S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎన్నో ఆశలు!

‘ఒక లైలాకోసం..’ అంటూ నాగచైతన్య అందాల తార పూజాహెగ్డేతో ఆడిపాడిన చిత్రం గుర్తుంది కదా. అవును..అప్పుడే ఎలా మరచిపోతాం. పూజా హెగ్డేకు టాలీవుడ్‌లో తొలి చిత్రం అది. అటు తర్వాత తన రెండో చిత్రం ‘ముకుందా’లో గోపికమ్మ పాత్రలో తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ చిత్రంలో పూజాహెగ్డే నటనలో వైవిధ్యాన్ని చూసిన బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ ముగ్ధుడయ్యాడట. అంతటితో ఆగకుండా ఆమెకు మరచిపోలేని ఛాన్స్ ఇచ్చాడు. అదే ‘మొహంజదారో’. బాలీవుడ్ టాప్ హీరోలో ఒకరైన హృతిక్ రోషన్ సరసన అవకాశం రావడంతో పూజాకు అంతులేని ఆనందం కలిగిందట. ఎంతో చారిత్రక నేపథ్యం వున్న ఈ ‘మొహంజదారో’ను దర్శకుడు 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ‘‘నిజంగా ‘మొహంజదారో’ నాకు గొప్ప అవకాశమే. ఈ చిత్రం కోసం ఎన్నో అవకాశాలను వదులుకున్నా. నా పాత్ర కోసం అహర్నిశలు శ్రమించా. నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుందన్న ఆశ వుంది. ఎంతో చారిత్రక నేపథ్యం వున్న ఈ సినిమాలో నటించే అవకాశం రావడం గొప్ప వరంగానే భావిస్తున్నా’’ అంటూ చెప్పుకొచ్చింది పూజా.

-సమీర్