S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అధికార పార్టీపై ప్రజల్లో సన్నగిల్లుతున్న విశ్వాసం

ఖమ్మం (కల్చరల్), జూలై 2: అధికార టిఆర్‌ఎస్‌పై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని సిపిఎం రాష్ట్ర నాయకురాలు బుగ్గవీటి సరళ అన్నారు. సిపిఎం హావేలి కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. అధికారమే పరమావధిగా ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు చేసిన కెసిఆర్ నేడు వాటి ఊసే ఎత్తడం లేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు వ్యవధి ఉండటంతో పేద ప్రజలపై పన్నుల భారం మోపడం ప్రారంభించాడన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దశలవారీ ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులు ఎజె రమేష్, ఖమ్మం డివిజన్ కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు, డివిజన్ కమిటీ సభ్యులు కోదాటి గిరి, వాసిరెడ్డి మల్లిఖార్జునరావు, నాయకులు కుర్రి వెంకటస్వామి, ఎస్‌కె షమి, కె అమరావతి, పి రమ్య, మచ్చా బాస్కర్‌రావు, తమ్మినేని వెంకటేశ్వరరావు, సత్తెనపల్లి శ్రీను, వైవి నారాయణరావు, డి తిరుపతిరావు, బి పాపారావు, ఎన్ వెంకన్న, టి నర్సిహారావు, ఎం కృష్ణయ్య, పి బాబురావు పి వెంకటి తదితరులు పాల్గొన్నారు.

కార్మికులను బలితీసుకున్న మట్టిదిబ్బలు

* దనియాలపాడులో విషాదం * ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్

ఇల్లెందు, జూలై 2: పొట్టకూటికోసం మట్టిపనికి వెళ్ళిన ఇద్దరి అభాగ్యుల బతుకులు మట్టిదిబ్బల్లోనే కలిసిన విషాద సంఘటన ఇది. ఇల్లెందు పట్టణ పొలిమేరలో ఉన్న సింగరేణి ఓపెన్‌కాస్టుకు చెందిన పురాతన మట్టిగుట్టల్లో శనివారం మట్టి తరలించేందుకు ట్రాక్టర్ పనికి వెళ్ళిన వజ్జా బాబురావు(29), వి సీతారాములు (46) దుర్మరణం చెందారు. మరో కార్మికుడు వెంకటేశ్వర్లుకు బలమైన గాయాలయ్యాయి. సుభాష్‌నగర్ ఏరియాలోని కాలనీలో గృహనిర్మాణాల కోసం మట్టి అవసరంవుంది. పట్టణానికి చెందిన ట్రాక్టర్ యజమాని తన ట్రాక్టర్‌తో సమీపంలో ఉన్న సింగరేణి పురాతన మట్టిగుట్టల నుండి కాలనీకి మట్టిని తరలింపచేస్తున్నారు. అందులో భాగంగానే రోజువారీ వేతనంపై పనిచేసే నలుగురు కార్మికులను మట్టిపనికి తీసుకువెళ్ళారు. మట్టిని తవ్వుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు మట్టిదిబ్బలు కనురెప్పపాటులో కూలడంతో అదేప్రాంతంలో ఉన్న రాంబాబు, సీతారాములు మట్టిదిబ్బలలో కూరుకుపోయారు. ముప్పు తప్పించుకోవడానికి వెంకటేశ్వర్లు చేసిన ప్రయత్నం ఫలించినప్పటికి బలమైన గాయాలయ్యాయి. మరో కార్మికుడు, ట్రాక్టర్‌డ్రైవర్ ప్రమాదం నుండి తప్పించుకున్నారు. మండల పరిధిలోని తెల్లసముద్రం పంచాయతీ దనియాలపాడు గ్రామానికి చెందిన రాంబాబు, సీతారాములు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడు రాంబాబుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరో మృతుడు సీతారాంకు కుమార్తె ఉంది. ప్రమాద సంఘటన సమాచారం తెలుసుకున్న డిఎస్పీ ఆర్ వీరేశ్వరరావు, సిఐ నరేందర్, సింగరేణి జిఎం రాజేశ్వరరెడ్డి, పలువురు అధికారులు సంఘటనాస్థలాన్ని సందర్శించి పరిశీలించారు. దుర్ఘటనలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ 25 లక్షలు ఎక్స్‌గ్రేషియాగా సింగరేణి యాజమాన్యం చెల్లించాలని స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య డిమాండ్ చేశారు. మృతిచెందిన ఇరువురు కార్మికులు గిరిజనులైనందున యాజమాన్యం ఆర్థికంగా ఆదుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కాగా ప్రమాదసంఘటనపై పోలీసులు కేసునమోదు చేశారు. మృతదేహాలకు ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు. ఇదిలావుండగా సింగరేణి మైన్స్ పరిసర ప్రాంతాలు నిషేదితమైన్నందున ఇతరులు ప్రవేశించకుండా హెచ్చరికబోర్డులు ఏర్పాటుచేస్తారు. అదేక్రమంలో పురాతన మట్టిగుట్టల ప్రాంతం ప్రమాదకరంగా ఉండడం వలన ప్రత్యేకంగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేయాల్సిన అవసరంవుంది. అవేవిలేన్నందున ప్రైవేట్‌వ్యక్తులు పలు అవసరాల కోసం సింగరేణి మట్టిగుట్టలను ఆశ్రయించి మట్టితొలగిస్తున్నారు. అందులో భాగంగానే మట్టితొలగిస్తున్న క్రమంలో ఈదుర్ఘటన జరిగిందని కార్మికులు పేర్కొన్నారు.

పాల్వంచలో విషాదం

* ముర్రేడువాగులో పడి ఇద్దరు విద్యార్థినులు మృతి

పాల్వంచ, జూలై 1: పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని కుంటినాగులగూడెం సమీపంలో ఉన్న ముర్రేడువాగులో పడి ఇద్దరు విద్యార్థినులు మృతిచెందిన సంఘటన శనివారం పాల్వంచలో జరిగింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం మున్సిపాలిటీ పరిధిలోని కుంటినాగులగూడెం గ్రామానికి చెందిన మోకాళ్ళ నర్సింహారావు, సీతమ్మల కుమార్తె శిరీష (14), ములకలపల్లి మండలం వేముకుంట గ్రామానికి చెందిన మడకం వీరస్వామి, రాజేష్‌ల కుమార్తె రోహిణి (9)తో కలిసి బట్టలు ఉతికేందుకు కుంటినాగులగూడెం సమీపంలోని ముర్రేడువాగు వద్దకు వెళ్ళారు. బట్టలు జాడిస్తున్న క్రమంలో వాగునీటి ప్రవాహం ఎక్కువగా వస్తుండడంతో రోహిణి ప్రమాదవశాత్తు వాగులోపడి కొట్టుకుపోతుండగా పక్కనే ఉన్న తన స్నేహితురాలు శిరీష కాపాడేందుకు విఫలయత్నం చేసింది. దీనితో ఇద్దరూ వాగులో కొట్టుకుపోయి మృతి చెందారు. శిరీష బొల్గోరిగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వతరగతి పూర్తిచేయగా వేముకుంట గ్రామానికి చెందిన రోహిణి కుంటినాగులగూడెంకు చెందిన తన పెద్దమ్మ జయలక్ష్మి ఇంటిలో ఉంటూ శ్రీనివాసకాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో 7వతరగతి చదువుతోంది. ఇద్దరు విద్యార్థినుల మృతితో ఆసుపత్రి వద్ద బంధువులు రోధిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

న్యాయశాఖ ఉద్యోగుల నిరవధిక సమ్మె

* మద్దతు ప్రకటించిన అడ్వకేట్ జెఎసి, బార్ అసోషియేషన్

భద్రాచలం, జూలై 2: హైకోర్టును విభజించాలని, తెలంగాణకు ఆంధ్రా న్యాయమూర్తుల ఆప్షన్‌ను రద్దు చేయాలని, న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయమూర్తులపై విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం న్యాయశాఖ ఉద్యోగులు శనివారం నిరవధిక సమ్మెకు దిగారు. విధులకు వెళ్లకుండా కోర్టుకు ఎదుట నిరసన చేపట్టారు.
కోర్టు సూపరింటెండెంట్ కమలాకర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు హరినారాయణరెడ్డి, లక్ష్మీనారాయణ, హన్మంతు, వెంకటేశ్వర్లు, దుర్గ, సుజిని, రవికుమార్‌లు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ప్రజలు తమకు సమస్య వస్తే కోర్టులను ఆశ్రయిస్తుంటారని, కానీ అటువంటి న్యాయమూర్తులకే కష్టం వస్తే వారి పరిస్థితి ఏంటి? అని వారు ప్రశ్నించారు. వెంటనే హైకోర్టును విభజించాలని వారు డిమాండ్ చేశారు. న్యాయమూర్తులు, న్యాయశాఖ ఉద్యోగులపై విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేయాలని కోరారు. ఇదిలావుండగా న్యాయశాఖ ఉద్యోగుల సమ్మెకు భద్రాచలం అడ్వొకేట్స్ జేఏసీ కన్వీనర్ కొడాలి శ్రీనివాసన్, కో కన్వీనర్ పడిసిరి శ్రీనివాసరావు, న్యాయవాదులు పేరాల నాగరాజు, పేరాల వెంకటేశ్వర్లు, బార్ అసోషియేషన్ అధ్యక్షులు వసంతరావు, కార్యదర్శి శ్రీనివాస ప్రసాద్‌లు సంఘీభావం తెలిపారు.