S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

త్వరలో ఐదు జిల్లాల్లో పాల విక్రయాలు

ఒంగోలు, జూలై 2: రాష్ట్రంలోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అమరావతి, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో త్వరలో మంచిరోజులు చూసుకుని పాలను విక్రయించనున్నట్లు ఒంగోలు డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. శనివారం రాత్రి వరకు సాగిన బోర్డుమీటింగ్ వివరాలను విలేఖర్లకు వెల్లడించారు. ఈ జిల్లాల్లో పాలను విక్రయించేందుకు ప్రత్యేకంగా జనరల్ మేనేజరును నియమించినట్లు చెప్పారు. జిల్లాలో వచ్చేసంవత్సరం మార్చినాటికి రోజుకు లక్ష లీటర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలోని పాల ఉత్పత్తిదారులకు ఎలాంటి బకాయిలులేవని, అదేవిధంగా సిబ్బందికి నెలవారీ జీతాలను అందచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. డెయిరీ అభివృద్ధే లక్ష్యంగా తాను పనిచేస్తున్నానని చల్లా స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డెయిరీ జింతోపాటు పాలకవర్గసభ్యులు పాల్గొన్నారు.

గ్రామాల్లో వౌలిక సదుపాయాల
కల్పనే నాబార్డు లక్ష్యం : డిజిఎం
ముండ్లమూరు,జూలై 2 : గ్రామాల్లో వౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా నాబార్డు సంస్థ పనిచేస్తుందని ఆ సంస్థ డిజిఎం సూరిబాబు అన్నారు. శనివారం మండలంలోని మారెళ్ళ, జమ్మలమడుగు గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకం పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డిజిఎం మాట్లాడుతూ రాష్ట్రంలో 12 ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి 150కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిపాదనలు అందినట్లు త్వరలో నిధులు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. మారెళ్ల ఫోర్ ఎత్తిపోతల పథకానికి 44 కోట్లరూపాయల వ్యయంతో ప్రతిపాదనలు అందాయని, వీటిని పరిశీలించామని త్వరలోనే మంజూరు చేస్తామని రైతులకు ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం వాటర్‌షెడ్‌లు, ట్రైబల్ ఏరియాల్లో ఉద్యానవన తోటల పెంపకానికి రైతులకు రుణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. అదే విధంగా విద్యాలయాలకు తాగునీరు, సాగునీరు పథకాలకు కూడా నాబార్డు రుణాన్ని అందజేస్తున్నామన్నారు. గ్రామాల్లోనిప్రజలు అన్నీ రంగాల్లో ముందుండే విధంగా నాబార్డు సంస్థ ప్రోత్సహిస్తుందన్నారు. తమ సంస్థ ఎత్తిపోతల పథకం ప్రతిపాదనలు పంపించిన వెంటనే క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తామని, అనంతరం పనులు మొదలుపెట్టిన తరువాత ఏ విధంగా పనులు జరుగుతుందీ అనేవి పరిశీలిస్తామని ఆయన తెలిపారు. జమ్మలమడక గ్రామంలో 18 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాన్ని నాబార్డు బృందం పరిశీలించింది. అనంతరం ఎత్తి పోతల పథకం రైతులతో పూర్తి అయిన వెంటనే ఏ విధంగా నడుపుకుంటారో, దానికి తీసుకోవాల్సినజాగ్రత్తల గురించి నాబార్డు బృందం రైతులకు తెలియజేసింది. ఉద్యానవన పంటలు, వాణిజ్య పంటలు సాగు చేసుకొని అధిక లాభాలు పొందాలని రైతులను డిజియం కోరారు. ఈ కార్యక్రమంలో డిజియం వెంట నాబార్డు ఈ ఈ నరసింహారావు, నాబార్డు సిబ్బంది వేణుగోపాలరావు, నరసింహారావు, వరదరాజులు, ఎంపిపి ఎం వెంకట్రావు, మారెళ్ళ ఎంపిటిసి సుంకర రాఘవరెడ్డి, జమ్మలమడక సర్పంచ్ చావా బ్రహ్మయ్య, ఎంపిటిసీ శ్రీను, ఎయంసీ మాజీ చైర్మన్ కొలగాని యలమందారెడ్డి, ముండ్లమూరు సర్పంచ్ ఎం వెంకట్రావు, రైతులు తదితరులు ఉన్నారు.

ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్‌పై మంత్రి ఆగ్రహం
చీరాల, జూలై 2 : చీరాల వైద్యశాలకు తాను గతంలో వచ్చినప్పటికీ, ఇప్పటికీ పరిస్థితిలో కొంత మార్పు వచ్చిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. శనివారం చీరాల ఏరియా హాస్పిటల్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ పారిశుద్ధ్యం బాగున్నప్పటికీ మరింత మెరుగు పడాల్సి ఉందన్నారు. వైద్యశాలలో నూతన భవన నిర్మాణం కోసం సుమారు రూ.9 కోట్లు మంజూరు చేయడంతో పాటు వైద్యుల కొరత కొంత వరకు తీర్చగలిగామన్నారు. కాన్పుల వార్డులో ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అటువంటివి పునరావృతమైతే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకున్న అర్బన్ ప్రాంత స్ర్తిలకు రూ.700, గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1,000 అందజేస్తున్నట్లు తెలిపారు.
అంతర్గత మాఫియా: ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ ఆస్పత్రిలో అంతర్గత మాఫియా నడుస్తుందని మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రికి సూపరిండెంట్‌గా ఉంటూ ప్రసన్నకుమార్ సొంత క్లినిక్ నడుపుతున్నారని తెలిపారు. అంబులెన్సు డ్రైవర్లు మద్యం సేవించి నడుపుతున్నారని ఆయనకు వివరించారు. వారిపై చర్యలు తీసుకోవాలని తాను స్వయంగా చెప్పినప్పటికీ సూపరింటెండెంట్ పట్టించుకోలేదని మండిపడ్డారు. అది తనకు సంబంధించిన విషయం కాదంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని వాపోయారు. ప్రయివేటు అంబులెన్సు యజమానులతో కుమ్మక్కై ఆస్పత్రి అంబులెన్సుకు డ్రైవర్ లేకుండా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. మంత్రి స్పందిస్తూ మీపై వచ్చిన ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారని సూపరింటెండెంట్‌ను ప్రశ్నించారు. అందుకు ఆయన నీళ్లు నమలడంతో మంత్రి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శామ్యూల్‌తో మంత్రి ఫోన్‌లో సంప్రదించారు. చీరాల ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ ప్రసన్నకుమార్‌ను మార్చి మరో సీనియర్ వైద్యుడిని నియమించాలని వౌఖిక ఆదేశాలు జారీ చేశారు.