S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రెండో మంత్రి ఎవరు?

(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)
తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేబినేట్ కూర్పుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా పలువురు మంత్రులకు ఉద్వాసం పలికి చురుకుగా నియోజకవర్గాల అభివృద్ధిలో భాగస్వామ్యం అయిన ఎమ్మెల్యేలను కేబినెట్‌లో తీసుకోవాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రణాళికా రూపొందించినట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వర్గాల విశ్వసనీయ సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్‌తో పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు నడిపించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ పథకాలు పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించి ఈ నివేదికలు ఆధారంగా చేర్పులు, మార్పులు చేపట్టడం అధినేత చంద్రబాబుకు సహజ నైజం!! ఈ ఫార్ములాను మంత్రులు పనితీరుకు అన్వహించి ప్రైవేటు ఇంటలిజెన్స్ బృందాలను రంగంలో దింపినట్లు తెలుస్తుంది. ఈ బృందాలు ఇప్పటికే నియోజకవర్గాల వారీగా కొంతమంది కీలకనేతలను కలిసి ముఖ్యంగా రాష్ట్ర కార్మికశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పనితీరుపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. పది నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇంచార్జ్‌లతో అనుసంధానం చేసుకొని ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో లక్ష్యాలు అధిగమించేలా తీసుకుంటున్న చర్యలపై ఈ బృందాలు నమూనాలు సేకరిస్తున్నాయి. నీరు-చెట్టు, ప్రగతి, ఇంకుడు గుంతలు, సామాజిక పింఛన్లు, ఆన్‌లైన్ బదిలీలు, జన్మభూమి కమిటీల పనితీరు గ్రామస్థాయిలో బాబు పాలనపై సామాన్య మధ్యతరగతి కుటుంబాలు సంతృప్తిగా ఉన్నాయా? లేదా? అన్న అంశాలపై మరింత సమాచారాన్ని రాబడుతున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఎమ్మెల్యేల నుండి సర్పంచ్‌ల వరకు ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై పనిచేస్తున్నారా లేదా అన్న కోణంలో కూడా సర్వే కొనసాగుతుంది. ఇంటలిజెన్స్ బృందాలు ప్రభుత్వ పనితీరు కంటే జిల్లాలో పార్టీ బలోపేతానికి చేపట్టవలసిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ఈ సర్వే కొనసాగిస్తున్నట్లు తెలుగుతమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. ఇటీవలి జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విస్తృత స్థాయి నాయకుల సమావేశంలో 80 శాతం ఓటర్లు తెలుగుదేశం పార్టీ పొందేలా అంకిత భావంతో సేవలందించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితి వచ్చేలా నాయకులు ఏ మేరకు పనిచేస్తున్నారన్న కోణంలో సర్వే ముందుకు సాగుతుంది. ముఖ్యంగా మరికొద్ది నెలల్లో కేబినేట్ కూర్పునకు సి.ఎం. ఇప్పటినుంచే కసరత్తు ముమ్మరం చేశారు. చురుకైన నాయకత్వం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ‘రెండవ మంత్రి’ ఆవశ్యకతపై సర్వే బృందాలు పసుపుదళం నుండి వాస్తవాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఇదే కార్యరూపం దాల్చితే ఎచ్చెర్ల ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిమిడి కళావెంకటరావుకు కేబినేట్ బెర్త్ కేటాయిస్తే ఎలా ఉంటుందని కేడర్ నుండి అభిప్రాయాలను ఇంటలిజెన్స్ బృందాలు సర్వే సాగిస్తున్నట్లు భోగట్టా. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి వివిధ హోదాలలో పనిచేసిన కళా వెంకటరావుది కాపు సామాజిక వర్గం కావడం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఓటు బ్యాంకు ఉండటం కలిసొచ్చిన అంశంగా కనిపిస్తుంది. మంత్రి అచ్చెన్న దూకుడుకు కళా అనుభవంతోడైతే జిల్లా అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని సర్వే బృందాల వద్ద అభిప్రాయాలు నేతలు తెలియజేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. విజయనగరం జిల్లాకు మంత్రిగా కిమిడి మృణాళిని కొనసాగడం ఒక్కటే కళాకు ప్రతికూలాంశంగా ఉందని పలువురు అభిప్రాయ పడినట్లు తెలియవచ్చింది. ఆమదాలవలస ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌కు రాష్ట్ర మంత్రి వర్గంలో తీసుకుంటే ఎలా ఉంటుందని సర్వే బృందాలు అన్ని నియోజకవర్గాల్లో ఆరా తీస్తున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల నుంచి అంచెలంచెలుగా ఎదిగిన రవికుమార్ గొప్ప మాటకారిగా పేరుండటమే కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపై మంచి అవగాహన ఉన్న నేత అన్నవిషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి నాయకుడుకు మంత్రి పదవీబాధ్యతలను అప్పగిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో అన్న కోణంలో కూడా సర్వే కొనసాగుతున్నట్లు సమాచారం. జిల్లాలో ప్రధాన సామాజిక వర్గాల్లో ఒకటైన కాళింగసామాజిక వర్గానికి చెందిన రవికుమార్‌కు విప్ నుండి పదోన్నతి కల్పిస్తే ఆ కులం ఓటుబ్యాంకుతో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయవచ్చునని సర్వే బృందాల వద్ద తమ్ముళ్లు తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నివేదికలను సర్వే బృందాలు యువనేత లోకేష్ ద్వారా అధినేత చంద్రబాబుకు చేరవేసినట్లు సి.ఎం.క్యాంపు కార్యాలయం వర్గాలు చెప్పిన మాట. ఎప్పుడూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓటుబ్యాంకుతోపాటు పారదర్శకత సామాజిక వర్గాలు సమతుల్యత, ప్రాంతీయ సమతుల్యత వంటి కీలక అంశాలు పరిగణనలోనికి తీసుకొని కేబినేట్ బెర్త్ కేటాయింపులు జరపడం పరిపాటి. ఈ పర్యాయం పందా మార్చి సర్వేలో వెల్లడైన వాస్తవాలను ప్రమాణికంగా తీసుకొని కేబినేట్ విస్తరణ వైపు అడుగులు వేసిన బాబు రెండవ మంత్రిగా కళా లేదా రవికుమార్‌లకు అవకాశం దక్కుతుందో? లేదో?? చూడాలి మరి!!