S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రుణమాఫీతో చిన్న రైతు జీవితాలు సాఫీ

నెల్లూరు, జూలై 2 : ఆరుగాలం కష్టించే రైతుల కళ్లల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం రైతుల జీవితాలకు భరోసా కల్పిస్తూ అధికారం చేపట్టగానే ప్రకటించిన రైతు రుణమాఫీని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి ప్రకటించిన ఈ బృహత్తర పథకం ప్రభుత్వానికి భారమైనా చిత్తశుద్ధితో అమలుకు ప్రభుత్వం కట్టుబడింది. ఫలితంగా రైతుల జీవితాలకు రుణమాఫీతో భరోసా కల్పించింది. ఈ రుణమాఫీతో బ్యాంక్‌లు రైతులకు విరివిగా నూతనంగా రుణాలు అందించాల్సిన ఆవశ్యకతను ఉద్ఘాటించింది. రుణమాఫీకి విస్తృత స్థాయిలో ఆర్థిక సాయం చేసి తమను విముక్తులు చేసిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరు రైతుల జీవితాల్లో వెలుగులు నింపి వారి జీవనానికి ప్రభుత్వ భరోసా ఉందన్న నమ్మకాన్ని రైతుల్లో నింపిన చంద్రోదయ పథకం రుణమాఫీ అని అంటున్న ఆ రైతుల మాటల్లోనే రుణమాఫీపై కథనం

నా వయస్సు 70 ఏళ్లు. ఎస్‌సి సామాజిక వర్గానికి చెందిన నేను నా కుమారుని సాయంతో వ్యవసాయంపై గౌరవంగా బతుకుతూ ఉన్నాం.2014లో ఎప్పటి మాదిరిగానే బ్యాంక్‌లో పంటరుణం తీసుకుని వ్యవసాయం చేశాను. పంట దిగుబడి సరిగా రాకపోగా బకాయి పడ్డాను. ఏం చేయాలా? అనే దిగులు పట్టుకుంది ఇంతలోనే చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నా పంట రుణం రెండు విడతలు తీరిందని బ్యాంకువాళ్లు చెప్పటంతో నేను మళ్లీ వ్యవసాయం చేయగలిగాను. చంద్రబాబు దయ వల్లే మా కుటుంబం సంతోషంగా ఉంది.
ఓజిలి వెంకమ్మ, ఆమంచర్ల, నెల్లూరు రూరల్
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాకు ప్రభుత్వం 2.53 ఎకరాలు మంజూరు చేసింది. అప్పటి నుండి వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాం. 2013 నుండి వ్యవసాయం లాభించలేదు. బ్యాంక్‌లో చేసిన అప్పుకు వడ్డీ పెరుగుతూ వచ్చింది. చంద్రబాబు ఎన్నికలలో ఇచ్చిన హామీల నెరవేర్పుకు ఎదురుచూశా. ప్రభుత్వం నాలాంటి రైతులకు రెండు విడతలుగా రుణమాఫీకి నగదు చెల్లించిందని బ్యాంక్‌వాళ్లు చెపితే నా సంతోషానికి అవధులు లేవు.
రైతు దర్శికుంట చెన్నయ్య
ఆమంచర్ల, నెల్లూరు రూరల్

ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా ఉంటే తాము ఇప్పటికీ వ్యవసాయ కూలీలుగానే ఉండేవాళ్లం. తామే కాదు మాలాంటి ఎంతోమంది చిన్న, సన్నకారు రైతులు రుణమాఫీ వల్ల లబ్ధి పొందాం. దిక్కుతోచని స్థితిలో పుట్టెడు దుఃఖంలో ఉన్న మా కుటుంబాలను ప్రభుత్వం నిలబెట్టింది అందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు.
కందుకూరు సుబ్బయ్య,
ఆమంచర్ల,
నెల్లూరు రూరల్