S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శ్రీవారి సేవలో మరో రెండు ఉచిత బస్సులు

తిరుమల, జూలై 2: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కలకత్తాకు చెందిన ప్రకాష్ చౌదరి అనే భక్తుడు రెండు బస్సులకు విరాళంగా అందించారు. శనివారం ఉదయం శ్రీవారి ఆలయం సమీపాన ఉన్న వైభవోత్సవ మండపం వద్ద బస్సులకు సంబంధించిన తాళాలను దాత తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజుకు అందించారు. తిరుమలలో భక్తుల కోసం టిటిడి ఉచిత బస్సులను నడుపుతున్న విషయం విదితమే. అందులో భాగంగా టిటిడి 29 లక్షల రూపాయలతో అశోక్‌లేలాండ్ సంస్థకు చెందిన రెండు చాసిస్‌లను కొనుగోలు చేసింది. వీటికి కలకత్తాకు చెందిన భక్తుడు ప్రకాష్ చౌదరి 25 లక్షల రూపాయలతో బాడీ కట్టించి శనివారం టిటిడికి బహూకరించారు. అనంతరం ఆలయం ఎదుట నూతన బస్సులకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌పోర్టు జి ఎం శేషారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సాక్షాత్కార వైభవ పోస్టర్ల ఆవిష్కరణ
చంద్రగిరి, జూలై 2: చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో వెలసి ఉన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 8 నుంచి సాక్షాత్కార వైభవ ఉత్సవాలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి వాల్‌పోస్టర్లను టిటిడి ఇ ఓ సాంబశివరావు శనివారం ఆవిష్కరించారు. శ్రీనివాసమంగాపురంలో వెలిసి ఉన్న శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 7వ తేది కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుందని అన్నారు.
11న పార్వేట ఉత్సవం
శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాల మరుసటి రోజైన 11వ తేదీ పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించేందుకు టిటిడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారి మెట్టు సమీపంలోని పురాతన మండపంలో ఉదయం 7నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పార్వేట ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు
ఈనెల 7వ తేదీ తిరుప్పావడ సేవ, 8 నుంచి 11వ తేదీ వరకు ఆర్జిత కల్యాణోత్సవ సేవలు రద్దయినాయి. అదేవిధంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టు ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతి రోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. కావున భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని టిటిడి అధికారులు కోరారు. ఈ సందర్భంగా వాల్‌పోస్టర్లను టిటిడి ఇ ఓ సాంబశివరావు ఆవిష్కరించారు.