S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వీటి అరుపు దెయ్యంలా ఉంటుంది!

చూడటానికి అసహ్యంగా కన్పించే ఈ టాస్మేనియన్ డెవిల్స్‌కు వాటి అరుపువల్లే ఆ పేరు వచ్చింది. తీవ్రమైన స్వరంతో, భయంగొలిపేలా అరిచే ఈ జంతువుల పళ్లు చాలా బలంగా ఉంటాయి. లోహపు ఫలకాన్నికూడా కొరికేంత శక్తి వీటికి ఉంది. బతికున్న జంతువులనూ పట్టి పీక్కుతినే ఇవి వెంట్రుకలనూ వదలకుండా ఆరగించేస్తాయి. ఆస్ట్రేలియాలోని టాస్మేనియా దీవుల్లో మాత్రమే కన్పించే ఇవి కొవ్వును తోకల్లో నిల్వ చేసుకుంటాయి. వీటి తోకలు సుష్టుగా ఉంటే అవి ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. తోకలు సన్నగా ఉంటే అవి రోగాలతో బాధపడుతున్నట్లు తెలిసిపోతుంది. వీటికి సులువుగా రోగాలు అంటుకుంటాయి. వీటి ప్రధాన శత్రువు డింగోవైల్డ్ డాగ్.

ఎస్.కె.కె.రవళి