S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హరితహారానికే సరి!

నల్లగొండ, జూలై 2: జిల్లా ప్రజల సమస్యలకు గొంతుకై నిలువాల్సిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మరోసారి నామమాత్ర, మొక్కుబడి చర్చలతో అర్ధాంతరంగా ముగిసిపోవడం విమర్శలకు తావిచ్చింది. జడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్ అధ్యక్షతన శనివారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో 29అంశాల ఎజెండాలో ప్రధానంగా హారిత హారంపైనే చర్చ కొనసాగగా, వ్యవసాయంపై జెడిఏ నివేదిక చదువడం వరకే పరిమితమైంది. ముడు మాసాలకొకసారి జరిగే సర్వసభ్య సమావేశ వేదిక జిల్లా ప్రజలు ఎదుర్కోంటున్న ప్రధాన సమస్యలకు దర్పణం పట్టడం ద్వారా పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేదిగా ఉండాలని భావించిన ప్రజల ఆశలు వమ్ము చేస్తు నామమాత్ర చర్చలకే సమావేశం పరిమితమవ్వడం సభ్యుల్లో సైతం అసహనం రేకెత్తించింది.
సమావేశం మధ్యలోనే సీఎం కెసిఆర్‌తో జిల్లా సమస్యలపై భేటీ ఉందంటు మంత్రి జి.జగదీష్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్‌లు, ఇతర టిఆర్‌ఎస్ ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం నుండి వెళ్లిపోయారు. వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి అధ్యతన ఏజెండా అంశాలపై చర్చ కొనసాగుతుందని ప్రకటించినప్పటికి భోజన విరామం పిదప డిఆర్‌డిఏ, టిఎంఐపి పనులపై తూతుమంత్రం చర్చలతో సమావేశం అర్ధాంతరంగా ముగించేశారు. దీంతో జిల్లా పరిషత్ వేదికగా రుణమాఫీ, కరవు సహాయ పంపిణీలో జాప్యం, ఆసరా పింఛన్లలో జాప్యం, ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడం, పుష్కర పనుల్లో ఆలస్యం, మిషన్ కాకతీయలో అక్రమాలు, సాగునీటి ప్రాజెక్టుల జాప్యం..నిర్వాసితుల సమస్యలు, నూతన జిల్లాలు, మండలాల ఏర్పాటు సమస్యలు, ధరలు, చార్జీల పెరుగుదల వంటి వాటిపై ఎలాంటి చర్చలు సాగకుండానే జడ్పీ సమావేశం నిస్సారంగా ముగిసింది.
డుమ్మా కొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!
ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతు, ప్రజా సమస్యలను ప్రస్తావించి చర్చకు పట్టుబట్టాల్సిన విపక్ష కాంగ్రెస్, టిడిపి, సిపిఐ ప్రజాప్రతినిధులలో మెజార్టీ సభ్యులు టిఆర్‌ఎస్‌లో చేరడం జిల్లా పరిషత్ సమావేశం కళ తప్పడానికి కారణమైంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో మిగిలిన జడ్పీటీసిలు, ఎంపిపిలు సైతం జిల్లా పరిషత్‌లో మెజార్టీగా ఉన్న అధికార పార్టీ సభ్యులతో ఎందుకు రగడ అనుకుంటు ప్రేక్షకపాత్రకే పరిమితమవ్వడంతో ఎజెండా అంశాలపై చర్చను లేవనేత్తె చొరవ కరువైంది. ముఖ్యంగా కాంగ్రెస్‌లో మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలు కె.జానారెడ్డి, ఉత్తమ్‌పద్మావతి దంపతులు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు జడ్పీ సమావేశానికి డుమ్మా కొట్టడం ప్రజాసమస్యలపై చర్చలకు గండికొట్టినట్లయింది. వారి గైర్హాజర్ కాంగ్రెస్ స్థానిక ప్రజాప్రతినిధులను మరింత నిరుత్సాహానికి గురి చేసింది. తమ ఎమ్మెల్యేలు సమావేశానికి వచ్చి ప్రజాసమస్యలపై గళమెత్తితే తాము కూడా వారితో గొంతు కలిపేవారమని, ముందుండి నడిపించాల్సిన వారే మొఖం చాటేస్తే తాము చేసేదేముంటుందంటు కాంగ్రెస్ జడ్పీటీసిలు, ఎంపిపిలు వాపోవడం గమనార్హం.
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడైన పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మాత్రం హుందాగా జిల్లా పరిషత్ సమావేశానికి వచ్చి తనదైన శైలిలో ప్రభుత్వ పథకాల లోటుపాట్లపై విమర్శలు గుప్పించి వెళ్లారు.
ఒక్క పాల్వాయి మాట్లాడితేనే ప్రతిపక్షం గొంతుక నుండి ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల లోపాలు చర్చకు వచ్చిన నేపధ్యంలో ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కూడా హాజరై చర్చలో పాల్గొని ఉంటే మరిన్ని ప్రజా సమస్యలపైన, ఏజెండా అంశాలపై అర్ధవంతమైన చర్చలు సాగి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి పరిష్కారం దిశగా కొంత పురోగతి ఉండేదని ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు భావించడం కొసమెరుపు. అటు అధికార టిఆర్‌ఎస్ నుండి కూడా నలుగురు ఎమ్మెల్సీలకు ఒకరు పూల రవిందర్ హాజరుకాగా కర్నే ప్రభాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్‌లు గైర్హాజరయ్యారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో వేముల వీరేశం, ఎన్.్భస్కర్‌రావులు హాజరుకాగా గొంగిడి సునీత, గాదరి కిషోర్, పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రవీంద్రకుమార్‌లు గైర్హాజరయ్యారు. ఎంపిలలో గుత్తా హాజరవ్వగా బూర నర్సయ్యగౌడ్ గైర్హాజరయ్యారు.