S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలావుందీ వారం?

మేషం (ఏప్రిల్ 15 - మే 14)
గతంలో నిర్వహించిన లావాదేవీలలోని లోటుపాట్లు సరిదిద్దుకునేందుకు ఈ వారం అనుకూలం. ఆత్మీయులతో చర్చలు, అవగాహన సదస్సులు మీ నైపుణ్యానికి పదును పెట్టేవిగా ఉంటాయి. అధికారుల, సహచరుల ఆలోచనలను గ్రహించి మసలుకోవడం శ్రేయస్కరం. 27, 28 తేదీల్లో ప్రధాన విషయాలపై నిర్ణయాలు తీసుకోవడం జరుగవచ్చు. ఆర్థిక స్థితి సామాన్యం. కుటుంబ వ్యక్తుల మధ్య సమన్వయం కుదిర్చేందుకు అన్నివిధాలా కృషి చేసి ఉల్లాసం పొందుతారు.

వృషభం (మే 15 - జూన్ 14)
వివిధ విషయాల పట్ల చర్చలు, అవసరమైన మార్పులు వినోద, విజ్ఞాన కార్యక్రమాలతో వారమంతా ఉల్లాసంగా గడుపుతారు. భాగస్వాములతో నిర్ణయాత్మక, నిర్మాణాత్మక ప్రణాళికలను ప్రారంభించే అవకాశాలు అధికం. వాయిదా పడిన పనులు కొన్ని ఈ వారంలో పూర్తి చేస్తారు. ఖర్చులు ఇబ్బడిముబ్బడిగా ఉన్నా ధనలోపం ఉండదని చెప్పవచ్చు. నూతన అనుచర గణం అభిమానులు మీ విజయాలకు కావలసిన చేయూత నిస్తారు. మందులు వాడవలసి రావచ్చు.

మిథునం (జూన్ 15 - జూలై 14)
యంత్ర వాహనాల వాడుకలో జాగ్రత్తలు పాటించండి. సోదర వర్గంతో మాట పట్టింపులు రాకుండా, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోండి. శ్రద్ధాసక్తులతో విద్యా విషయాల్లో కృషిచేస్తే లక్ష్యాలను చేరుకోగలరు. పాత బాకీలు కొన్ని వసూలవుతాయి. 25, 26 తేదీల్లో స్పెక్యులేషన్, ఆర్థిక లావాదేవీలు మెలకువతో నిర్వహించాల్సి ఉంటుంది. అనుకోని సంఘటనల మూలంగా మీ ప్రణాళికలలో మార్పులు చేయవలసి రావచ్చు. ప్రయాణాలు వాయిదా పడవచ్చు.

కర్కాటకం (జూలై 15 - ఆగస్టు 14)
మీలో దాగి ఉన్న నైపుణ్యం, కార్యనిర్వహణా సామర్థ్యం అధికారులు గుర్తిస్తారనవచ్చు. వృత్తి వాణిజ్యాల్లో అనుకోని శుభ పరిణామాలు ఏర్పడి మీలో ఉత్తేజాన్ని నింపుతాయనడంలో సందేహం లేదు. మేధావులతో పరిచయాలు, కళా సాంస్కృతిక రంగాల్లో గుర్తింపు, నూతన పదవులు, గౌరవ పురస్కారాలు చేతి కందుతాయని ఆశించవచ్చు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. ఇతరులు మీపై ఉంచిన నమ్మకాన్ని కృషిచేసి నిలబెట్టుకుంటారు.

సింహం (ఆగస్టు 14 - సెప్టెంబర్ 14)
సదాశయంతో మీరు తలపెట్టే పనులు ఆలస్యంగానైనా విజయాన్ని చవి చూస్తాయి. లాభసాటి లావాదేవీలు బుధ, గురువారాల్లో నెరపగలరు. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడుతాయని ఆశించవచ్చు. వేడుకలు, వినోదాలలో కుటుంబ సమేతంగా పాల్గొంటారు. పాత వస్తువుల స్థానంలో కొత్తవి అమర్చుకోవడం జరుగవచ్చు. భాగస్వామ్యాలు మిశ్రమ ఫలితాలనిస్తాయి. కీలక రంగాల్లో పనిచేసే వ్యక్తుల పరిచయం మీలో కొత్త ఆశలను చిగురింపజేస్తాయి.

కన్య ( సెప్టెంబర్ 15- అక్టోబర్ 14)
ప్రత్యర్థుల పన్నాగాలను భగ్నం చేయగలుగుతారు. విశేష కృషిచేస్తే తప్ప మీ పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి గురు, శుక్రవారాల్లో బయటపడ గలుగుతారు. పోటాపోటీ కృషి చేసి వృత్తి ఉద్యోగాల్లో మీ స్థానాన్ని పదిలపరచుకో గలుగుతారు. సంధి ప్రయత్నాలు చేసి ఆత్మీయుల అపోహలను తొలగించ గలుగుతారు. సేవా సంస్థలు, ప్రజాహిత సంఘాల ద్వారా సమాజ ప్రక్షాళనా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయం పెరుగుతుంది.

తుల (అక్టోబర్ 15- నవంబర్ 14)
మీకున్న పరిమితులు, పరిధులలో శక్తివంచన లేకుండా కృషి చేసి చేపట్టిన పనులు వారాంతానికి పూర్తి చేస్తారు. భాగస్వాముల అవసరాలు, కోరికలు తీర్చడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తే తప్ప పరిస్థితులు అదుపులోనికి రావని గ్రహించండి. నెలసరి వాయిదాలు, బిల్లులు చెల్లించడంలో కృతకృత్యులవుతారు. బుధ, గురువారాల్లో శిరోభారం, శారీరక శ్రమ తప్పకపోవచ్చు.

వృశ్చికం (నవంబర్ 15-డిసెంబర్ 14)
కుటుంబ వ్యక్తుల ప్రతిభా పాటవాలు, మీకు ఆనందాన్ని కలుగజేస్తాయి. స్వయంకృషితో బృహత్తర పథకాలను నిర్వహించే ప్రయత్నం చేస్తారు. రాజకీయ, సామాజిక వర్గాల్లో మీ ప్రాముఖ్యత ఇనుమడిస్తుంది. మీ ఆలోచనలు, ఆచరణ మార్గాలు అన్ని వర్గాల వారిని ఆకర్షిస్తాయని చెప్పవచ్చు. సహచరుల తోడ్పాటుతో వృత్తి వాణిజ్యాలు సంతృప్తికరంగా సాగుతాయని ఆశించవచ్చు. ఆస్థి లావాదేవీలు శుక్ర, శనివారాల్లో ప్రాధాన్యత సంతరించుకుంటాయి. పెద్దల ఆశీస్సులు పొందుతారు.

ధనస్సు (డిసెంబర్ 15-జనవరి 14)
ఆత్మీయుల ఆలంబనతోపాటు ఎదురుచూస్తున్న అవకాశాలు కూడా లభించి మీకీ వారం తోడవుతాయి. మీ ఆధ్వర్యంలో వినోద, వైజ్ఞానిక సదస్సులు, సమారాధనలు జరుగుతాయి. ఆర్థిక పరిపుష్టి కోసం మీరు తలపెట్టిన మార్పులు సత్ఫలితాల నందజేస్తాయని ఆశించవచ్చు. వారమంతా నిర్విరామంగా కార్యక్రమాలు చేపట్టడంతో గృహ సంబంధ విషయాలు కొన్ని వాయిదా పడవచ్చు. పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.

మకరం (జనవరి 15-ఫిబ్రవరి 14)
ఊహాజనిత భయాల నుండి బయటపడి ముఖ్య విషయాలపై దృష్టి నిలపడం అవసరం. రావలసిన బాకీలు కొన్ని బుధ, గురువారాల్లో చేతికందే సూచనలున్నాయి. ధైర్య సాహసాలను ప్రదర్శించి ప్రత్యర్థులను నిలువరించ గలుగుతారు. ఆధ్యాత్మిక, మత సంబంధ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అప్రయత్నంగానే ప్రముఖుల సాయం లభించడంతో కొన్ని పనులు సులువుగా పూర్తవుతాయి. ఇన్సూరెన్స్, సాంస్కృతిక రంగాలలో మీ కృషి ఫలప్రదంగా ఉంటుంది.

కుంభం (ఫిబ్రవరి 15-మార్చి 14)
అతి ప్రయత్నం మీద కొన్ని పనులు ఓ కొలిక్కి తీసుకురాగలుగుతారు. తాపత్రయాలు పెరిగినా అవకాశాలు వినియోగించుకునేందుకు స్వయంకృషి అవసరమని గ్రహించండి. బృహత్ఫలితాలను పొందాలంటే, కొన్ని సుఖాలను వదలుకోవడం తప్పకపోవచ్చు. బంధుమిత్రుల సందర్శనంతో ఉల్లాసం, ఉత్సాహం లభిస్తాయి. 25, 26 తేదీల్లో విరుద్ధ భావాలున్నవారితో కలిసి సంఘటిత కార్యక్రమాలు నెరపాల్సి ఉంటుంది. వస్త్భ్రారణాలు, అలంకరణల కోసం ధనం వెచ్చిస్తారు.

మీనం ( మార్చి 15- ఏప్రిల్ 14)
ఇచ్చిపుచ్చుకోడాలు, భాగస్వామ్యాలలో కొంత అసంతృప్తి ఏర్పడినా మొత్తం మీద వారమంతా సౌఖ్యదాయకంగా ఉంటుంది. ప్రయాణాలు, ప్రచారాలు మీ కార్యదక్షతకు ప్రతీకలుగా నిలుస్తాయనవచ్చు. జాప్యం తప్పకపోయినా ఆస్తి లావాదేవీలు, వివాహాది శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. రాని బాకీల గురించి ఆందోళన చెందక నూతన ఆదాయ మార్గాలలో కృషి చేయడం శ్రేయస్కరం. విద్యార్థుల కృషికి తగిన ప్రోత్సాహ పురస్కారాలు అందుకుంటారు.

ఎస్.రవిప్రకాశ్