S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఢాకా మృతుల్లో భారత యువతి

న్యూఢిల్లీ, జూలై 2: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రదాడిలో భారతీయ యువతి తరుషి మృతి చెందడం తనకు ఎంతో బాధ కలిగించిందని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ శనివారం ఒక ట్వీట్‌లో తెలిపారు. ఆమె తండ్రి సంజీవ్ జైన్‌తో తాను మాట్లాడానని, మన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశానని ఆమె తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో దేశం యావత్తు ఆ కుటుంబానికి అండగా నిలుస్తుందని ఆమె తెలిపారు. బంగ్లాదేశ్ వెళ్లడానికి కుటుంబానికి వీసాను ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన సుష్మ అమ్మాయ మృతదేహాన్ని ఫిరోజాబాద్ తరలిస్తున్నట్లు తెలిపారు. 19 ఏళ్ల తరుషి ఢాకాలోని అమెరికన్ స్కూల్‌లో చదివింది. ప్రస్తుతం ఆమె బర్క్‌లీ యూనివర్శిటీలో చదువుతోంది.
మాటలకందని దారుణం: మోదీ
ఇదిలా ఉండగా ప్రధాని మోదీ శనివారం ఉదయం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ఫోన్‌లో మాట్లాడి ఈ క్లిష్టసమయంలో బంగ్లాదేశ్‌కు భారతీయులంతా అండగా ఉంటారని చెప్పారు. ఢాకాలో జరిగిన ఉగ్రదాడి తమను మాటలకందనంతగా బాధపెట్టిందని మోదీ ట్విట్టర్‌లో అంటూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.