S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బిసి కళ్యాణలక్ష్మి పథకానికి.. తహశీల్దార్లే విచారణ అధికారులు

సంగారెడ్డి టౌన్, జూలై 2: బిసి కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధిత తహసీల్దారులే విచారణ అధికారులుగా ఉంటారని బిసి సంక్షేమ శాఖ అధికారి జి.ఆశన్న తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బిసిలకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేసేందుకు జివో నంబర్ 18 జారీ చేసిందన్నారు. కళ్యాణ లక్ష్మి దరఖాస్తులను స్వీకరించి అట్టి దరఖాస్తులపై విచారణ చేపట్టే బాధ్యత సంబంధిత మండలాల తహసీల్ధార్లపై ఉంటుందన్నారు. శాసన సభ్యులు ఆమోదం తెలిపిన పట్టికను బిసి సంక్షేమ శాఖ అధికారికి మంజూరు నిమిత్తం పంపించాలని, పరిశీలించిన తరువాత చెక్కులు తయారు చేసేందుకు బిల్లులను ఖజాన శాఖకు పంపించాల్సి ఉంటుందని తెలిపారు. ఖజానా శాఖ అధికారులు వధువు తల్లి పేరుపై చెక్కులను బిసి సంక్షేమ అధికారులకు అందించడం జరుగుతుందని, సంబంధిత శాసన సభ్యుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని తెలిపారు. సంబంధిత దరఖాస్తుదారులు వధువు తల్లి బ్యాంకు అకౌంట్ వివరాలు, వధువు, వరుడు ఆధార్ కార్డు జిరాక్స్‌లను అందజేయాలన్నారు.

ప్రజలకు నష్టం చేస్తున్న
మామా అల్లుళ్ల ఆధిపత్య పోరు
* సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం
తొగుట, జూలై 2: చట్ట వ్యతిరేకంగా ప్రాజెక్టు నిర్మించాలని చూస్తే ఊరుకునేది లేదని, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రాజెక్టు నిర్మించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం మండలంలోని పల్లెపహాడ్, వేములఘాట్ గ్రామాల్లో నిర్వాసితులకు న్యాయం చేయాలని పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వేములఘాట్ దీక్షలకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. విధి విధానాలు లేకుండా ప్రాజెక్టు నిర్మించాలనుకోవడం శోచనీయమని, వెంటనే డిపిఆర్ ప్రకటించాలన్నారు. అవగాహన లేకుండా మంత్రి హరీష్‌రావు చట్టాన్ని కాదని జిఓతో రైతులకు మేలు జరుగుతుందని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. నీటిపారుదల రంగ నిపుణులు హన్మంతరావు పెద్ద రిజర్వాయర్ వద్దని, ముంపులేకుండా కాల్వల ద్వారా నీరందించవచ్చని, దీంతో కోట్ల రూపాయల ప్రజాధనం వృధాకాదని చెప్పినా పెడచెవిన పెట్టడంలో ఆంతర్యమేందని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు, దళారులకు మేలు చేకూర్చేందుకే మొండిగా వ్యవహరిస్తు గ్రామాలను ముంచి ప్రజలకు అన్యాయం చేస్తుందన్నారు. సిఎం కెసిఆర్ నిర్వాసితులకు చట్టప్రకారం న్యాయం చేస్తామనుకున్నా, మంత్రి హరీష్ జిఓ ప్రకారం పరిహారం చెల్లించాలని యోచిస్తున్నాడని, మామ, అల్లుండ్ల మధ్య ఆధిపత్య పోరుతో ప్రజలను ముంపుకు గురి చేయడం సరికాదన్నారు.