S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలి

కాకినాడ, జూలై 2: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు రుణాలు సకాలంలో మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి సింగిల్ డెస్క్ ప్రకారం అన్నింటికీ అనుమతులు సకాలంలో మంజూరు చేయాలన్నారు. వచ్చే వారం నాటికి లక్ష్యాలను అధిగమించాలని పరిశ్రమల డిఎంకు సూచించారు. డిఎం డేవిడ్ సుందర్‌కుమార్ మాట్లాడుతూ ఈ నెలలో 142 యూనిట్లు గ్రౌండ్ చేయగా, రూ.4,800 లక్షల పెట్టుబడితో 1543 మందికి ఉపాధి కల్పిస్తున్నటు చెప్పారు. సమావేశంలో డిపిఒ శర్మతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
భీమేశ్వరుని సేవలో హైకోర్టు జడ్జి రామలింగేశ్వరరావు
సామర్లకోట, జూలై 2: స్థానిక పంచారామక్షేత్రం భీమేశ్వరాలయంలో శనివారం రాత్రి ఉమ్మడి హైకోర్టు జడ్జి రామలింగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయానికి విచ్చేసిన జడ్జి రామలింగేశ్వరరావు బృందానికి ఆలయ ఇఒ పులి నారాయణమూర్తి, అర్చకుల బృందం మేళతాళాలతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత జడ్జి రామలింగేశ్వరరావు భీమేశ్వరునికి, తదుపరి బాలాత్రిపుర సుందరీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉపాలయాలను దర్శించుకున్నారు. తదుపరి నంది మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ పూజల్లో సామర్లకోట ఎస్సై ఆకుల మురళీకృష్ణ, ప్రోటోకాల్ అధికారులు పాల్గొన్నారు.
ద్రాక్షారామను సందర్శించిన శాసనమండలి హక్కుల కమిటీ సభ్యులు
రామచంద్రపురం, జూలై 2: ద్రాక్షారామ శ్రీ భీమేశ్వరస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి హక్కుల కమిటీ సభ్యులు, ఛైర్‌పర్సన్ పి శమంతకమణి నేతృత్వంలో శనివారం సందర్శించారు. ఆలయం వద్ద ఆర్డీఒ కె సుబ్బారావు, డిఎస్పీ ఎన్‌బిఎం మురళీకృష్ణ, హక్కుల కమిటీ సభ్యులకు హార్థిక స్వాగతం పలికారు. ఆలయ ఇఒ పెండ్యాల వెంకట చలపతిరావు నేతృత్వంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలోని శ్రీ దుండి గణపతి, ఆలయ క్షేత్ర పాలకులు శ్రీ లక్ష్మీనారాయణస్వామి, క్షేత్రాధిపతి శ్రీ భీమేశ్వరస్వామి, శ్రీ మాణిక్యాంబ అమ్మవారి సన్నిధుల్లో పూజాకార్యక్రమాలు నిర్వహించుకున్నారు. ఆలయ విశిష్టతను శాసనమండలి హక్కుల కమిటీ సభ్యులు, అధికారులు, ఆలయ అర్చకులను అడిగి తెలుసుకున్నారు. నమూనా గుడిని తిలకించారు. అనంతరం బేడామండపంలో వేద పండితులు, అర్చకులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ ఇఒ పెండ్యాల వెంకట చలపతిరావు హక్కుల కమిటీ ఛైర్‌పర్సన్, సభ్యులకు ప్రసాదాలు, జ్ఞాపికలు, ఆలయ విశిష్టత తెలిపే పుస్తకాలను అందించారు. కమిటీ ఛైర్‌పర్సన్ పమ్మిడి శమంతకమణి, సభ్యులు పీరుకట్ల విశ్వప్రసాదరావు, గాదె శ్రీనివాసుల నాయుడు, వి బాలసుబ్రహ్మణ్యం, పిజె చంద్రశేఖరరావులతో పాటు ఛైర్‌పర్సన్ పిఎ టి నాగమాంబ, అసిస్టెంట్ సెక్రటరీ కె రాజకుమార్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వై లోకేష్‌రెడ్డి, ఆంధ్ర, ఆంగ్లభాష అనువాదకులు కె రాజకుమార్, మల్లికార్జునశర్మ తదితరులు ఆలయ సందర్శన చేసినవారిలో ఉన్నారు. రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆలయ అతిథిగృహం వద్ద ఛైర్‌పర్సన్ శమంతకమణి, ఇతర సభ్యులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రామచంద్రపురం తహసీల్దార్ పెండ్యాల రామ్మూర్తి, సిఐ పచ్చా కాశీవిశ్వనాథ్, ఎస్సైలు లఖావతు శ్రీను నాయక్ (రామచంద్రపురం), ఫజుల్ రహమాన్ (ద్రాక్షారామ), జి నరేష్ (కె గంగవరం)లు ప్రొటోకాల్ పాటించారు.
రోటరీ సేవలు విస్తరింపజేయాలి
ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప
కాకినాడ, జూలై 2: సమాజంలో రోటరీ క్లబ్ చేస్తున్న ఎన్నో మంచి పనులను మరింతగా విస్తరింపజేయాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో రోటరీ భాగస్వామ్యం అయితే సేవలు మరింత విస్తృతంగా అమలుచేసి, వాటి ఫలితాలు లబ్ధిదారులకు అందే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. స్థానిక సూర్యకళా మందిరంలో రోటరీ గవర్నర్‌గా డాక్టర్ ఎస్‌విఎస్ రావు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి రాజప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు.