సృష్టి..ప్రతిసృష్టి
Published Saturday, 25 June 2016సృజనాత్మకతకు అచ్చమైన ఉదాహరణలు ఇక్కడి ఫొటోలు. లేనిదానిని ఉన్నట్లు చూపడంలో దిట్ట స్వీడిష్ ఫొటోగ్రాఫర్, రీటచర్ ఎరిక్ జాన్సన్. మంచి ఫొటోగ్రాఫర్ కావడంతో అద్భుతమైన దృశ్యాలను తన కెమెరాలో బంధించి, ఆ తరువాత క్రియేటివిటీతో ఇలా మ్యాజిక్ చేయడం అతడికి అలవాటు. ఈ విద్యను ఎవరివద్దా అతడు నేర్చుకోలేదు. కేవలం ఆసక్తితో, తనకు తానుగా నేర్చుకున్నాడు. రోడ్డు ఫోటో తీసి చివర్లో రగ్గు చుట్టేస్తున్నట్లు భ్రమకల్పించేలా ఫొటోషాప్, రీటచ్తో ఎలా మార్చేశాడో చూడండి. అతడి చేతుల్లో ఎన్నో అద్భుతమైన ఫొటోలు రూపుమార్చి కన్నార్పకుండా చూసేలా చేయడంలో అతడు దిట్ట.