S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హైకోర్టు విభజన కేంద్రం పనికాదు

హైదరాబాద్, జూలై 2: హైకోర్టు విభజనపై చీఫ్ జస్టిస్‌తో చర్చిస్తానని గవర్నర్ నరసింహన్ హామీ ఇచ్చారని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శనివారం ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యాయాధికారుల సస్పెన్షన్‌ను ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరానని చెప్పారు. హైకోర్టు విభజన కోసం కేంద్ర న్యాయ మంత్రికి వినతిపత్రం ఇచ్చామని, న్యాయాధికారుల విభజనలో ఆప్షన్లు ఉండరాదని కోరామని ఆయన తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కూడా మాట్లాడామని దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైకోర్టు విభజన విషయంలో కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై నెట్టివేయడం భావ్యం కాదని ఆయన అన్నారు. హైకోర్టు ఏర్పాటుకు ఏపి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
సార్ మీరు జోక్యం చేసుకోండి
‘సార్, హైకోర్టు విభజన విషయంలో మీరు జోక్యం చేసుకుని సమస్యను త్వరగా పరిష్కరించండి..’ అని బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి గవర్నర్ నరసింహన్‌ను కోరారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను నర్సింహారెడ్డి కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.

చిత్రం.. శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న కేంద్రమంత్రి దత్తాత్రేయ