S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అనెస్థిషియా (శాస్ర్తియ ఆవిష్కరణలు)

ప్రస్తుత కాలంలో శరీరంపై చిన్న కోత కోయాలన్నా, ఒక పన్నును తొలగించాలన్నా ఆ ప్రాంతాన్ని అచేతనపరచి నొప్పి లేకుండా చికిత్స నిర్వహిస్తున్నారు. వైద్యరంగం సాధించిన ప్రగతికి ఇదొక నిదర్శనం. కాని ఈ శరీరానికి ఇచ్చే మత్తు మందును కనుగొనక ముందు, ఒక పంటిని తొలగించేటప్పుడు లేదా ఒక శరీర అవయవాన్ని కోసి తొలగించేటప్పుడు ఆ రోగి ఎంతటి బాధను అనుభవించి ఉంటారన్నది ఊహించలేం. 1840 ప్రారంభంలో శస్త్ర చికిత్స వలన కలిగే నొప్పిని తగ్గించటానికి అప్పటి వైద్యులకు, రోగిని ఒక నిద్రావస్థలోనికి, ఆదేశాల ద్వారా పంపించటం ఒక మార్గంగా ఉండేది. లేదా విస్కీ తాగించటం ద్వారా అచేతన పరచటం చేసేవారు.
1844లో డెంటిస్ట్ హరేస్ వెల్స్, నైట్రస్ ఆక్సైడ్ యొక్క విషానికి విరుగుడుగా పనిచేసే గుణాలను ప్రదర్శించి చూపుతున్న ఒక ప్రదర్శనకు హాజరు కావటం జరిగింది. లాఫింగ్ గ్యాస్‌గా పిలువబడే ఆ ఆక్సైడ్‌ను, అపాయకరమైన శస్త్ర చికిత్సా విధానాలను అమలుపరచే సమయంలో వినియోగించవచ్చేమోనన్న ఆలోచన కలిగింది అతడికి. పాల్గొన్న వారిలో కాలుకు తీవ్రంగా గాయమైన ఒక వ్యక్తికి అసలు నొప్పిగానీ, బాధ గానీ తెలియకపోవటాన్ని వెల్స్ గమనించాడు. అతడి కంటే ముందు వారి వలెనే నైట్రస్ ఆక్సైడ్ యొక్క లక్షణాలను గుర్తించటంలో దశాబ్దాలు పనిచేసే మరొక డెంటిస్ట్ విలియమ్ మార్టన్‌కు లభించింది. 1846లో మార్టన్ ఒక రోగి యొక్క ఇన్‌ఫెక్షన్ సోకిన పన్నును చికిత్స చేసే సమయంలో ఈథర్ అంటే ఆల్కహాలు నుండి తయారుచేయబడిన ఒక రంగులేని ద్రవాన్ని ఉపయోగించటం జరిగింది. ఆ సమయంలో ఒక నిద్రావస్థలోనికి జారుకున్న ఆ రోగికి మెలకువ వచ్చేలోపల అతడి పన్నును తొలగించటంతో నొప్పి తెలియకుండానే ఆ చికిత్స ముగిసింది. తెలివిలోనికి వచ్చిన పేషెంట్‌కు మార్టన్ చికిత్స అయిపోయిందని చెప్పటంతో అతడు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత మార్టన్ -మెడపై కణితి పెరిగిన ఒక రోగికి జరిగే శస్తచ్రికిత్సను మస్సాచుసెట్స్ జనరల్‌లో ప్రదర్శించి, మరొక సాహసానికి పూనుకున్నాడు. ప్రారంభంలో సందేహంగా అనిశ్చితంగా ఉన్న మార్టన్ ఆ చికిత్స విజయవంతంగా పూర్తి కావటంతో గమనిస్తున్న వారి వైపు తిరిగి ప్రకటించాడు, ‘ఇదేమీ మాయ కాదని!’

-బి.మాన్‌సింగ్ నాయక్