S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రోడ్డెక్కిన ‘న్యాయం’!

వరంగల్, జూలై 2: వరంగల్ జిల్లా న్యాయస్థానం పోలీసు పహారా మధ్య నడుస్తోంది. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ.. అడ్వకేట్లు, న్యాయశాఖ ఉద్యోగులు వేర్వేరుగా చేస్తున్న ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక హైకోర్టు, న్యాయమూర్తుల సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. గత 20 రోజులకు పైగా చేస్తున్న న్యాయవాదుల ఆందోళనకు న్యాయశాఖ ఉద్యోగులు తోడయ్యారు. ప్రత్యేక హైకోర్టు డిమాండ్‌తోనే గత రెండు రోజులుగా న్యాయశాఖ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగడంతో సమస్య మరింత జటిలంగా మారింది. దీంతో శనివారం కోర్టు తెలుపు తెరిచేవారు కరువయ్యారు. ఫైళ్లు కదలడం లేదు. జుడీషియల్ ఉద్యోగులు ఏకంగా కోర్టు గేటు బైటే బైఠాయించి సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా సస్పెన్షన్‌కు గురైన న్యాయమూర్తులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమండ్ చేసారు. గత 20 రోజులుగా ఆందోళనలు చేస్తున్న సమస్య పరిష్కారం కాకపోవడం పట్ల వారు తీవ్రంగా విమర్శించారు. న్యాయశాఖ ఉద్యోగులు కోర్టు ఆవరణలో డప్పు వాయిద్యాలతో, ధూం ధాం పాటలతో సమ్మెను కొనసాగించారు. తక్షణమే సమస్య పరిష్కారం కానట్లైతే సహాయ నిరాకరణకు వెనకాడమని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఇటీవల కోర్టులో జడ్జిపై న్యాయవాదుల దాడిజరిపిన నేపథ్యంలో కోర్టు ఆవరణలోనే పోలీసు క్యాంప్ ఏర్పాటుచేసారు. జడ్జిలకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసారు. కాగా, న్యాయవాదులు ప్రత్యేక హైకోర్టు డిమాండ్‌తో పాటు ఇటీవల న్యాయవాదులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై రెండు సంవత్సరాలు గడిచిన ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కాకపోవడం వెనక కుట్ర ఏమిటని న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు.

ఇక డుమ్మాలుండవ్..!
* ప్రభుత్వ కళాశాలల్లో బయోమెట్రిక్ ప్రారంభం
కేసముద్రం, జూలై 2: ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్ధులు, అధ్యాపకుల హాజరు నమోదుకు శనివారం నుంచి బయోమెట్రిక్ విధానాన్ని ప్రారంభించారు. కళాశాలల్లో ఉదయం 9-30 గంటల నుంచి 9-40 లోగా విద్యార్ధులు, అధ్యాపకులు కళాశాలకు చేరుకొని తమ వేలి ముద్రలను బయోమెట్రిక్ యంత్రంలో వేయాల్సి ఉంటుంది. ఉదయం 9-40 లోగా సాయంత్రం 4గంటల్లోపు బయోమెట్రిక్ ద్వారా రెండుపూటలా ఆన్‌లైన్‌లో హాజరు నమోదు చేస్తారు. బయోమెట్రిక్ విధానం అమలు ద్వారా ఇక నుంచి అధ్యాపకులు, విద్యార్ధులు చెప్పా.. పెట్టకుండా కళాశాలకు డుమ్మా కొట్టడానికి చెక్ పడింది. సాయంత్రం పూట కూడా బయోమెట్రిక్ హాజరు నమోదు చేస్తుండటంతో కచ్చితంగా రెండు పూటలు కళాశాలలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 44 కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా వృత్తివిద్యాధికారి మహబూబ్ అలీ తెలిపారు. విద్యార్ధుల బయోమెట్రిక్ ఆధారంగా హాజరు నమదును లెక్కించి సరైన హాజరు శాతం ఉంటేనే వార్షిక పరీక్షలకు అనుమతిస్తామని తెలిపారు. బయెమెట్రిక్ విధానం ద్వారా ఇక నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో ఒకే విధమైన సమయ పాలన అమలులో ఉంటుందన్నారు. అలాగే కళాశాలలో తరగతి గదులల్లో సిసి కెమెరాలు అమర్చి రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కమీషనర్ నుంచి ఆర్జేడి, ఆర్‌ఐఓ వరకు నిత్యం ప్రత్యక్షంగా విద్యాబోధన తీరును కూడా పరిశీలిస్తామని తెలిపారు. దీనితో ఇప్పటి వరకు ప్రభుత్వ కళాశాలలో చేరితే పట్టించుకునేవారుండరనే ఆపోహ కాస్త ఇక తొలగిపోనుందని చెప్పవచ్చు. ప్రభుత్వ కళాశాలల్లో కచ్చితమైన సమయపాలన, విద్యాబోధన, విద్యార్ధులు, అధ్యాపకుల హాజరు ఇక నుంచి సరైన గాడిలో పడనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

‘హరిత’ పార్టీలో ఎమ్మెల్యే..!?
కేసముద్రం, జూలై 2: టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మెడలో గులాబి కండువాకు బదులు మరో రంగు కండువా కప్పుకోవడంతో ఎమ్మెల్యే మరేదైనా పార్టీలో చేరాడనుకుంటే తప్పులో కాలేసినట్లే.. నిత్యం గులాబీ కండువాతో దర్శనమిచ్చే మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ శనివారం లేత ఆకుపచ్చ రంగు కండువాతో కనిపించి అందరిని ఆశ్చర్యచకితులను చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో బతుకమ్మ ఘాట్ వద్ద మొక్కలు నాటేందుకు ఇలా మెడలో ఆకుపచ్చ కండువా ధరించి ప్రతి ఒక్కరిలో హరితహారం స్ఫూర్తిని పెంపొందించారు. దీనితో ఎమ్మెల్యేతో పాటు కేసముద్రం నేతలు ‘హరిత’ పార్టీలో చేరారంటూ చలోక్తులు విసిరారు.

2019లో అధికారంకాంగ్రెస్‌దే..
కార్యకర్తలు అధైర్యపడొద్దు * పార్టీ బలోపేతానికి పాటుపడాలి * ఎంపి నంది ఎల్లయ్య
ములుగుటౌన్, జూలై 2 : 2019లో కాంగ్రెస్‌పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు అధైర్యపడకుండా పార్టీ బలోపేతం కోసం పాటుపడాలని మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ ఎంపి నంది ఎల్లయ్య పేర్కొన్నారు. ములుగులోని లీలాగార్డెన్‌లో శనివారం కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం మాజి ఎమ్మెల్యే, టిపిసిసి సభ్యుడు పొదెం వీరయ్య అధ్యక్షతన జరిగింది. ఈసమావేశానికి ఆయనతోపాటు మాజి కేంద్రమంత్రి పోరిక బలరాంనాయక్, కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, పిసిసి కార్యదర్శి బట్టి శ్రీనివాస్, జిల్లా మహిళా అధ్యక్షురాలు పోశాల పద్మలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈసందర్భంగా నంది ఎల్లయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల్లో పార్టీ నాయకులు బూత్, గ్రామ, మండల కమిటిలు, అనుబంధ సంఘాల కమిటిలు వేసుకుని పార్టీ అభివృద్ధి కోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్‌పార్టీని ప్రజలు ఎన్నడూ మరువరని అన్నారు.