శివప్రసాదరావు, అద్దంకి
శేషాచలం అడవుల్లో సిసి కెమెరాలు పెట్టామనే విషయం బహిర్గతం చేస్తే అడవి దొంగలు జాగ్రత్తపడి విరుగుడు ఆలోచించరా?
ఆ కెమెరాలనూ ఎత్తుకుపోగలరు.

పోలీసులు రాత్రి పహారాలో జీపుల్లో తిరుగుతూ సైరన్ మోగించటం దొరక్కుండా పారిపొమ్మనే సంకేతమా?
పోలీసులు తిరుగుతున్నారనే భరోసా ప్రజలకు కలిగించటానికే సైరన్లు. వాటిని విని నేరస్థులు పారిపోతే పోలీసులకు మంచిదే!

మామెడ రాజేంద్రప్రసాద్, వౌలాలి, హైదరాబాద్
పైరసీ అనేది లేకపోతే ‘బాహుబలి’ , ‘శ్రీమంతుడు’ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు చాలా సునాయాసంగా వంద రోజులు ఆడేవి కావా?
వంద రోజుల కాలం పోయింది. ఇప్పటి వ్యాపార లెక్కలు వేరు.

మహమ్మద్ యూసుఫ్, కాజీపేట
రేప్‌లో పాల్గొన్నది ఇద్దరే అయినప్పుడు అది గ్యాంగ్ రేప్ ఎలా అవుతుంది?
నిజమే. ఇద్దరు సమూహం కాదు. కాని రూఢి అయిన వేరే మాట లేనప్పుడు ఇలాంటి అనౌచిత్యాలు తప్పవు.
*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003
e.mail : bhoomisunday@deccanmail.com