S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

డంగ్ బీటిల్స్ మూడు రకాలు

పర్యావరణానికి ఎంతో మేలు చేసే ‘డంగ్ బీటిల్స్’ ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. జీవులు విసర్జించిన మలాన్ని క్షణాల్లో రీసైకిల్ చేసే ఈ బీటిల్స్ ప్రపంచానికి చేసే మేలుకు వెలకట్టలేం. ఏనుగు విసర్జించిన పేడను తినేందుకు క్షణాల్లో 16వేల డంగ్ బీటిల్స్ చేరిపోతాయి. అవి కేవలం రెండు గంటల్లో ఆ పేడను తరలించేస్తాయి. ఒక్కో డంగ్ బీటిల్ తన శరీర సామర్థ్యానికన్నా 250 రెట్లు అధిక బరువును దొర్లించుకుపోయే శక్తి కలిగి ఉంటుంది. బంతుల్లా చుట్టి మలాన్ని తరలించే ఈ డంగ్ బీటిల్స్ గుడ్లను ఆ బంతుల్లోనే పెట్టేస్తాయి. వీటిలో మూడు రకాలుంటాయి. మలాన్ని ఎక్కడుందో వెతికి, వాటిని తరలించేవాటిని రోలర్స్ అంటారు. అలాగే మలం ఎక్కడుందే గుర్తించి, చిన్నచిన్న సొరంగాలను తవ్వి తరలించేవాటిని టన్నలర్స్ అంటారు. స్వయంగా మలాన్ని విసర్జించి, వినియోగించే బీటిల్స్‌ను
డ్వెల్లర్స్ అంటారు. వ్యాధులు వ్యాప్తిచెందకుండా, పర్యావరణాన్ని కాపాడేలా, చెత్తపేరుకుపోకుండా ఇలా ఎన్నోరకాలుగా ఈ బీటిల్స్ ప్రజలకు సహకరిస్తున్నాయి.

ఎస్.కె.కె.రవళి