S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నగరంలో ముమ్మర తనిఖీలు

అనంతపురం సిటీ, జూలై 2: దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్న ఉగ్రవాదుల కదలికలు జిల్లాలో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు నగరంలో శనివారం నుండి ముమ్మర తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉగ్రవాదుల కార్యకలాపాలు తీవ్రంగా ఉన్నట్లు ఇంటిలిజెన్సీ సమాచారంతో జిల్లాలో కూడా పలుచోట్ల పోలీసులు తనిఖీలను చేపట్టారు. జిల్లా కేంద్రంలో కొంతమంది ఉగ్రవాదులు తలదాచుకుని ఇక్కడ నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు నగరంలోని అన్ని వీధులు, లాడ్జిలు, బస్టాండ్లు, వెహికల్స్‌ను తనిఖీలు చేపట్టారు. గతంలో తుపాకులు, ఇతర మందు సామాగ్రిలను కొనుగోలు కోసం జిల్లా కేంద్రంలో ఉగ్రవాదులు సంచరించారనే సమాచారం ఉండడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం త్రీటౌన్ సిఐ గోరంట్ల మాధవ్, ఎస్‌ఐ శ్రీనివాసులు, ఇతర సిబ్బందితో కలసి త్రీ టౌన్ పరిధిలోని శ్రీనివాసనగర్, ఆర్‌టిసి బస్టాండు, శ్రీ కంఠం సర్కిల్, తాడిపత్రి బస్టాండు, తపోవనం, ఇతర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. అనుమానితులను, వెహికిల్స్‌ను తనిఖీ చేశారు. నగరంలో అనుమానిత వ్యక్తులు ఎవరు కనిపించినా తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు.
అభివృద్ధి చేయండి..
అండగా ఉంటాం..
* పిసిసి చీఫ్ ఎన్.రఘువీరా
పెనుకొండ, జూలై 2 : ప్రభుత్వంతోపాటు స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పిసిసి అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. మండల పరిధిలోని గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తి చేయలేదని, ఆర్టీసీ డిపో ప్రారంభం, కొండపై లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణం, కొండపై విద్యుత్ సమస్యలు తీర్చలేదన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం రూ.వేల కోట్లు దండుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోందే తప్ప సమస్యలు తీర్చడంలో శ్రద్ధ చూపడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాటాలు సాగిస్తోందన్నారు. 2007లో హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3 వేల కోట్లు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో జీడిపల్లి వరకు నీటిని తెచ్చామన్నారు. మిగిలిన రూ.1200 కోట్లు ఖర్చు చేస్తే హంద్రీనీవా పూర్తి అవుతుందన్నారు. దాన్ని రూ.3వేల కోట్లకు అదనపు అంచనాలు చేసి టిడిపి నేతలు జేబులు నింపుకున్నారన్నారు. అంతేగాకుండా శ్రీకృష్ణదేవరాయల పంచ శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించామమన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్సవాలను పక్కన పెట్టిందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమకు 40 టిఎంసిల నీరు వస్తాయన్నారు. నికరజలాల కోసం రాయలసీమ ఎంపిలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు టిడిపి అధినేతను నిలదీయడం లేదన్నారు. అనంతరం పట్టణంలో ఓ ఫంక్షన్‌లో హాలులో జరిగిన కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ కార్యకర్తలు మనోధైర్యంతో పనిచేయాలన్నారు. రాబోయే కాలంలో కార్యకర్తలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఇందులో భాగంగా గొల్లపల్లి రిజర్వాయర్‌ను సందర్శించి రైతులతో ముఖాముఖి చర్చించారు. భూ నిర్వాసితులకు నష్ట పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల గొల్లపల్లి ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రజలను ఆదుకోవాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు కొరవడ్డాయని, దీని వల్ల పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఆయా కార్యక్రమాల్లో డిసిసి అధ్యక్షులు కోటా సత్యం, పెనుకొండ ఇన్‌చార్జి కెటి శ్రీ్ధర్, చిన్న వెంకట్రాముడు, నాయకులు మహేశ్వర్‌రెడ్డి, నారాయణరెడ్డి, చంద్రకాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.