S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మేయర్ ఏకపక్ష నిర్ణయాలు మానుకోవాలి

ఖమ్మం(ఖిల్లా), జూలై 2: కాంట్రాక్ట్ కార్మికుల పట్ల మేయర్ అనుసరిస్తున్న ఏకపక్ష నిర్ణయాలు మానుకోవాలని సిఐటియు, ఇఫ్టూ నాయకులు విష్ణువర్ధన్, మందా వెంకటేశ్వర్లు అన్నారు. ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ కార్మికుల పట్ల మే యర్ అనుచిత నిర్ణయాలు తీసుకోవడంతో ఆందోళనకు గురవుతున్నారన్నా రు. 60 సంవత్సరాలు నిండిన కార్మికులను విధుల నుంచి తొలగించడం సరికాదన్నారు. సమస్యలపై ప్రశ్నించేందుకు వెళ్ళిన కార్మికులను పోలీసుల చేత కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించా రు. డివిజన్ల వారీగా పనిచేస్తున్న కార్మికులను మార్పులు చేసే ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు. చాలిచాలని వేతనాలతో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను చేర్పులు, మార్పులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన సంఘటనలో కార్మికులపై పెట్టిన కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చే శారు. విలేఖరుల సమావేశంలో నాయకులు రాయల పావెల్, తాళ్ళపల్లి రా ములు, విప్లవ్‌కుమార్, బుర్రి వినయ్‌కుమార్, పద్మ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల ప్రదర్శన, మానవహారం
గార్ల, జులై 2: ఇల్లెందును జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని పిడిఎస్‌యు ఆధ్వర్యంలో శనివారం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు గార్లలో ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. ఆయా పాఠశాలల నుంచి ప్రారంభమైన ప్రదర్శన పురవీధుల గుండా నెహ్రూ సెంటరు వరకు చేరుకొని మానవహారం చేపట్టారు. ఇల్లెందు నియోజక వర్గాన్ని మూడు ముక్కలు చెయ్యటం సరికాదని, ఇల్లెందును జిల్లా కేంద్రంగా మార్చి అభివృద్ధి పర్చాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ గ్రామాల పట్ల ప్రభుత్వం వివక్షత చూపుతోందని ప్రదర్శన, మానవహారంలో నినాదాలు చేశారు. అనంతరం నెహ్రూ సెంటరులో విద్యార్థులను ఉద్దేశించి పిడిఎస్‌యు డివిజన్ ఉపాధ్యక్షుడు జె గణేష్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నుంచి ఇల్లెందు డివిజన్ కేంద్రంగానే ఉంటోందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇల్లెందు అభివృద్ధికి మాత్రం అమడ దూరంలో ఉందన్నారు. కొత్తగూడెం కేంద్రంగా ఉం డటం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని, పాలకులు ప్రజ ల ఇబ్బందులను గుర్తించి ఇల్లెందును జిల్లా కేంద్రంగా మార్పు చేయాలని కోరారు. సంఘం నాయకులు అ శోక్, సాయి, రణ్, రమాదేవి, లతశ్రీ, గోసు వేంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ముదిగొండ పిహెచ్‌సిని సందర్శించిన సిపిఎం బృందం
ముదిగొండ, జూలై 2: 65 వేల జనాభా కేంద్రంగా ఉన్న మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అదనంగా మరొక వైద్యుని పోస్టు కేటాయించాలని సిపిఎం డిమాండ్ చేసింది. శనివారం మండల పార్టీ కమిటీ బృందం మండల కేంద్రమైన ముదిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించింది. జిల్లాలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్నింటికీ ఇద్దరు డాక్టర్ పోస్టులు ఉండగా మండల కేంద్రమైన ముదిగొండకు ఒక్కరే ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని అన్నారు. వల్లభి ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణం పూర్తయినా కూడా ప్రారంభానికి నోచుకోలేదని అన్నారు. మండల పిహెచ్‌సిని 24 గంటల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలన్నారు. పెదమండవ, మేడేపల్లి, ముత్తారం, బాణాపురం, గ్రామాల్లో పిహెచ్‌సి సబ్ సెంటర్లు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. సిబ్బంది క్వార్టర్స్ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వాసిరెడ్డి వరప్రాసాద్, సహాయ కార్యదర్శి బంకా మల్లయ్య, డివిజన్ కమిటీ సభ్యులు పిసి వీరస్వామి, మండల కమిటీ సభ్యులు బంకా మల్లయ్యలు పాల్గొన్నారు.

పాటకు జీవం పోసిన అంజయ్య
ఖానాపురం హవేలి, జూలై 2: పాటకు జీవం పోసిన అంజయ్య సేవలు ఎనలేనివని లంబాడీ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బాణోతు భద్రునాయక్, బహుజన స్వయం సేవక్ సంఘం గౌరవ సలహదారుడు కెవి కృష్ణారావులు అన్నారు. శనివారం అమరవీరుల స్థూపం వద్ద అంజయ్య చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించటమే కాకుండా అంజయ్య తనదైన శైలిలో ప్రజల్లో చైతన్యవంతులను చేసేందుకు పాటలు పాడారన్నారు. అదే విధంగా మలిదశ ఉద్యమంలో కూడా తన పాత్రను మరోసారి పోషించారని ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఉద్యమాలకు ఊతం ఇవ్వటమే కాకుండా ఊపిరి పోసిన మహోన్నత వ్యక్తి అంజయ్య అన్నారు. బిసి సబ్ ప్లాన్ కమిటీ నాయకులు వినయ్‌కుమార్, పలు సంఘాల నాయకులు అంజయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాజ్‌కుమార్, నరేందర్, జగదీష్, రామారావు, సాయి వెంకటరమణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

టిఆర్‌ఎస్ ద్వారానే అభివృద్ధి సాధ్యం
* పొంగులేటి సమక్షంలో చేరికలు
ఖానాపురం హవేలి, జూలై 2: తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ద్వారానే రాష్ట్భ్రావృద్ధి సాధ్యమవుతుందని ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం పొంగులేటి నివాసంలో సిపిఎం సీనియర్ నాయకుడు గుండా మల్లారెడ్డి టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఏ ప్రభుత్వం చేపట్టనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. 40 సంవత్సరాల పాటు సిపిఎంలో కొనసాగిన మల్లారెడ్డి జిల్లా రైతు సంఘం కార్యదర్శి, ఇల్లెందు, కొత్తగూడెం డివిజన్ సిపిఎం కార్యదర్శిగా 20 సంవత్సరాల పాటు పని చేశారన్నారు. సుదీర్ఘ అనుభవం కలిగిన మల్లారెడ్డి టిఆర్‌ఎస్‌లో కూడా విశేషంగా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ ఎంపి పొంగులేటి సారధ్యంలో అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తానన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, జ్యోతిర్మయి, వెంకటరెడ్డి, అశోక్‌రెడ్డి, నగేష్, నాగేశ్వరరావు,చెన్నకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.