S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రజల సౌలభ్యానికే కొత్త జిల్లాలు

ఖమ్మం, జూలై 2: ఉద్యమాలతో జిల్లాలు ఏర్పడవనే విషయాన్ని ప్రతిపక్షాలు గ్రహించాలని, ప్రజల అవసరాలు, సౌకర్యాలకు అనుగుణంగానే కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుందని, దీనిపై రాద్ధాంతం అవసరం లేదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం స్థానిక టిటిడిసిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని ప్రాంతాల వారు తమ ప్రాంతం జిల్లా కేంద్రంగా ఉండాలని కోరుకోవటంలో తప్పు లేదని, అయితే ప్రజల అవసరాలు తెలుసుకునే ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు వారిని మభ్యపెట్టకుండా ఉద్యమాల పేరుతో రోడ్లు ఎక్కించడం సరైంది కాదని అన్నారు. ఖమ్మం జిల్లాలో కొంత భాగం కొత్తగూడెం జిల్లాగా ఏర్పడుతుందని, ఇల్లెందు నియోజకవర్గంలోని కొన్ని మండలాలు ఇతర జిల్లాల్లో కలిపినా వారంతా తెలంగాణలోనే ఉంటారనే విషయాన్ని గ్రహించాలన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో జరుగుతున్న మిషన్ కాకతీయ పనుల్లో రెండు విడతల్లోనూ ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. జిల్లాలో 4,517 చెరువులుండగా ఇప్పటి వరకు మొదటి విడతలో 245కోట్లతో 833చెరువులను పునరుద్ధరించామని, అదే విధంగా రెండో విడతలో 921చెరువులను 320కోట్లతో పునరుద్దరించి, రాష్టస్థ్రాయిలో మిషన్ కాకతీయ పథకంలో ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. శ్రీరాంసాగర్ రెండో దశ పనులను పూర్తి చేయటంతో పాటు భక్తరామదాసు ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేసి ఆగస్టు నెలలో 60వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు. ప్రాజెక్ట్‌ల విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఆరోపణలు చేస్తున్న నాయకులు భూ సేకరణ లేకుండా ప్రాజెక్ట్‌లు ఏలా నిర్మించాలో... నీరు ఏలా ఇవ్వాలో చెప్తే బాగుంటుందని ఏద్దేవా చేశారు. అభివృద్ధికి అడ్డుపడుతూ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని, అలాంటి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి భూమిని అందించిన వారందరిని అభినందిస్తున్నామని, వీరు భూమిని ఇవ్వటం వల్లే అనేక మంది రైతులు పంటలు పండించుకునే అవకాశం లభిస్తుందన్నారు. విలేఖరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ దివ్య తదితరులు పాల్గొన్నారు.

శనగచెరువులో
మిషన్‌కాకతీయ తూతూమంత్రం
* నాణ్యతాలోపంపై ఆయకట్టు రైతుల ఆందోళన
జూలూరుపాడు, జూలై 2: మండల పరిధిలోని పాపకొల్లు గ్రామ పంచాయతీ శివారు గ్రామం కొత్తూరు శనగచెరువులో మిషన్ కాకతీయ పథకం కింద చేపట్టిన పనులు తూతూమంత్రంగా సాగాయని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు శనివారం శనగచెరువుకు చేసిన అభివృద్ధి పనుల తీరును రైతులు విలేఖరులకు చూపించారు. మిషన్ కాకతీయ పథకం కింద ప్రభుత్వం 70 లక్షల రూపాయలను కేటాయించిందని తెలిపారు. పనులు చేపట్టిన కాంట్రాక్టరు, ఇరిగేషన్‌శాఖ ఇంజనీర్లు కుమ్మక్కై పనులను ఇష్టారాజ్యంగా చేశారని రైతులు ఆరోపించారు. శనగ చెరువు కింద 265 ఎకరాల ఆయకట్టు ఉండగా దాదాపు వంద మందికి పైగా రైతులు వరి పంటను సాగు చేస్తున్నారని తెలిపారు. అయితే ప్రభుత్వం చేపట్టిన పథకంతో చెరువులో పూడికతీత, కట్టను పటిష్టం చేయటం, తూములు, కాల్వలు మరమ్మతులు పూర్తి నాణ్యతా ప్రమాణాలతో సాగుతాయని ఆనందపడ్డామన్నారు. చెరువులో పూడిక మట్టిని పెద్ద మొత్తంలో పంట పొలాలకు కూడా తోలుకోవటంతో చెరువులో పూడికతీతకు కూడా సహకరించామని రైతు లు వ్యక్తం చేస్తున్నారు. చివరకు చెరువుకట్టను బలహీనంగా తయారు చేయటం, అలుగు నిర్మాణం, పంట కాలువ పనులను నిబంధనలకు విరుద్దంగా చేశారని రైతాంగం వాపోతుంది. ఇటీవల కురిసిన ఒక్క వర్షానికే అలుగు కింది నుంచి బుంగ పడటంతో, నాణ్యతలోపం బయట పడుతుందని హడావిడిగా జెసిబితో బుంగను పూడ్చారని రైతులు తెలిపారు. పనులు మొదటి నుంచి అస్తవ్యస్తంగా సాగటంపై పర్యవేక్షణా ఇంజనీర్లకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవటం లేదని రైతులు వాపోతున్నారు. సంబంధిత ఇంజనీర్లు వ్యవహరిస్తున్న తీరు కారణంగా ఖరీఫ్‌లో ఆయకట్టు పంటకు సాగునీరు సక్రమంగా అందేపరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు శనగచెరువు పనులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతాంగం డిమాండ్ చేస్తోంది.