S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఓ చిన్న మాట (మాతో-మీరు)

బ్రతుకు పరుగు పందెంలో అలసిసొలసి పోయి, బాధ్యతల బరువుతో కృంగిపోయి అనేక భావాలతోపాటు నవ్వడం కూడా మర్చిపోయిన వారందరికీ ‘ఓ చిన్న మాట’లో నవ్వడమే ఒక టానిక్ అంటూ ప్రచురితమైన కథనం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఎన్ని ఒత్తిళ్లలో వున్నా రోజులో కనీసం పది నిమిషాలు రిలాక్సింగ్‌గా కూర్చొని మనసారా నవ్వుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇక - ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, అమెరికాలో జాత్యహంకారంపై అలుపెరుగని పోరాటం జరిపిన యోధుడు క్లాసియస్ క్లే జూనియర్ ఉరఫ్ మహ్మద్ అలీ జీవిత చరిత్ర ఆద్యంతం ఆసక్తిదాయకంగా చదివించింది. ‘నేను సైతం’ కథ నారాయణ స్వరూపులైన వైద్యులకు మానవతా దృక్పథం అలవరచుకోవాల్సిన ఆవశ్యకతను చక్కగా తెలియజేసింది.
-సి.ప్రతాప్ (శ్రీకాకుళం)
నవ్వు
నవ్వుతూ బ్రతకాలి. నవ్వించగలగాలి. నవ్వడం ఓ యోగం, నవ్వించడం ఓ భోగం, అసలు నవ్వకపోవడం ఓ రోగం అన్నాడో రచయిత. కొందరివి స్టోన్ ఫేసులు! నవ్వు వారి ముఖాన అతకదు. అటువంటి వారు ఇతరులను నవ్వించలేరు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఎప్పటికీ చిరునవ్వు లాస్యమాడుతున్నట్లుంటుంది. నవ్వు నాలుగు విధాల చేటంటారు. అనవసరంగా నవ్వకూడదు. మయసభలో ద్రౌపది నవ్వు కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసింది. ఇంట్లో అందరూ సమావేశమయినప్పుడు కూడా సంభాషణలలో హాస్యం జోడించాలి. హాసము లేని ఉపన్యాసము పరిహాసముతో సమానమన్నారు. ‘నవ్వు’ గురించి ఎంతో చక్కగా చెప్పారు. కృతజ్ఞతలు.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
అవీ-ఇవీ
నీటిపై బుడగలు సృష్టిస్తూ లాలాజలంతో విషం చిమ్మే జీవులు, నీళ్లపై పరుగెత్తే తొండ, ఒంటికాలితో ఈదే హంస లాంటి విశేషాలతో అబ్బురపడ్డాం. సృష్టిలో ఎన్ని వింతలో కదా! నవ్వడం మరిచిపోయాం. నడక మరిచిపోయాం.. అంటూ మనం ప్రకృతికి ఎంత దూరం జరిగిపోయామో ఓ చిన్న మాటగా చెప్పి ఆలోచింపజేశారు.
-పి.శాండిల్య (కాకినాడ)
లోకాభిరామమ్
గోపాలంగారి జ్ఞాపకాల పందిరిలో మాకూ సత్కాలక్షేపమే అయింది. గాలిబ్ గురించి చదువుతూంటే మాకు శ్రీశ్రీ జ్ఞాపకం వచ్చాడు. శ్రీశ్రీని లక్కీ రిచ్ గాలిబ్ అనొచ్చునేమో. ఆయన్ని ఈనాటికీ మోసేవాళ్లున్నారు. గాలిబ్‌కి ఆ అదృష్టం లేకపోయింది. చట్టాల్ని కఠినతరం చేసి కల్తీలు అరికట్టాలని ఒక పాఠకుడన్నారు. ప్రజలకూ కాస్తంత బాధ్యత ఉండాలి. కూల్‌డ్రింక్స్‌లో హానికారకాలలున్నాయని చెప్తే ఎవరైనా తాగడం మానేశారా? నూడుల్స్‌లో సీసం ఉందని అమ్మకాలు నిషేధిస్తే ఆన్‌లైన్‌లో తెప్పించుకొని మరీ తిన్నారు కొందరు. ఇలాంటి ప్రజలున్నప్పుడు కఠిన చట్టాలు మాత్రం ఏం చేస్తాయి?
-ప్రచండ్ (శ్రీనగర్)
భగత్‌సింగ్
ఈ వారం ‘్భగత్‌సింగ్’ ధారావాహికలో ‘ఆకలి పోరాటం’ చదువుతూంటే భగత్‌సింగ్ నాయకత్వంలోని విప్లవకారుల పోరాట పటిమకు హేట్సాఫ్ అనిపించింది. బ్రిటీష్ జైళ్లలో యావజ్జీవ శిక్ష అంటే నరకప్రాయం అని తెలిసినా దేశమాతకు స్వాతంత్య్ర సిద్ధి కోసం విప్లవవాణిని బలంగా వినిపించేందుకు, తద్వారా యావత్ భారత జాతిని జాగృతం చేసేందుకు సత్యాగ్రహం మార్గాన్ని ఎంచుకొని, తానే లేకుండా లాహోర్ జైలులో బందీలుగా మగ్గుతున్న వందలాది ఖైదీల చేత నిరాహారదీక్ష చేయించి తెల్లదొరల వెన్నులో వణుకు పుట్టించేలా చేసిన భగత్‌సింగ్ దేశభక్తి, నాయకత్వ పటిమ నిరుపమానం. అద్వితీయం. అసామాన్యం. 25 రోజుల దీక్ష తర్వాత కోర్టుకు స్ట్రెచర్‌పై తీసుకువచ్చినా డిఫెన్స్ లాయర్‌తో కేసు విషయాలు చర్చించాడని చదివాక అతని కమిట్‌మెంట్‌కి జోహార్లు.
-ఎం.కనకదుర్గ (తెనాలి)
ఉక్కు పిడికిలి
ఈ వారం స్పెషల్‌లో ‘ఉక్కు పిడికిలి’ బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీ గురించి ఎన్నో చక్కటి విషయాలను తెలియజేశారు. చాలా బాగుంది. అలాగే ఓ చిన్న మాటలో ‘నవ్వడమే ఒక టానిక్’ అంటూ నవ్వును గురించి తెలియజేసిన సంగతులు మా ఇంటిల్లిపాదినీ అలరించాయి. మనసారా నవ్వండి, జీవితాన్ని అనుభవించండి అన్న మాటలు బాగున్నాయి. ‘సండే గీత’లో‘నయా పైస’ గురించి, వాటి విలువలను గూర్చి చక్కగా తెలియజేశారు. ఆ కథనం చదువుతూంటే పాత నాణెలు గుర్తుకొచ్చాయి. సిసింద్రీలో ‘సదాచారం’ కథ బాగుంది. మనిషి ఆచరించవలసిన సంస్కారాలలో నమస్కారం ప్రధానమైనదని చక్కగా చెప్పారు. ఇది సత్యం.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)
మహా విజేత
ధారావాహిక సీరియల్ ‘మహా విజేత’ మమ్మల్ని రాజుల కాలంలోకి తీసుకెళుతోంది. ఆనాటి పనిముట్లు, ఆయుధాలు, యుద్ధ విద్యలు... ఇవన్నీ చదువుతూంటే జానపద సినిమా కళ్ల ముందు కదలాడినట్లనిపిస్తోంది.
-గుండు రమణయ్య (పెద్దాపూర్)
మీకు తెలుసా?
‘మీకు తెలుసా?’ శీర్షిక ద్వారా బ్రిటన్ జాతీయ పక్షి రాబిన్ గురించి ఎన్నో ఆసక్తిదాయకమైన విషయాలను తెలుసుకున్నాం.
-అల్లాడి వేణుగోపాల్ (బారకాసు)