S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జిజిహెచ్‌లో చీరాల వాసి ఆత్మహత్య

గుంటూరు, జూలై 2: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెంకు చెందిన పారేపల్లి వెంకటేశ్వరరావు బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థలం వివాదంలో తనపై కేసు పెట్టారన్న అవమాన భారంతో సొంత గ్రామంలోని తోటవారిపాలెంలో శనివారం తెల్లవారు జామున ఆత్మహత్యకు యత్నించగా వెంకటేశ్వరరావును చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బాత్‌రూమ్‌కు వెళ్లివస్తానన్న వెంకటేశ్వరరావు ఎంతకూ రాకపోవడంతో భార్య గీత, అత్తమామలు బాత్‌రూమ్ వద్దకు వెళ్లి పిలిచినప్పటికీ ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో పెద్దగా కేకలు వేయడంతో నర్సింగ్ సిబ్బంది వచ్చి బాత్‌రూమ్ డోర్‌ను పగలగొట్టి చూడగా వెంకటేశ్వరరావు లుంగీతో ఉరివేసుకుని కనిపించాడు. వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.