చికెన్ కర్రీ...సీగల్
Published Saturday, 18 June 2016ఈ సీగల్‌కు చికెన్ కర్రీపై మనసుపడింది. వేల్స్‌లోని ఓ చికెన్ రెస్టారెంటవద్ద తిరుగుతున్న ఈ పక్షి ఉన్నట్లుండి ఓ డస్ట్‌బిన్‌లో చికెన్ కర్రీని గమనించి అందులోకి దూకేసింది. తీరా దానికి చికెన్‌పీస్‌లు దొరకలేదు. కానీ చికెన్‌టిక్కా మసాలా గ్రేవీలో ఇది పూర్తిగా ములిగిపోయింది. తెల్లగా మెరిసిపోవాల్సిన సీగల్ మసాలా ఒంటపట్టించుకుని ఇదిగో ఇలా తయారైంది. రెస్టారెంట్లో పనిచేస్తున్న కార్మికులు దీనిని గమనించి వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. సీగల్స్ ఆహారంకోసం ఎంతకైనా తెగిస్తాయని తెలుసుగా. అవసరమైతే మనుషుల చేతుల్లోని ఆహార పదార్థాలనూ అవి దొంగిలిస్తాయి. అదిగో అలా దూకుడుగా వ్యవహరించి ఇలా తయారైంది.