S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మల్లన్న సాగర్ వెనుక మర్మమేమిటి..?

సంగారెడ్డి టౌన్, జూలై 2: మల్లన్న సాగర్ ప్రాజెక్టు వెనకాల ఉన్న మర్మమేమిటో, ఇందులో ప్రభుత్వం దాస్తున్న విషయాలను తెలుగు కరపత్రాల ద్వారా ప్రజల్లో అవగాహాన కల్పించాలని ప్రజా తెలంగాణ పార్టీ రాష్ట్ర కన్వీనర్ గాదె ఇన్నయ్య, కో-కన్వీనర్లు నాగప్రసాద్, శ్రీశైల్‌రెడ్డి, తెలుగు రైతు సంఘం అధ్యక్షులు ఒంటేరు ప్రతాప్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలపై శనివారం జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిలకు వినతి పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి ఐబి అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మల్లన్న సాగర్ పేరుతో భూ అక్రమణలు జరుగుతున్నాయని, ఇది ఆచరణలో సాధ్యం కాని ప్రాజెక్టన్నారు. ఇంత భారీ ప్రాజెక్టు అవసరమా? ప్రాజెక్టు అవసరాలు ప్రజలకు తెలుపాల్సిన అవసరం ఉందన్నారు. ఇది రియల్ ఎస్టేట్ భూ దంధా అని, అక్కడ ప్రాజెక్టు ఉండదు, ప్రజలు ఉండరన్నారు. 14 గ్రామాల భూ నిర్వాసితులకు అండగా ఉంటామని, ప్రజలను చైతన్య పరుస్తామన్నారు. వారి స్వార్థం కోసం బంగారు పంటలు పండే భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇంత పెద్ద ప్రాజెక్టు అనవసరమా అని, భూ సేకరణను వెంటనే నిలిపి వేయాలని డిమండ్ చేశారు. కేవలం కెసిఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులు పెంచుకునేందుకే ప్రాజెక్టుల నిర్మాణామని విమర్శించారు. 4 గ్రామాల ప్రజల కోసం 4 వేల గ్రామాలకు నష్టం చేకూర్చడం సరికాదన్నారు. అధికార దాహంతో వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. ముంపు గ్రామాల్లో కెసిఆర్, మంత్రి హరీష్‌లు అడుగుపెట్టే పరిస్థితి లేదని, ప్రజల్లో విశ్వాసం కోల్పోయారన్నారు. బ్రోకర్ వ్యవస్థగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ప్రజల ఆహుతికి గురికావడం ఖాయమన్నారు. ముంపు గ్రామాల బాధితుల పక్షాన క్షేత్రస్థాయి పోరాటం చేస్తామన్నారు.

మైనార్టీలకు దుస్తుల పంపిణీ
రాయికోడ్, జూలై 2: రంజాన్ పండగ సందర్భంగా పేద ముస్లిం మైనార్టీలకు శనివారం అందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్ దుస్తులను పంపిణీ చేశారు. మండల కేంద్రమైన రాయికోడ్ వ్యవసాయ మార్కెట్ కమిటి ఆవరణలో రాయికోడ్, మునిపల్లి, రేగోడ్ మండలాలకు చెందిన సుమారు 360 మంది లబ్ధిదారులకు దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం ఎంపిటిసి విఠల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ మైనార్టీల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. పవిత్ర రంజాన్ పండగ రోజు పేద ముస్లింలు సంతోషంగా ఉండాలని నియోజకవర్గానికి వెయ్యి మందికి దస్తులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. జోగిపేట మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌ను మంజూరు చేశారని, ఒక్కో విద్యార్థికి 80నుండి లక్ష రూపాయల వరకు ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. మండల ముస్లిం మైనార్టీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 3 మండలాల్లో కళ్యాణ లక్ష్మి, షాదీముభారక్ కింద 224 మంది లబ్ధిదారులకు కోటి 60లక్షల రూపాయలు అందజేయడం జరిగిందన్నారు. అంతకు ముందు మార్కెట్ కమిటి ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం 33లక్షల రూపాయల వ్యయంతో మంజూరైన మోడల్ పాఠశాల ప్రహారి గోడ, రూ.50లక్షలతో సింగీతం ఎస్పీ కాలనీలో మంజూరైన కాల్వర్టు నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపి మాణిక్‌రెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ సిద్ధన్నపాటిల్, మాజీ ఎంపిపి బస్వరాజ్ పాటిల్ పాల్గొన్నారు.

ఫాంహౌస్‌లో సిఎం కెసిఆర్
జగదేవ్‌పూర్, జూలై 2: రాష్టమ్రుఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం సాయంత్రం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో గల తన ఫాంహౌస్‌కు చేరుకున్నారు. హైదరాబాద్‌లో గవర్నర్ నరసింహన్‌తో సమావేశం ముగించుకున్న అనంతరం సిఎం రోడ్డు మార్గం ద్వారా గౌరారం, పాములపర్తి, మార్కుక్ గ్రామాల మీదుగా పాంహౌస్‌కు చేరుకున్నారు. కాగా సిఎం రాక దృష్ట్యా పోలీసులు మధ్యాహ్నం నుండి గౌరారం నుండి ఎర్రవల్లి వరకు ఎస్‌ఐ వీరన్న అధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా సిద్దిపేట డిఎస్పీ శ్రీ్ధర్ ఎప్పటికప్పుడు రక్షణ చర్యలను పర్యవేక్షించారు.

మల్లన్నసాగర్ నిర్మించాలని ఏకగ్రీవ తీర్మానం

తొగుట, జూలై 2: మల్లన్నసాగర్ నిర్మించాలని తొగుట మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మాణించారు. ఎంపిపి గంట రేణుక అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపిపి ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదించగా సభ్యులు దాన్ని ఏకగ్రీవంగా చేతులెత్తి మద్దతు తెలిపారు. కాగా భూనిర్వాసిత గ్రామాల జడ్పిటిసి రూప, సర్పంచులు మంజుల, సంతోష, సునందబాయి, రామయ్య, ఎంపిటిసిలు ప్రతాప్‌రెడ్డి, ఐలం పోచవ్వలు గైర్హాజరు కావడం గమనార్హం. మిషన్ భగీరథ కింద తాగునీరు అందించేందుకు మండలంలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, ఎఇ తెలుపగా పైపులైన్‌ను పంటభూముల్లో లోతుగా కాకుండా మీదనే వేస్తున్నారని సర్పంచు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.