S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ముస్లిం మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ఒంగోలు,జూలై 2: రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార,పౌరసంబంధాల,ఐటి శాఖమంత్రి పల్లె రాఘనాథరెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక గుంటూరురోడ్డులోని పాటిబండ్ల గోపాలస్వామి ఫంక్షన్‌హాలులో రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో రంజాన్ ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పల్లె మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందన్నారు. ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం చంద్రన్న రంజాన్ తోఫాను అందిస్తుందన్నారు. రాష్ట్రంలో వక్ఫ్‌బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఉత్తర్వులు ఇచ్చినట్లు చెప్పారు. జిల్లాలో 65వేల 772మంది ముస్లీం మైనార్టీలకు రెండుకోట్ల 16లక్షల రూపాయలతో రంజాన్ తోఫాను అందించి రంజాన్ పండగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. మసీదుల్లో పనిచేసే ఇమామ్‌లకు మూడువేలు, దులహనాలకు ఐదువేల రూపాయలు చొప్పున గౌరవవేతనం ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. మసీదుల్లో పనిచేసే మతపెద్దల గౌరవవేతనం గత సంవత్సరం, ఈసంవత్సరం కలిపి 36లక్షల రూపాయలనిధులను మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 259మందిని మక్కా యాత్రకు పంపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్రంలో మసీదుల అభివృద్ధి కోసం మూడుకోట్ల 70లక్షల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. కార్పొరేషన్ స్థాయిలో ఉన్న మసీదులు 17వేలు, మునిసిపాలిటీల్లో ఉన్నవాటికి 15వేలు, మండల స్థాయిలో ఉన్నవాటికి పదివేల రూపాయల చొప్పున నిధులను మంజూరు చేశామన్నారు. ఈసందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖమంత్రి రావెల కిశోర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో మైనార్టీలను అన్నివిధాల ప్రభుత్వం అదుకుంటుందన్నారు. ముస్లిం ప్రజల్లో విద్యాశాతం తక్కువుగా ఉందని, రాష్ట్రంలో మైనార్టీ ప్రజల విద్యకోసం ఉర్దూ యూనివర్శిటీని ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందన్నారు. ముస్లింలకు విద్య, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి ముస్లిం మైనార్టీ ప్రజలకు అన్ని విధాల భరోసా కల్పిస్తున్నారన్నారు. ముస్లింలు అందరూ ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రాష్టర్రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ముస్లిం మైనార్టీప్రజలకు పెద్దపీట వేసిందన్నారు. ముస్లిం మైనార్టీ సంక్షేమంకోసం రాష్ట్రప్రభుత్వం ఏడువందల కోట్లరూపాయలతో మైనార్టీకార్పోరేషన్ ద్వారా సంక్షేమకార్యక్రమాలను అందిస్తుందన్నారు. పేదముస్లీం కుటుంబాల పిల్లల వివాహం కోసం 50వేల రూపాయల ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందన్నారు. రాష్ట్రప్రభుత్వం రంజాన్ పండగను రాష్టప్రండగగా చేపట్టి అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహిస్తుందన్నారు. ముస్లిం పేద కుటుంబాలకు వివాహఖర్చులకు సంబంధించి 50వేల రూపాయల చొప్పున ఒక్కొక్కరికి చెక్కులను పంపిణీచేశారు. ఈసందర్భంగా ముస్లిం మతపెద్దలతో మంత్రులు, జిల్లాకలెక్టర్ సుజాతశర్మ, జిల్లా జడ్జి విజయకుమార్, ఎస్‌పి త్రివిక్రమవర్మతోపాటు ప్రజాప్రతినిధులు పాల్గొని రంజాన్ ప్రార్థనలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి,కందుకూరుమాజీ శాసనసభ్యుడు దివి శివరాంతోపాటు అధికారులు, అనధికారులు, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి
- ప్రత్యేక హోదా బిల్లులో లేదు
- స్టీలు ప్లాంటు ఏర్పాటుకు కమిటీ
- జిల్లా కార్యవర్గ సమావేశంలో మంత్రి కామినేని
చీరాల, జూలై 2: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశం స్థానిక ఎన్‌వి ఎస్ అండ్ ఎస్‌జెఆర్ కల్యాణ మండపంలో శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే ముఖ్యమన్నారు. ప్రపంచంలో 11 కోట్ల సభ్యత్వమున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కటేనన్నారు. మోదీ నాయకత్వంలో రెండేళ్ల పాలనలో ప్రవేశపెట్టిన 46 పథకాలను నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మచ్చ లేని సమర్థనాయకులున్న పార్టీ కూడా తమదేనన్నారు. 1984 తర్వాత కేంద్రంలో పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలు తీర్పునిచ్చారన్నారు. అయితే ఎపిలో వ్యవస్థాగతంగా బలంగా లేకపోవడం వల్ల కేవలం 4 అసెంబ్లీ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగామన్నారు. గత ప్రభుత్వంలో దేశ ప్రతిష్ఠ దిగజారితే నేడు ఒక్క అవినీతి ఆరోపణ సైతం లేకుండా మోదీ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని న్యాయంగా విడదీయాలని బిజెపి కోరితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా పార్లమెంటులో తలుపులు మూసి విభజించిందని ఆరోపించారు. దీనిపై వెంకయ్యనాయుడు ఒంటరిగా పోరాడారని కితాబిచ్చారు. ఎపిలో స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు కమిటీ వేసినట్లు చెప్పారు. అయితే విభజన బిల్లులో ప్రత్యేక హోదా అంశం లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రమంత్రిగా వెంకయ్యనాయుడు మన రాష్ట్రానికి లక్ష ఇళ్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. అదే విధంగా దేశవ్యాప్తంగా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న మూడు రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటని తెలిపారు. జిల్లాలో తగినన్ని నీటి వనరులు లేక వెనుకబడిందన్నారు. వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. వాన్‌పిక్ మంచి ప్రాజెక్టు అయినప్పటికీ వ్యక్తిగత లాభాపేక్ష వల్ల అది నీరుగారిందన్నారు. రామాయపట్నం పోర్టు ఏర్పాటైతే జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పోర్టుకు, నూతనంగా ఏర్పాటు చేసే పోర్టుకు మధ్య కనీసం 100 కిలోమీటర్ల దూరం ఉండాలన్నారు. పశ్చిమ ప్రకాశంలో ఫ్లోరోసిస్ వల్ల ఎక్కువగా కిడ్నీ సంబంధ వ్యాధులు వస్తున్నాయని తెలిపారు. ఆ సమస్యను అధిగమించడంతో పాటు దొనకొండలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి దక్షిణ భారతదేశంలోనే మన రాష్ట్రం మాతాశిశు మరణాల సంఖ్యలో అగ్రస్థానంలో ఉండేదన్నారు. అయితే ప్రస్తుతం వైద్య పరీక్షలు 87 శాతం మెరుగుపడ్డాయని తెలిపారు. రెండేళ్ల పాలనలో 1400 మంది వైద్యులను నియమించామని, మరో 500 మందిని త్వరలో నియమిస్తామన్నారు. వ్యవస్థను ఒక్కసారిగా మార్చలేమని, అవసరం అనుకుంటేనే వైద్యులను బదిలీ చేస్తామని స్పష్టం చేశారు. బదిలీ చేసిన వైద్యుల స్థానంలో కొత్తవారిని నియమించేందుకు ఆరు నెలల సమయం పడుతుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పలువురు సీనియర్ నాయకులు మాట్లాడుతూ తమ పార్టీ పాలనలో జిల్లాలో 24వేల మందికి ముద్ర రుణాలు అందజేశామన్నారు. సుకన్య సమృద్ధి యోజన పధకంలో 25,700 మందికి, జనధన యోజన కింద 5లక్షల 5వేల ఖాతాలు తెరిచామన్నారు. జిల్లా వ్యాప్తంగా లక్ష మరుగుదొడ్లు నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పశ్చిమ ప్రకాశంలోని 6 నియోజకవర్గాలకు లబ్ధి చేకూర్చే వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. రామయపట్నం పోర్టుకు కేంద్రం సుముఖంగా ఉందని, అయితే స్థలసేకరణ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. పోర్టు నిర్మాణం పూర్తయితే 45 మండలాలు అభివృద్ధి చెందుతాయన్నారు. కనిగిరిలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు జిఒ వచ్చినప్పటికీ ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదన్నారు. జిల్లా అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్సీ మోర్చా, ఒబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు దారా సాంబయ్య, కమలేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరాల రమణారెడ్డి, గోలి నాగేశ్వరరావు, జిల్లా ఇన్‌చార్జి కందుకూరి సత్యనారాయణ, పూర్వపు జిల్లా అధ్యక్షుడు మువ్వల వెంకటరమణారావు, సీనియర్ నాయకులు బత్తుల నరసింహారావు, నాశన చంద్రశేఖర్, బండారుపల్లి హేమంత్‌కుమార్, చీరాల పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లు మేడికొండ భరణీరావు, పింజల భరణీరావు, పట్టణ అధ్యక్షుడు అరవపల్లి కుమార్, రామిశెట్టి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.