S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఈ పండు అక్కడ నిషేధం!

అచ్చం పనసపళ్లలా కన్పించే వీటిని డురియన్ ఫ్రూట్స్ అని పిలుస్తారు. ఆగ్నేయ ఆసియాలో వీటిని ఎక్కువగా పండిస్తారు. బాగా పండినప్పుడు ఈ పళ్లు కుళ్లిన ఉల్లిపాయల్లా దుర్వాసన వెదజల్లుతాయి. రుచి తియ్యగానే ఉన్నా ఈ వాసన ఎవరూ భరించలేరు. ప్రపంచంలో డురియన్ పళ్ల సాగులో థాయ్‌లాండ్ అగ్రస్థానంలో ఉంది. సింగపూర్ సహా పలు ఆగ్నేయ ఆసియా దేశాల్లో బహిరంగ ప్రాంతాల్లో వీటిని పెంచడం, విక్రయించడం, వినియోగించడం నిషేధించారు. మెట్రోరైళ్లు, బస్సులు, విమానాలు, సినిమాహాళ్లు, పార్కులవంటి పబ్లిక్‌ప్లేసుల్లో వీటిని వాడితే భారీ జరిమానా తప్పదు. ఈ పళ్ల ఉపరితలంపై ముళ్లలాంటి బొడిపెలుంటాయి. పనసపళ్లలా కన్పించినా వాటితో వీటికి ఎటువంటి సంబంధం లేదు.

ఎస్.కె.కె.రవళి