తెలివైందే!
Published Saturday, 11 June 2016బాలీవుడ్లో ‘బాజీరావు మస్తానీ’ చిత్రం తర్వాత విన్ డీజిల్ సరసన ‘ట్రిపుల్ ఎక్స్: ది జాండర్ కేజ్’ చిత్రంతో హాలీవుడ్లో తెరంగేట్రం చేసిన దీపికా పదుకొనే పరిస్థితి ప్రస్తుతం బాలీవుడ్లో అంత ఆశాజనకంగా లేదని ఆమె సన్నిహితులు వాపోతున్నారు. హిందీలో యువ కథానాయికల జోరు కొనసాగుతుండడంతో ఇలాంటి తారల కెరీర్ రోజు రోజుకీ మసకబారుతోందని అంటున్నారు. హాలీవుడ్లో ‘ట్రిపుల్ ఎక్స్’ చిత్రంలో నటిస్తూ ప్రస్తుతం అక్కడ బిజీగానే వుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో హాలీవుడ్ తప్ప బాలీవుడ్ చిత్రాలే లేవనీ అంటున్నారు. దీంతో ఇక బాలీవుడ్‌కు దూరమైనట్టేనా? అని దీపికాను అడిగితే- ‘‘అలా అని ఎందుకనుకుంటున్నారు? బాలీవుడ్ తర్వాత హాలీవుడ్డే కదా..ఎవరికైనా టార్గెట్. అక్కడ వస్తున్న అవకాశాల వల్ల బాలీవుడ్‌కి కాల్షీట్లు సర్దుబాటు చేయడం కుదరడం లేదు. అంత మాత్రాన ఇక అంతేనా? అంటే ఎలా?’’అంటూ తేలిగ్గా కొట్టిపారేసింది. తెలివైందే!!