S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హైకోర్టు విభజించకపోతే... సమ్మెకు ఎన్‌జివోల సంఘం సిద్ధం

మెదక్, జూలై 2: కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రతో హైకోర్టు విభజన జరగడం లేదని టిఎన్‌జివోస్ మెదక్ జిల్లా కార్యదర్శి మేడిశెట్టి శ్యామ్‌రావు ఆరోపించారు. మెదక్ సబ్ కోర్టు జూడిషియల్ ఎంప్లాయిస్ సమ్మె శనివారం నాటికి రెండవ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు టిఎన్‌జివోస్ సంఘం సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా మేడిశెట్టి శ్యామ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ గడ్డమీద పుట్టిన ప్రతి బిడ్డ మా భూములు మాకు కావాలి, మా ఉద్యోగాలు, మా నిళ్లు మాకు కావాలని తెలంగాణ కోసం ఉద్యమించి అనేక మంది అసువులు బాసిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యార్థులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి సహాయ నిరాకరణ ఉద్యమాలు, సఖల జనుల సమ్మెను చేసి తెలంగాణ సాధించుకున్నామన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికినీ న్యాయ వ్యవస్థకు తెలంగాణ రాలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సెక్షన్ 80లో 30 రోజులలో న్యాయమూర్తులు, సిబ్బందిని విభజన చేయాల్సి ఉండగా రెండు సంవత్సరాలు దాటిన ఈ వ్యవస్థకు విభజన జరగలేదన్నారు. ఇప్పటి నుండి మన తెలంగాణ, మన హైకోర్టు అనే నినాదంతో ఉద్యమిద్దామని శ్యామ్‌రావు పిలుపునిచ్చారు. యావత్ తెలంగాణ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టు విభజన కోసం సమ్మె చేస్తామని కూడా ఆయన ప్రకటించారు. 11 మంది న్యాయమూర్తులకు నలుగురు మాత్రమే జడ్జీలు తెలంగాణ వారు ఉన్నారన్నారు. హైకోర్టులో 1467 మంది జడ్జీలు, సిబ్బంది ఉండగా తెలంగాణ వారు 389 మాత్రమే ఉన్నారని, ఆంధ్ర ప్రాంతానికి చెందిన జడ్జీలు, సిబ్బంది 1078 మంది ఉన్నట్లు ఆయన వివరించారు. హైకోర్టు ఉద్యోగాల్లో తెలంగాణకు 42 శాతం ఉండగా కేవలం 13 శాతమే ఉందన్నారు. హైకోర్టులో ఆంధ్ర జడ్జీలు, ఉద్యోగులు 58 శాతానికిగాను 87 శాతం ఉన్నట్లు వెల్లడించారు. కాగా సమైఖ్య రాష్ట్రంలో విడిపోయి రెండు సంవత్సరాలు అయినప్పటికీ హైకోర్టు విభజన చంద్రబాబు కుట్రతోనే నిలిచిపోయిందని ఆరోపించారు. ఆంధ్ర పాలకుల కుట్రల వలన హైకోర్టు విభజన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆరోపించారు.