S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆ ఎమ్మెల్యేలకు ఊరట..

కడప,జూలై 2: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నుంచి గెలుపొందిన జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సి.ఆదినారాయణరెడ్డి, టి.జయరాములుపై స్పీకర్‌కు వైకాపా అధిష్ఠానం ఫిర్యాదు చేసిన దరిమిలా శనివారం స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆ ఫిర్యాదులను తిరస్కరించారు. దీంతో జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే టి.జయరాములతోపాటు వారి అనుచరగణంలో ఆనందాని అవధులు లేవు. ఇరువురు ఎమ్మెల్యేలు వైఎస్సార్‌పార్టీ నుంచి గెలుపొంది దాదాపు నాలుగుమాసాలు క్రితం తెలుగుదేశంపార్టీలో చేరారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధిష్ఠానం వారిరువురిపై వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు ఇప్పటికే ఫిర్యాదు చేసింది. ఆమేరకు ఆయన రాజ్యాంగం, అసెంబ్లీ నియమాలను బేరేజు వేసుకుని వైకాపా ఇచ్చిన ఫిర్యాదులు, తీర్మానాలు, రాజ్యాంగానికి వ్యితిరేకంగా ఉన్నాయని వారిపై పార్టీ ఫిర్యాదుల చట్టం వర్తించదని ఆయన శనివారం స్వయంగా వైసిపి నేతలకు తేల్చిచెప్పడంతోపాటు అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శికి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగానే వైసిపి నేతలు ఫిర్యాదు చేశారని ఆయన సైతం తేల్చిచెప్పారు. దీంతో వైసిపి అధిష్ఠానానికి షాక్ తగిలింది. ఇప్పటికే వైసిపి అధిష్ఠానం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, తుది నిర్ణయాన్ని స్పీకర్ తీసుకుంటారని చెప్పడం, స్పీకర్ సైతం న్యాయస్థానానికి రాజ్యాంగపరమైన చట్టాలు, విధి విధానాలు, అసెంబ్లీకి ఉన్న సర్వాధికారాలు ప్రభుత్వ అడ్వకేట్ల ద్వారా సుప్రీం కోర్టుకు ఇప్పటికే సమర్పించినట్లు తెలుస్తోంది. స్పీకర్ కోడెల శివప్రసాద్ మాత్రం రాజ్యాంగానికి లోబడి తన సర్వాధికారాలు వినియోగించుకుంటున్నారని వైసిపి అధిష్ఠానం ఫిర్యాదులు, వైసిపి ఎమ్మెల్యేలుగా ఉంటూ పార్టీకి రాజీనామాచేసి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేల విషయమై తాను అధ్యయనం చేస్తున్నానని వైసిపి అధిష్టానం ఇచ్చిన ఫిర్యాదులు, వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరిన వైనానికి ఎంతో వ్యత్యాసం ఉందని, ఇరువురి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని న్యాయపరంగానే తాను పరిశీలిస్తున్నానని ప్రాథమికంగా వైసిపి ఇచ్చిన ఫిర్యాదుల్లో రాజ్యాంగానికి విరుద్దంగా ఉన్నాయని, అయినా తాను వైసిపి అధిష్ఠానం, టిడిపిలో చేరిన ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుని శాసనసభ గౌరవాన్ని కాపాడుతానని, శాసనసభ చట్టాలను పరిరక్షించాలని ఆయన తేల్చిచెప్పారు. దీంతో వైసిపి అధిష్ఠానం ఖంగుతిని టిడిపిలో చేరిన వైసిపి ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. దీంతో ఎమ్మెల్యేల అనుచర వర్గాల్లో అనందానికి అవధుల్లేవు.

ముస్లింల అభ్యున్నతే టిడిపి ధ్యేయం

బద్వేలు, జులై 2: ముస్లింల అభివృద్ధే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ధ్యేయమని బద్వేలు ఎమ్మెల్యే జయరాములు పేర్కొన్నారు. రంజాన్‌తోఫా పంపిణీలో భాగంగా శనివారం సాయంత్రం స్థానిక జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ముస్లీములకు ఎమ్మెల్యే సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి కూడా టిడిపి ముస్లీం మైనార్టీల సంక్షేమం కోసం ఎన్నో పథకాలనున ప్రవేశపెట్టి సక్రమంగా అందజేస్తోందన్నారు. ముఖ్యంగా మైనార్టీల సమస్యలను పరిష్కరించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్నడో ముందున్నదన్నారు. ప్రతి పేద ముస్లీం కూడా పవిత్ర రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి ఈ తోఫాను అందిస్తున్నారని తెలిపారు. మైనార్టీల కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలను అమలు చేయించడంలో అధికారులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఎస్.పార్ధసారధి, బద్వేలు, గోపవరం ఎంపిపిలు ప్రతాప్‌రెడ్డి, శిరీషా, తహశీల్దార్లు మాధవక్రిష్ణారెడ్డి, అనురాధ, టిడిపి పట్టణాధ్యక్షుడు నరసింహనాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఉక్క్ఫ్యుక్టరీకి రూ.25 వేల కోట్లు కావాలి

ప్రొద్దుటూరు టౌన్, జులై 2: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చైనా దేశంలో పర్యటించి కడపలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించేందుకు రూ.3 వేల కోట్లతో ప్రతిపాదనలు చేయడం సంతోషించదగ్గ పరిణామమని ఉక్కు ఫ్యాక్టరీ సాధనకమిటీ అధ్యక్షుడు జి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక దీప్తి జూనియర్ కళాశాలలో విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ రూ.3 వేల కోట్లు ఏ మూలకూ సరిపోవని, పూర్తి స్థాయిలో ఫ్యాక్టరీ ప్రజలకు అందుబాటులోకి రావాలంటే రూ.25 వేల కోట్ల నిధులుంటేనే సాధ్యమవుతుందని అన్నారు. జిల్లాలో ఉక్క్ఫ్యుక్టరీని ఏర్పాటుచేస్తే ప్రత్యక్ష్యంగా 25 వేల మందికి, పరోక్షంగా లక్షమందికి ఉపాధి కల్పించవచ్చునని, దీని ద్వారా మన రాష్ట్రంలో స్టీల్ ధరలు తగ్గుముఖం పట్టి గృహాలు నిర్మించుకొనే పేదవారికి మంచి జరుగుతుందన్నారు. నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్న యువకులు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలే శరణ్యమనుకుంటున్నారని, వారి కోసం ఉక్కు పరిశ్రమను స్థాపించాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమలో కరవు రక్కసి కోరలు చాస్తోందని, అలాంటి వెనుకబడిన సీమ ప్రాంతంలో ఈ ఉక్కు పరిశ్రమ స్థాపనతోనే భవిష్యత్ వుంటుందన్నారు. రాయలసీమ వాసిగా చంద్రబాబునాయుడుకు ఇవన్నీ తెలిసినవేనని, విద్యార్థులు, నిరుద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో వుంచుకొని పరిశ్రమనకు నాంది పలకాలన్నారు. రాయలసీమ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అందు కోసం విద్యార్థులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పరిశ్రమ సాధన కమిటీ కార్యదర్శి ఖలందర్, దీప్తి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులరెడ్డి, జీవనజ్యోతి పాఠశాల అధినేత అమర్‌నాథ్‌రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

నేడు మంత్రి సునీత రాక
ప్రొద్దుటూరు టౌన్, జులై 2: రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత ఆదివారం పట్టణంలో పర్యటించనున్నట్లు టిడిపి ఇన్‌చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముస్లింలకు ఇచ్చే రంజాన్‌తోఫాను మంత్రి చేతులమీదుగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, టిడిపి నాయకులు హాజరుకావాలని ఆయన కోరారు.

60 సంవత్సరాలు నిండిన వారికి
ఆర్టీసీ బస్సుల్లో 25శాతం రాయితీ
పులివెందుల, జులై 2: 60 సంవత్సరాల వయస్సు దాటిన వారికి 25శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం గోపీనాథ్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఆర్టీసీ డిపోలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 60 ఏళ్ల వయస్సు దాటిన వారు ఆర్టీసీలో రాయితీ పొందేందుకు ఆధార్‌కార్డు ఒరిజనల్‌ను తీసుకెళ్లాలని, లేకపోతే రాయితీ వర్తించదన్నారు. అంతే కాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోలను ఆధునీకరిస్తున్నామని, జిపిఎస్ ద్వారా బస్సులు ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చునన్నారు. తద్వారా సమయపాలన పాటిస్తున్నారా లేదా తెలుసుకోవచ్చునన్నారు. ప్రయాణీకులకు బస్సులో సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పులివెందుల నుంచి భీమవరానికి బస్సును ఏర్పాటు చేస్తున్నామని, చిరు వ్యాపారులకు ఆర్టీసీలో లగేజ్ సౌకర్యం అతి తక్కువ చార్జీతోనే కల్పిస్తున్నామన్నారు. పులివెందుల డిపో చాలావరకు బాగుందన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ అజంతుల్లా, సిబ్బంది ఉన్నారు.

రాయలసీమ హక్కుల కోసం
పోరాడుదాం

వీరపునాయునిపల్లె, జులై 2: రాయలసీమకు తరతరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలందరూ కలిసికట్టుగా రాయలసీమ హక్కుల కోసం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని రాయలసీమ పర్యవేక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. శనివారం వీరపునాయునిపల్లెలో ఏర్పాటుచేసిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ వాసులే ముఖ్యమంత్రులుగా పరిపాలించి సీమకు న్యాయం చేయలేదని ఆయన అన్నారు. సీమకు రావలసిన ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు రాకుండా అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం రాయలసీమ వాసుల పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. సీమకు వరప్రసాదిని అయిన కడప ఉక్కు ఫ్యాక్టరీని ఇంతవరకు సాధించుకోలేకపోయారని, ఆ ఫ్యాక్టరీ గురించి రాజకీయ నాయకులు ఒక్క మాటైనా మాట్లాడడం లేదన్నారు. సీమ సమస్యలకై త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, రైతులు, ప్రజలు పార్టీలకతీతంగా కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు.