S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

కడప,జూలై 2: రాష్ట్రప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి విశేష కృషి చేస్తుందని కలెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం స్థానిక నేక్‌నామ్‌ఖాన్ కళాక్షేత్రంలో చంద్రన్న రంజాన్‌తోఫాను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు. రాష్టవ్య్రాప్తంగా చంద్రన్న రంజాన్ కానుక అందజేయడం ముస్లింలకు ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఉన్నటువంటి మసీదులకు చిన్న చిన్న మరమ్మతులు చేయించడం, మైనార్టీలకు ఆర్థికసహాయం అందించడం మంచి ఆలోచన అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈసంవత్సరం మొట్టమొదటిగా మసీదుల్లో పనిచేస్తున్న ఇమామ్‌లు, వౌజన్లకు గౌరవ వేతనాన్ని ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. మైనార్టీల సంక్షేమశాఖ ద్వారా ఎన్నో పథకాలు అమలుచేస్తూ మైనార్టీలను ఆదుకుంటోందని అలాగే పేద మైనార్టీలకు విద్య ఎంతో ముఖ్యమని, ప్రస్తుతం మైదుకూరులో ఉర్దూకళాశాలను కూడా ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఉర్దూకళాశాలలో ఇంటర్మీడియట్‌లో బైపిసి, ఎంపిసి కోర్సులు ఉర్దూ భాషలోనే బోధన జరుగుతోందన్నారు. మైనార్టీల ప్రజలు తమ పిల్లలు ఉర్దూ కళాశాలలో చేర్పించి చదివించాలన్నారు. అలాగే మైనార్టీల ఉపాధి అవకాశం కోసం డిఆర్‌డిఏ శాఖ ద్వారా మైనార్టీలకు వృత్తి నైపుణ్య శిక్షణను ఇస్తున్నామని నిరుద్యోగులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తున్నామని వాటిని ఉపయోగించుకోవాలన్నారు. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో 121 చౌకదుకాణాల ద్వారా 24103 మందికి రంజాన్ తోఫాను అందించడం జరుగుతోందన్నారు. అలాగే జిల్లా మొత్తం రంజాన్‌తోఫా 1,26,564 మంది లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. ముస్లింలకు రంజాన్ మాసం ఎంతోపవిత్రమైందని భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఉండి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ ఎం.లింగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ముస్లిం మైనార్టీలకోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, మైనార్టీలు పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జెసి శే్వత తెవతియ మాట్లాడుతూ ముస్లింమైనార్టీలు కఠోర ఉపవాసాలు ఉండి ఈ కార్యక్రమానికి హాజరయ్యారని, చంద్రన్న రంజాన్‌తోఫాతో ముస్లింలు సంతోషంగా పండుగను జరుపుకోవాలన్నారు. డిప్యూటీ మేయర్ బి.ఆరిఫుల్లా మాట్లాడుతూ అన్ని మతాలను సమదృష్టితో ముఖ్యమంత్రి చూస్తూ చంద్రన్న కానుకలు ఇస్తున్నారని కొనియాడారు. అలాగే 22 మందికి రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు కడప ఆర్డీవో చినరాముడు, డిఎస్‌ఓ విజయరాణి, మైనార్టీ సంక్షేమాధికారి ఖాదర్‌బాషా, తహశీల్దార్ రవిశంకర్‌రెడ్డి, టిడిపి రాష్టమ్రైనార్టీ మాజీ అధ్యక్షుడు అమీర్‌బాబు, టిడిపి జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు), మాజీ మంత్రి డాక్టర్ ఎస్‌ఎ ఖలీల్‌బాషా, నాయకులు హరిప్రసాద్, దుర్గాప్రసాద్, గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ముమ్మరంగా వేరుశనగ సాగు

పులివెందుల, జులై 2: గత పది సంవత్సరాలుగా సకాలంలో ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు కురవక రైతన్న వేరుశనగ పంట సాగును గణనీయంగా తగ్గించారు. ఈ ఏడాది ప్రతి వారం రోజుల కాల వ్యవధిలో వర్షాలు కుస్తుండడంతో మేనెలలోనే దుక్కులు దున్ని తమ పొలాలను ఖరీఫ్‌కు సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల వేరుశనగ సీజన్ కావడంతో వేరుశనగ పంట సాగులో రైతులు నిమగ్నమయ్యారు. ఇదివరకే చాలామంది రైతులు వేరుశనగను సాగుచేశారు. ఇలాగే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని రైతన్న ఖరీఫ్‌పైనే నమ్మకం పెట్టుకున్నాడు. ప్రస్తుతం వేరుశనగ విత్తనాలు కిలో రూ.100 వుండడంతో రైతన్నకు పెట్టుబడి భారమవుతోంది. అయినా సరే వేరుశనగ పంట వల్ల వ్యవసాయానికి ప్రత్యామ్నాయమైన పశు పోషణకు ఇబ్బంది లేకుండా పశువులకు మేత లభిస్తుందని చాలామంది రైతులు ఈ పంట సాగుపైనే్న దృష్టి మళ్లించారు. ఆ దిశగా రైతన్నలు అప్పులు చేసి అత్యధికంగా వేరుశనగ సాగు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వారం నుంచి ప్రతిరోజూ వర్షం కురుస్తుండడంతో రైతన్నలు వేరుశనగ విత్తనాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం రాయితీతో ఇచ్చిన విత్తనాలు కొద్దిగా రావడం వల్ల అవి కేవలం ఒక ఎకరాకు మాత్రమే సరిపోవడంతో అధిక ధరలు వెచ్చించి ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలుచేస్తున్నారు. అలాగే రసాయనిక ఎరువులు కూడా అధిక ధరలు పలుకుతుండడంతో ప్రస్తుతం పంట సాగుచేయడానికి రైతన్నలకు ఎకరాకు రూ.7 వేల నుంచి రూ.8 వేల దాకా ఖర్చవుతోంది. వర్షాలు సకాలంలో కురుస్తాయన్న నమ్మకంతో రైతన్న ఖరీఫ్‌పై ఆశలు పెంచుకొని పంటసాగు చేస్తున్నారు. ఇలాగే సక్రమంగా ప్రతి ఇరవైరోజులకొకసారి వర్షాలు కురుస్తే రైతన్న పెట్టుకున్న ఆశలు గతంలో మాదిరిగా అడియాశలు కాకుండా అధిక దిగుబడిని సాధిస్తారు. రెండవ విడత విడుదల చేసిన రుణ ఉపశమన పత్రాల వలన రైతన్నకు ఎటువంటి ప్రయోజనం లేకుండాపోయింది. ఎందుకంటే పత్రాలు తీసుకెళ్లి బ్యాంకుల్లో చూపుతుంటే బ్యాంకు అధికారులు మాత్రం తమకు ఇంతవరకు ఆదేశాలు లేవని, ఈ పత్రాలు ప్రస్తుతానికి చెల్లవని అంటుండడంతో రైతన్నలు అధిక వడ్డీలకు అప్పులు చేసి పంటలను సాగుచేస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీ పత్రాలను అందజేశాం, రైతులకు మేలు చేశామని చెబుతుందేగానీ బ్యాంకర్లకు మాత్రం సరైన నిర్దేశాలు ఇవ్వకపోవడం వల్ల బ్యాంకు అధికారులు పత్రాలను అంగీకరించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం రుణ ఉపశమనపత్రాలకు బ్యాంకర్లు డబ్బులు చెల్లించేలా చూస్తే రైతన్న అప్పులు తీర్చుకొని ఖరీఫ్ సాగు చేసుకొనే అవకాశం కలుగుతుంది. ఆ దిశగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.