S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రోడ్డు ప్రమాదాల నివారణకు విస్తృత ప్రచారం

ఆదిలాబాద్, జూలై 2: రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, హెల్మెట్ వాడకంపై చైతన్యం తీసుకవచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రవాణాశాఖ, ఆర్టీసి తదితర శాఖలతో జిల్లాకలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రతప్రమాదాల నివారణపై సమీక్షించి, పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు పెద్దఎత్తున ప్రమాదాలకు గురవుతున్నారని, ప్రమాదాలు నివారించడానికి జూన్ 2 నుండి నో హెల్మెట్‌నోపెట్రోల్ అమల్లోకి తీసుకురావడం జరిగిందన్నారు. ద్విచక్రవాహనదారులు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించి ప్రమాదాలు అరికట్టాలని పిలుపునిచ్చారు. పాఠశాల, కళాశాలల విద్యార్థులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్సులు తరుచుగా ప్రమాదాలకు గురవుతున్నాయని, తగు చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి సమీక్ష సమావేశానికి ముందుగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాల్సిన అవశ్యకతపై సిడిల ద్వారా వివరించాలని సమాచార ఉప కార్యనిర్వహణాధికారిని ఆదేశించారు. కార్యక్రమంలో శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ అనురాగ్ జయంత్, ఆర్డీవోలు సుధాకర్ రెడ్డి, శివలింగయ్య, జడ్పీ సిఈవో జితేందర్ రెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం వెంకటేశ్వరరావు, డిఎం సాయన్న, జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ జలపతినాయక్, ఎంవిఐ బ్రహ్మనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హైకోర్టు విభజనపై కేంద్రం స్పందించాలి
* న్యాయమూర్తులను సస్పెండ్ చేయడం శోచనీయం
* ప్రజా సమస్యలను గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం
* రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి
నిర్మల్, జూలై 2: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లవుతున్నా హైకోర్టు విభజనపై కేంద్రం నాన్చివేత ధోరణి అవలంభిస్తోందని, ఈ విషయంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నిర్మల్‌లోని డిసిసి అధ్యక్షులు మహేశ్వర్‌రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. హైకోర్టు విభజన కోసం న్యాయవాదులు కోర్టులను బహిష్కరించడం, ఉద్యమాలు చేయడం వల్ల అటు న్యాయవాదులకు, కేసుల్లో ఉన్నవారికి అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించడం వల్లే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందన్నారు. హైకోర్టు విభజనలో న్యాయపోరాటం చేస్తున్న న్యాయమూర్తులను హైకోర్టు సస్పెండ్ చేయడం శోచనీయమన్నారు. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేసిందని పేర్కొన్నారు. కేంద్రం వెంటనే దిగివచ్చి హైకోర్టు సమస్యకు సానుకూల పరిష్కారం చూపాలన్నారు. ఈ విషయంలో ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి పార్టీ నిర్మాణంపైనే దృష్టిపెట్టిందని ఆరోపించారు. అధికార పార్టీ నేతల రాజకీయాల వల్ల కీలకమైన ప్రజాసమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి....
కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేయాలన్న లక్ష్యంతోనే అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలను నిర్వహిస్తున్నామని పార్టీ జిల్లా ఇంచార్జి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 2019 ఎన్నికల్లో ఇటు తెలంగాణతోపాటు అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా కార్యకర్తలు ఇప్పటి నుండే సన్నద్దం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షులు మహేశ్వర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సత్యం చంద్రకాంత్, రాష్ట్ర కార్యదర్శి ప్రేమలత అగర్వాల్, దిలావర్‌పూర్ జడ్పిటిసి సుజాత, నాయకులు రమణరెడ్డి, సరికెల గంగన్న, సాద సుదర్శన్, ఎండి జమాల్, పద్మాకర్, దినేష్, తదితరులు పాల్గొన్నారు.