S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తమన్నా..మజాకా!

ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కెరీర్‌ని చక్కగా ప్లాన్ చేసుకోవడంలో తమన్నాను మంచి మరొకరు లేరేమో అనిపిస్తుంది. అందుకే కాబోలు..టాలీవుడ్..కోలీవుడ్ అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తూ విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ ముందుకు దూసుకెళుతుంది. తనపై ఎలాంటి రూమర్స్ వచ్చినా అస్సలు లెక్క చేయదు. అంతేకాదు..వాటిపై ఏ మాత్రం స్పందించదు కూడా. బాగా పాపులర్ అయిన అందాల భామలు ఈ మధ్య సోషల్ మీడియాను నమ్ముకుంటూ అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. తమన్నా మాత్రం వాటిని కూడా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఎందుకు అని ఈ బ్యూటీని కదిలిస్తే- ‘‘ అలా అని ఎవరన్నారు. స్నాప్ చాట్ అనే లేటెస్ట్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్‌లో తాజాగా ఖాతా తెరిచాను. అభిమానులు..మిత్రులతో స్నాప్‌చాట్‌లో తీరిక వేళల్లో చాటింగ్ చేయాలనుకుంటున్నాను. దీని ద్వారా నా అభిరుచులను పంచుకోవాలనుకుంటున్నాను’’అంటూ ఎంతో ఆనందంతో చెప్పుకొచ్చింది. మరి..తమన్నా..మజాకా!!

-సమీర్