S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

టిటిడి పథకాలకు రూ.5 లక్షల విరాళం

తిరుమల, జూలై 2: టిటిడి నిర్వహిస్తున్న అన్నప్రసాదం ట్రస్టుకు లక్ష రూపాయలు, బర్డ్ ట్రస్టుకు లక్ష రూపాయలు, హరిటేజ్ రిజర్వేషన్ ట్రస్టుకు 3 లక్షల రూపాయల విరాళాలను టిటిడి ట్రస్టుబోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి శనివారం డిడి రూపంలో టిటిడి ఇ ఓ డాక్టర్ డి. సాంబశివరావుకు అందజేశారు.

నాలెడ్జ్ మిషన్‌తో వర్సిటీకి అత్యున్నత స్థానానమే లక్ష్యం
* మహిళా వర్సిటీ వీసీ దుర్గ్భావాని వెల్లడి
ఆంధ్రబూమి బ్యూరో
తిరుపతి, జూలై 2: నాలెడ్జ్ మిషన్‌తో మహిళా వర్సిటీని అత్యున్నత స్థానానికి తీసుకెళ్లడమే లక్ష్యంగా తమ వర్సిటీలోని బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారని వర్సిటీ ఉపకులపతి ఆచార్య డాక్టర్ దుర్గ్భావాని తెలిపారు. సమ్మర్ ఫెలో బృందం మహిళా వర్సిటీని సందర్శించి వర్సిటీలో ప్రణాళికాబద్ధంగా చేపట్టాల్సిన పలు అంశాలపై వర్సిటీలో పనిచేసే బోధనా సిబ్బందికి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని గత రెండురోజులుగా చేపట్టారు. ఈ నేపథ్యంలో సమ్మర్ ఫెలోస్ బృందంలో పాల్గొన్న సమాజంలో పెరుగుతున్న విద్యావిధానాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి విద్యార్థులకు బోధించే బృందంలోని కనేరి గుర్నాని, అడ్నాహ్‌బ్రైట్, మానసావరుణ్, గౌరవ్ ప్రధాన్‌తో పాటు వారికి నాయకత్వం వహించిన అజయ్‌జైన్‌ను శనివారం విలేఖరులకు పరిచయం చేయించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్సిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ నిరంతర కృషిచేసి నాణ్యతాప్రమాణాలు పాటిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించడం ఎంతో సులభం అన్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు నాలెడ్జ్ మిషన్ ను అభివృద్ధి పరచుకోవాలని వర్సిటీలకు దిశానిర్ధేశం చేశారన్నారు. ఇందులో భాగంగా ఇంక్యుబులేషన్, విదేశాల విశ్వవిద్యాలయాలతో అనుసంధానం లాంటి ప్రభుత్వ వర్సిటీలకు ప్రైవేటు పారిశ్రామిక వేత్తలతో అనుసంధానం లాంటివి ఎంతో ముఖ్యమైనవన్నారు. ఈ దిశగా ఇప్పటికే తాము ముందుకు సాగుతున్నామని, అయితే ప్రస్తుతం ఉన్న మార్గ దర్శకాలకు అనుగుణంగా వర్సిటీలో చేపట్టాల్సిన చిన్నచిన్న మార్పులు, చేర్పులపై దృష్టి సారించాలన్నారు. ఇందులోభాగంగా సమ్మర్ ఫెలోస్ బృందం తమకు అనేక సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. వర్సిటీలో సొసైటీని ఏర్పాటుచేసుకోవడం ద్వారా దాతలు ఎవరైనా విరాళాలు ఇచ్చినపుడు ఎన్జీవోలతో సంబంధం లేకుండా నేరుగా ఆ నిధులు విశ్వవిద్యాలయానికి చేరుతాయన్నారు. వాటి ద్వారా నిర్దేశించిన కార్యక్రమాలను వేగవంతంగా అమలుచేయడానికి మరింత సానుకూలంగా ఉంటుందన్నారు. నాలెడ్జ్ విషయంలో గతంలో పనిచేసిన అనుభవం తనకు ఉండటంతో వర్సిటీ అభివృద్ధికి కొంత దోహదపడుతుందని తాను భావిస్తున్నానన్నారు. ఈ సమ్మర్ ఫెలోస్ బృందంతో తమ విద్యార్థులు మమేకమై పలు అంశాలుపై చర్చించారన్నారు. ఇక ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా విద్యార్థులు ఉద్యోగాలిచ్చే స్థితికి ఎదగడానికి ఉన్న మార్గాలను ఈ నాలెడ్జ్ మిషన్ ద్వారా విద్యార్థులు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈకార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య విజలయలక్ష్మి, పి ఆర్వో శోభ తదితరులు పాల్గొన్నారు.