S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పార్టీలకు అతీతంగా అభివృద్ధికి సహకారం

మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 2: మహబూబ్‌నగర్ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు పార్టీలకు అతీయితంగా ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కోరారు. శనివారం పట్టణంలోని బ్రహ్మణవాడి, రాంనగర్ వార్డులలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రాంనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బోరును ప్రారంభించారు. హరితహరంలో భాగంగా అయా వార్డుల్లో వివిధ రకాల మొక్కలను నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కోట్లాది రూపాయాలు ప్రభుత్వం మంజూరి చేసిందని తెలిపారు. ప్రజలకు అవసరమైన వౌళ్కి వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం వృద్దులకు, వితంతువులకు నెలకు వెయ్యి రూపాయాల చొప్పున, వికాలాంగులకు పదిహెను వందల చొప్పున పించన్లు ఇస్తుందని అన్నారు. అంతేకాకుండా అర్హులైన కుటుంబాలకు ఆహార భద్రత పథకం కార్డులను ఇస్తుందని అన్నారు. కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసి నిరుపేదలు మూడు పూటల భోజనం చేయాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రతి వార్డులలో సిసి రోడ్లు, డ్రైనేజీలు, వీది దీపాలర ఏర్పాటు చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజలు ఎవైనా సమస్యలు ఉంటే తనకు నేరుగా వచ్చి చెబితే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రాదా అమర్, కమిషనర్ దేవ్‌సింగ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ సంస్కారం లేని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
* జిల్లాకు ఆగర్భ శత్రువులు నాగం, రేవంత్ * ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి
వెల్ధండ, జూలై 2: కడుపునిండా విషం పెట్టుకుని పాలమూరు జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటూ అగర్భ శత్రువులుగా నాగం జనార్ధన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిలు మారారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. రాజకీయ సంస్కారం లేకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అరుణ, సంపత్‌కుమార్‌లు రోడ్లెక్కి ఆందోళన చేయడం సిగ్గుచేటని ఆయన ఆరోపించారు. శనివారం వెల్దండలో ఏర్పాటు చేసిన ఇప్థార్ విందులో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ పాలమూరు జిల్లాను నాగం జనార్ధన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, అరుణ, సంపత్‌కుమారులు కలుపు మొక్కలుగా మారారని ఆరోపించారు. కల్వకుర్తికి రేవంత్‌రెడ్డి అపకీర్తి తెస్తుండగా నాగం జనార్ధన్‌రెడ్డి శిఖండిలా మారి మాతృద్రోహులుగా తయారయ్యారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి ఆంధ్రనాయకులకు వత్తాసుపలుకుతున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్ల పాటు అధికారం ఉండి మంత్రిగా ఒరగబెట్టింది ఏమిలేదని ఆయన కేవలం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడారని ఆరోపించారు. కోడిగుడ్డుపై ఈకలు లెక్కపెడుతున్న తెలంగాణ ద్రోహులను ప్రజలు గమనిస్తున్నారని తగిన సమయంలో ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. కృష్ణా జలాలతోనే జిల్లా సస్యశామలమవుతుందని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎంపిపి రాజశేఖర్, జడ్పీటిసీలు వెంకటమ్మ, ఆశోక్‌రెడ్డి, వైస్‌ఎంపిపిలు వెంకటయ్యగౌడ్, పర్వాతాలు, తెరాస రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్‌రెడ్డి, బాలాజీసింగ్, మధుసుధన్‌రెడ్డి, భూపతిరెడ్డి, ఈశ్వరయ్య, ఆనంద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.