S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘ఐటమ్ భామ’గా!

అవును..అందాల ‘చందమామ’ కాజల్ అగర్వాల్ మరో కొత్త అవతారం ఎత్తబోతోందట. మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్‌తో ‘మగధీర’లో చిందులేసిన ఈ ముద్దుగుమ్మ అటు తర్వాత అతడితోనే ‘గోవిందుడు అందరివాడేలే’ జతకట్టిన విషయం తెలిసిందే. మళ్లీ చరణ్‌తో నటించే అవకాశమే రాలేదు కాజల్‌కు. చాన్నాళ్లకు ఇప్పుడొచ్చింది ఆ ఛాన్స్! రామ్‌చరణ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ధ్రువ’లో అతడికి జోడీగా నటించనుందట. అయితే అదీ..హీరోయిన్‌గా కాదు సుమా! ఐటమ్ భామగానట. ఈ ‘ఐటమ్’కోసం ముందుగా ఎవరెవర్నో అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఇందుకు సరిపోరని భావించిన చిత్ర బృందం ఈ ‘ఐటమ్’కోసం టాప్ హీరోయిన్ అయితే బావుంటుందని సూచించందట. దాంతో ఆ అవకాశం కాజల్‌ని వరించింది. అసలే టాలీవుడ్‌లో అవకాశాలు లేక విలవిల్లాడిపోతున్న ఈ భామకు వచ్చిన అవకాశం..అదీ రామ్‌చరణ్ సరసన కావడంతో వెంటనే ఓకే అనేసిందట. ఇటీవల కాజల్ నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా చతికిలబడ్డ విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఇది కూడా చేజారితే ఇక కెరీర్ అంతే అనుకున్నట్లుంది కాజల్. దీంతోనైనా మళ్లీ టాలీవుడ్‌లో ఆశలు చిగురిస్తాయేమోనన్న భావన కాజల్‌లో వుందట. ఈ బ్యూటీకి ఆల్ ది బెస్ట్ చెబుదాం...!!

-సమీర్