S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జిల్లాలో వెనుకబడిన గ్రామాలను దత్తత తీసుకోవాలి

ఒంగోలు, జూలై 2:జిల్లాలోని వెనుకబడిన గ్రామాలను ఎన్‌ఆర్‌ఐలు దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన ఆటా సదస్సులో ఎంపి సుబ్బారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో అనేక వెనుకబడిన గ్రామాలు ఉన్నాయని వాటి మీద ఎన్‌ఆర్‌ఐలు దృష్టిసారించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐలందరికి తమపార్టీ తరపున పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్‌ఆర్‌ఐలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు తమ సత్తాను అన్నిరంగాల్లో చాటాలని పిలుపునిచ్చారు. తెలుగువారు ఎక్కడ ఉన్న వారందరూ కలిసి ఉండాలని ఆయన కోరారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని తెలుగువారి అభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐలు సహకరించాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిజిటల్ ఇండియా, స్మార్టప్ ఇండియా, మెకిన్ ఇండియా కార్యక్రమాలను చేపట్టారని ఆ కార్యక్రమాలకు ఎన్‌ఆర్‌ఐలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అవసరమైన పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. రెండురాష్ట్రాల్లో ప్రకృతి వైఫరీత్యాలు సంభవించినప్పుడు వారందరికి ఎన్‌ఆర్‌ఐలు అందించిన సహాయసహకారాలు మరవలేనివన్నారు. ఈ వేడుకలో కేంద్రమంత్రి ఎం వెంకయ్యనాయుడు, తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి, ఆటా సభ్యులు పాల్గొన్నారు.