S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దేవాలయాల విద్వంసం దారుణం

శ్రీకాకుళం(రూరల్), జూలై 2: పుష్కరాల నెపంతో విజయవాడ నగరంలో వందల సంవత్సరాల నాటి అత్యంత ప్రాచీనమైన 45 హిందూ దేవాలయాలను రాష్ట్ర ప్రభుత్వం కూల్చి వేయడంపై విశ్వ హిందూ పరిషత్ జిల్లా శాఖ ఆందోళన వ్యక్తంచేశారు. రోడ్డు విస్తరణకు అవసరమైతే దేవాలయాలను వేరొక ప్రదేశానికి మార్చి సంప్రదాయ పద్దతిలో దేవతావిగ్రహాలను తీయాలే తప్ప యంత్రాలతో దేవతా విగ్రహాలను దారుణంగా విద్వంసం చేయడం ఆనాడు మొగలును పరిపాలనను గుర్తు చేస్తుందని ఈ విధంగా కూల్చడం హిందూ ధర్మాన్ని, సమాజాన్ని అవమాన పరచడమే అని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు గుంపా శివప్రసాద్ తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న హిందువుల ఆందోళనకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జిల్లా భజరంగదల్‌ప్రముఖ్ శ్రీరంగమధుసూధనరావు జిల్లా వీహెచ్‌పి ఉపాధ్యక్షులు ఆర్.నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

శివారు భూములకూ సాగు నీరు

కోటబొమ్మాళి, జూలై 2: ఈ ఏడాది ఖరీఫ్‌లో శివారుభూములకూ వంశధా ర కాలువల ద్వారా నీరు అందిస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. స్థానిక మం డల పరిషత్ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ ఈ ఖరీఫ్‌లో సకాలంలో వర్షాలు పడతాయని శాస్తజ్ఞ్రులు చెబుతున్నారిని, ఇది శుభసూచకమన్నారు. బ్యాంకర్లు రుణవిముక్తి పత్రాలను చిత్తుకాగితాలు వలే చూస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, ఈ విషయమై బ్యాంకర్లు, నాబార్డు, లీడ్ బ్యాంకు మేనేజర్లు సమావేశం నిర్వహించుకొని సమీక్షించుకోవాలన్నారు. ఈ ఏడాది ఎరువులు, పురుగుల మందులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. మతసామరస్యాన్ని కాపాడాలి మతసామరస్యాన్ని కాపాడాలని రాష్ట్ర ఉపాధి శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో టెక్కలి నియోజకవర్గస్థాయి ముస్లింలకు రంజాన్ తోఫా సరకులను శనివారం మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 11 లక్షల ముస్లిం కుటుంబాలకు ఈ సరుకులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గత కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింమైనార్టీల అభివృద్ధికి 200 కోట్ల రూపాయలు కేటాయిస్తే 13 జిల్లాల నవ్యాంధ్రప్రదేశ్‌కు 370 కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించారన్నారు. జిల్లాలో మసీదులు శిథిలావస్థలో ఉన్నకారణంగా రంజాన్ సందర్భంగా 11 మసీదులకు రంగులు, మరమ్మతులకు 5 లక్షల రూపాయలు మంజూరు చేశారన్నారు. సివిల్ సప్లై డిఎం జయరాం అధ్యక్షత వహించగా, ఆర్డీవో వెంకటేశ్వరరావు, ఎఎంసి ఛైర్మన్ విజయలక్ష్మి, జడ్‌పిటిసిలు లక్ష్మి, ఎన్ పద్మశ్రీనివాస్, ఎంపిపిలు రామకృష్ణ, కె.కృష్ణవేణి, దేశం నాయకులు గోవిందరాజులు, రమేష్, నాగయ్యరెడ్డి, ఎల్ ఎల్ నాయుడు, డి ఎస్‌ఓ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

60 కేజీల వెండి పట్టీలు స్వాధీనం

ఆమదాలవలస, జూలై 2: తమిళనాడు రాష్ట్రం సేలం నుండి ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా అక్రమంగా తరలిస్తున్న సుమారు 60 కేజీల వెండి పట్టీలను జిల్లా క్రైమ్ పోలీసులకు అందిన సమాచారం మేరకు శనివారం సాయంత్రం స్థానిక రైల్వేస్టేషన్ వద్ద పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ బ్రహ్మారెడ్డి ఇక్కడి విలేఖర్లకు అందించిన సమాచారం మేరకు యశ్వంత్‌పూర్- హౌరా రైలులో దిగిన ఓ వ్యక్తి నరసన్నపేటకు తరలిస్తుండగా పట్టుబడినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా తమిళనాడు నుండి కోట్లాదిరూపాయలు విలువైన వెండి పట్టీలతో పాటు ఇతర వస్తువులు భారీగా తరలిపోతున్నాయని తమక్రైమ్ పోలీసులు గుర్తించారని ఎస్పీ బ్రహ్మారెడ్డి తెలిపారు. స్థానిక ట్రైనీ ఎస్ ఐ శ్రీనివాస్‌తోపాటు స్పెషల్ పార్టీకి చెందిన తమ పోలీస్ సిబ్బంది పట్టుకుని నిందుతుడిని అదుపులోనికి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈసరుకును విచారించి వాణిజ్య పన్నుల శాఖద్వారా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును చెల్లించి వీటిని విడుదల చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.

పింఛన్ల పంపిణీ వేగవంతం చేయాలి

గార, జూలై 2: ప్రభుత్వం లబ్ధిదారులుకు అందజేస్తున్న ఫించను మొత్తాలు పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని డి.ఆర్.డి.ఎ. పి.డి. తనూజారాణి స్పష్టం చేసారు. మండలం వమరవెల్లి పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న ఫించన్లు పంపిణీ కార్యక్రమాన్ని శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞాణాన్ని అందిపుచ్చుకుంటూ త్వరితగతిన ఫించన్లు పంపిణీ కార్యక్రమాన్ని నెలవారీ నిర్వహింపజేస్తున్నామన్నారు. ఫించన్లు పంపిణీకి సంబంధించి లబ్ధిదారుల సమాచారం నిక్షిప్తం చేసే సందర్భంలో ట్యాబ్‌లు సరిగా ఉపయోగించకపోతుండడం వలన సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ట్యాబ్‌లను జాగ్రత్తగా వినియోగించక పోతుండడంతో నెలకొంటున్న సమస్యను భూతద్ధంలో చూపిస్తున్నారని, చిత్తశుద్ధితో వ్యవహరించి ఫించన్లు పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. తాము గతంలో బ్యాంకు ద్వారా రుణం పొంది, చెల్లింపులు గావించామని, బకాయి ఉన్నట్లు బ్యాంకువారు ఒత్తిడి తెస్తున్నారని గ్రామానికి చెందిన కల్క్భిగవాన్ గ్రూపు సభ్యులు పి.డి.కి పిర్యాదు చేసారు. శాఖా పరంగా, బ్యాంకు అధికారులతో విచారణ గావిస్తానని, రుణ బకాయి ఉన్న ప్రతి ఒక్కరు పూర్తి స్థాయిలో చెల్లింపులు తప్పనిసరని, లేని యెడల పోలీసు చర్యలు ఉంటాయన్నారు. ఈమె వెంట ఎం.పి.డి.ఓ. ఆర్. స్వరూపరాణి, సర్పంచు ప్రతినిధి, జిల్లా రెడ్డిక సంఘం అధ్యక్షుడు లోపింటి రాధాక్రిష్ణారెడ్డి, కార్యదర్శి ఉన్నారు.

ప్రజల ముంగిటకు ప్రభుత్వ పథకాలు
పొందూరు, జూలై 2: ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రాముఖ్యత, ప్రాధాన్యతలను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లాల్సిన బాధ్యతలను స్వచ్ఛందంగా అధికార యంత్రాం గం స్వీకరించాలని ప్రభుత్వ విప్; ఎమ్మెల్యే కూన రవికుమార్ పిలుపునిచ్చారు. ఆయన పొందూరు మండల పరిషత్ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన మండల స్థాయి అధికారులు జన్మభూమి కమిటీసభ్యులు సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అధికార పార్టీనాయకుల, పాలకులు పథకాల ప్రచారం సాగించడంతోపాటు అధికార యంత్రాంగం కూడా ఈ బాధ్యతలను స్వీకరించిననాడు ఆశించిన ఫలితాలు వస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తపరిచారు. నీరు-చెట్టు కార్యక్రమం కింద రెల్లిగెడ్డవిస్తరణ పనులు ఆశాజనకంగా జరుగుతున్నాయని రైతు కోరికల మేరకు జరుగుతున్న పనుల వాస్తవాలను ప్రతిపక్ష పార్టీవారు వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్న విషయాన్ని ప్రజలు గ్రహించాల్సిందిగా ఆయన కోరారు. అన్ని ప్రభుత్వ శాఖల పనితీరును మెరుగు పరుచుకోవాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటీసీ శ్రీరాములనాయుడు, ఎంపిడివో సుబ్రహ్మణ్యం, తహశీల్దార్ వరప్రసాదరావు, పి ఏ సి ఎస్ అధ్యక్షులు కూన సత్యన్నారాయణ, ఏ ఎం సి అద్యక్షులు అనె్నపురాము, ఎంపిటీసీ సభ్యులు, జన్మభూమి సభ్యులు పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌లో తపాలా సేవలు
* పోస్టల్ సూపరింటెండెంట్ నాగ ఆదిత్య కుమార్
నరసన్నపేట, జూలై 2: జిల్లాలో ఉన్న అన్ని తపాలా బ్రాంచి కార్యాలయాలను ఆన్‌లైన్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ నాగ ఆదిత్యకుమార్ తెలిపారు. శనివారం స్థానిక సబ్ పోస్ట్ఫాస్‌కు విచ్చేసిన ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలో 426 గ్రామీణ ప్రాంత తపాలా బ్రాంచి కార్యాలయాలు ఉన్నాయని, 61 సబ్ పోస్ట్ఫాసులు ఉండగా, 3 ప్రధాన కార్యాలయాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్ సేవలను శ్రీకాకుళం, టెక్కలి, ఆమదాలవలసల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. పోస్టల్ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం పొదుపు బాట పట్టేందుకు గాను పలు పథకాలను అమలు చేయడం జరుగుతుందని వీటిలో భాగంగా సురక్ష భీమా యోజన, సుకన్య సమృద్ధి పథకం తదితర పథకాలు అమలే చేయడం జరుగుతుందని తెలిపారు. దీనికి సంబంధించి 15 రోజులు పాటు స్పెషల్ డ్రైవ్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఖాతాలను పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటివరకు 39లక్షల ఖాతాలు పోస్టల్ శాఖలో ఉన్న మరో లక్ష ఖాతాలు తెరిపించేందుకు లక్ష్యంగా చేసుకున్నామని వివరించారు. సుకన్యా సమృద్ధి పథకంద్వారా ఇప్పటివరకు 8వేల మంది పథకంలో చేరారని వివరించారు. ఈకార్యక్రమంలో స్థానిక పోస్టుమాస్టార్ శేఖర్‌బాబు సిబ్బంది పాల్గొన్నారు.