S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కరవు తీరింది

హైదరాబాద్, జూలై 2: ఆంధ్ర రాష్ట్రంలో కరవు తీరా వర్షాలు పడ్డాయి. నైరుతి రుతుపవనాలు ఆలస్యమైనా, జూన్ నెలలోనే సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వర్షాలు బాగా కురవడంతో రైతులు ఖరీఫ్ సాగు పనులు వేగవంతం చేశారు. కోస్తా జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లాలో సాధారణ వర్షపాతం 146.7 సెం.మీకు 291.2 సెం.మీ, గుంటూరులో 97.7 సెం.మీకు 202.8 సెం.మీ, కృష్ణా జిల్లాలో 132.9 సెం.మీకు, 307.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లాలో 59.1 సెం.మీక 90.5 సెం.మీ, ప్రకాశం జిల్లాలో 69 సెం.మీకు 100.9 సెం.మీ, శ్రీకాకుళం జిల్లాలో 162.1 సెం.మీకు 211.9 సెం.మీ, విశాఖపట్నం జిల్లాలో 144.5 సెం.మీకు 212.4 సెం.మీ, విజయనగరం జిల్లాలో 155.8 సెం.మీకు 244.9 సెం.మీ, పశ్చిమగోదావరి జిల్లాలో 150 సెం.మీకు 344.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. రాయలసీమలో అనంతపురం జిల్లాలో 56.7 సెంమీకు 97.3 సెం.మీ, చిత్తూరు జిల్లాలో 71.3 సెం.మీకు 137.4 సెం.మీ, కడప జిల్లాలో 73.2 సెంమీ, కర్నూలు జిల్లాలో 84.6 సెం.మీ వర్షపాతం నమోదైంది.
వర్షాలు ఆశించినట్లుగా బాగా కురవడంతో రాష్ట్రప్రభుత్వం ఆహార ధాన్యాల ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టిని పెట్టింది. ఈ ఏడాది మొత్తం 50.21 లక్షల హెక్టార్లలో 185.66 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ ఏడాది వరిసాగు 25.5 లక్షల హెక్టార్లలో ఉత్పత్తి 139.022 లక్షల టన్నులకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ సంవత్సరం ఖరీఫ్‌లో గుంటూరు జిల్లాలో 2.56 లక్షల హెక్టార్లలో 14 లక్షల 62 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేయాలని నిర్దేశించారు. శ్రీకాకుళం జిల్లాలో 2.13లక్షల హెక్టార్లలో 7.85 లక్షల మెట్రిక్ టన్నులు, కర్నూలు జిల్లాలో 85 వేల హెక్టార్లలో 4 లక్షల 69వేల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు.