S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భగత్‌సింగ్

భగత్‌సింగ్
ఆదివారం అనుబంధంలో ఎం.వి.ఆర్. శాస్ర్తీగారి సీరియల్ ‘్భగత్‌సింగ్’ చదివాను. ఆరంభం నుండే చదివించదగిన రీతిలో ఉంది. భగత్‌సింగ్ డి.ఎ.వి. స్కూలులో చదివే చిన్న వయసులోనే జాతీయతా భావం ప్రస్ఫుటమవడం, జలియన్ వాలాబాగ్ దురంతం జరిగిన చోటుకు వెళ్లి వేలాదిమంది నేలకొరిగిన ఆ భారతీయ పౌరుల మట్టిని సేకరించి ఆ మట్టి మీద వొట్టు పెట్టి మన మాతృభూమిని విదేశీ చెర విడిపించడానికి తన ప్రాణాలు ధారపోయడానికి నిశ్చయించుకొన్న తీరు మనల్ని కదిలించివేయక మానదు. మళ్లీ సంచిక కోసం ఎదురుచూసేలా ఆసక్తికరంగా అందజేస్తున్న శాస్ర్తీగార్కి ధన్యవాదాలు.
-శ్రీదాస్యం లక్ష్మయ్య (హుస్నాబాద్)

భగత్‌సింగ్ ఉరితో ప్రారంభించి బాల్యంలోకి వెళ్లడం వింతగా అనిపించింది. నా సొంత ఇష్టం కంటే జాతి అవసరమే ముఖ్యం అన్న తండ్రి, నాల్గవ ఏటనే తుపాకులు నాటి తెల్లవారిని తగిలేస్తా అన్న కొడుకు దేశభక్తి అలరించింది. అలాగే ‘లోకాభిరామమ్’లో చాదస్తం అంటున్న కొన్ని సంప్రదాయాలలో చాలా లోతు ఉన్నదంటూ గొప్పగా వివరించారు గోపాలంగారు. బోధ్‌గయ గురించి చెప్పిన అంశాలు బాగున్నాయి. ఎంత పకడ్బందీ ప్లాన్ వేసినా చిన్న పొరపాటు చేసి నేరగాడు దొరికిపోక తప్పదని ‘డాలర్ డ్రీమ్స్’ నిరూపించింది.
-పి.చంపక్ (మాధవనగర్)
కథ
‘నిజం కాని భయం’ కథ సమాజంలో ఇంకా పరిఢవిల్లుతున్న మానవత్వ పరిమళాలను గూర్చి చక్కగా తెలియజేసింది. ఈ కలియుగంలో ధర్మం ఇంకా ఒక పాదాన ప్రకాశిస్తోందంటే, ధర్మాచరణకు కట్టుబడి వున్న కొందరి చలవే అన్నది నిర్వివాదాంశం. అజ్మీర్ కేంద్రంగా స్వామి దయానంద సరస్వతి స్థాపించిన మహా పరోపకారిణి సంస్థ ధర్మోద్ధరణ, వేద పరిరక్షణ, సంసకృతి, భాషా పరిరక్షణే ధ్యేయంగా నిర్వర్తిస్తున్న కార్యకలాపాలను గురించి విశదీకరించినందుకు కృతజ్ఞతలు.
-ఎం.కె.జి (ఎం.ఎస్.పాలెం)
సండే గీత
ఆదివారం అనుబంధంలోని ‘సండే గీత’ ద్వారా మనలో ఉన్న అత్యున్నతమైన దాన్ని గుర్తించి వెలికితీసే వ్యక్తి మాత్రమే మంచి మిత్రునిగా పరిగణించాలని తెలుసుకున్నాం. సమస్త తప్పిదాలకు కారణం మనసు. దాన్ని సరిగ్గా ఉంచుకుంటే ఎప్పటికీ తప్పులు చేయవు అన్న గౌతమబుద్ధుని దివ్య బోధను పునశ్చరణ చేసుకుని తరించే మహద్భాగ్యాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు. అలాగే -ఉగ్గు పాలతోటే నరనరాన దేశభక్తిని వొంటబట్టించుకున్న భగత్‌సింగ్ గురించిన వాస్తవాలను చదువుతుంటే వొళ్లు గగుర్పొడిచింది. అనిర్వచనీయ అనుభూతిని సొంతం చేసుకున్నట్టయింది. సూకీ నాయకత్వంలో మయన్మార్ అభివృద్ధిపరంగా, ప్రగతిపరంగా, సామాజిక, ఆర్థిక రంగాల్లో అనన్యమైన పురోగతిని సాధించాలని శాంతికాముకులంతా ఆశిస్తున్నారు - అంటూ ముగిసిన ‘సూకీ...’ కవర్‌స్టోరీ గురించి ఎంత చెప్పినా తక్కువే.
-అల్లాడి వేణుగోపాల్ (బారకాసు)
రణక్షేత్రం
ఆద్యంతం తమ శైలితో ‘రణక్షేత్రం’ సీరియల్‌ను అందిస్తున్న రచయితకు కృతజ్ఞతలు. కథని ఆయా పాత్రల నేపథ్యంలో నడిపించటం మరింత బాగుంది. ఇక ‘లోకాభిరామమ్’లో అందించిన వారణాసి విశేషాలు తీయటి అనుభూతిని కలిగించాయి.
-ఎ.వి.సోమయాజులు (కాకినాడ)
ఉక్కు మహిళ సూకీ
మయన్మార్‌లో ప్రజాస్వామ్యం సాధించిన ఉక్కు మహిళ సూకీ ఘన చరిత్ర ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోతుంది. అలాగే జపాన్‌లో అవోకి జహరా శాన్‌ఫ్రాన్సిస్కోలో గోల్డెన్ గ్రేట్ బ్రిడ్జిలు ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఆత్మహత్యలు జరుగుతున్న ప్రాంతాలుగా గుర్తింపు పొందడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
-తాళాబత్తుల సత్యనారాయణ మూర్తి (మల్కాపురం)
ఓ చిన్న మాట
ఈ శీర్షికన అందించిన కథనం బాగుంది. విన్నవాళ్లు.. కన్నవాళ్లు మొదట చేయాల్సింది.. స్మార్ట్ ఫోన్ల పవర్ బటన్ ఆఫ్ చేసి, హృదయాల పవర్ బటన్‌లను ఆన్ చేయడం..! ‘వైకుంఠపాళి’ కవిత ఉన్నతంగా ఉంది. ‘అనగనగా ఓ జాబిలమ్మ’ కథ మా ఇంటిల్లిపాదినీ అలరించింది.
-నేమాన సుభాష్ చంద్రబోస్ (విశాఖపట్నం)
వినదగు
భగవద్గీతపై ‘వాసిలి’గారు అందిస్తున్న ‘వినదగు’ అద్భుతమైన వ్యాఖ్యానం మమ్మల్ని ఎంతగానో అలరించింది. భగత్‌సింగ్ సీరియల్ ప్రారంభమే అదరహో అనిపించింది. పుట్టగంటి గోపీకృష్ణగారి ‘రణక్షేత్రం’ సీరియల్ వారం వారం ఆసక్తిదాయకంగా సాగుతోంది. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ వంటి పరికరాలతో నిత్యం సహజీవనం చేస్తూ ప్రకృతిని, సాటి మానవులను పట్టించుకోకుండా కృతిమ జీవనం గడిపై హైటెక్కు వారికి ఈ వారం ఓ చిన్న మాట కనువిప్పు కలిగించే విధంగా ఉంది.
-ఎం.కనకదుర్గ (తెనాలి)
సిసింద్రీ
ఈ శీర్షికన అందించిన ‘సోమరి సిద్దప్ప’ కథ ఆలోచింపజేసేదిగా ఉంది. సిద్దప్ప సోమరితనాన్ని పోగొట్టడానికి చెప్పిన బెల్లం ముక్క కథ బాగుంది. ఉచితంగా వచ్చినది ఆపదల్ని తెస్తుందే కాని మన కోర్కెలను తీర్చదంటూ చక్కగా తెలియజేశారు. అలాగే ‘సండే గీత’లో వెచ్చటి బాధను గూర్చి చెబుతూ - ఇతరుల్లో వున్న మంచి లక్షణాలను ప్రేమించడం అదే ఉత్తమ లక్షణం అని చెప్పింది అక్షర సత్యం.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)