S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రక్తదానం మరొకరికి ప్రాణదానం

శ్రీకాకుళం(రూరల్), జూలై 2: రక్తదానం మరొకరికి ప్రాణదానం వంటిదని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం అన్నారు. శనివారం పెద్దపాడు రోడ్డులోని స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసులో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రక్తంలేక మరణాలే సంభవించకుడదని రక్తదానాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలన్నారు. జిల్లాలో రక్తం కొరతను దృష్టిలో ఉంచుకొని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు రక్తదానానికి ముందుకు రావడం హర్షించదగ్గవిషయమన్నారు. స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ మేరీసగయ మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారన్నారు. ఈసందర్భంగా ఆమె నేత్ర దానం హామీ పత్రంపై సంతకం చేశారు. రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులు తమ ఉద్యోగ బాధ్యతను సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని ముందుకు రావడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. ఈకార్యక్రమంలో సుమారు 70మంది సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈకార్యక్రమంలో స్టేట్‌బ్యాంకు ప్రతినిధి అప్పలరాజు, కె.శివరాం, రామ్‌జీ, కె.వెంకటరమణ, పి.రాధాకృష్ణ, దాలినాయుడు, రెడ్‌క్రాస్ వైద్యులు సత్యవతి, చైతన్యకుమార్, సిహెచ్ జగన్నాధరావు, కె.సత్యన్నారాయణ, చంద్రశేఖర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పర్యాటక కేంద్రాలుగా జామియా, మదీనా దర్గాలు

గార, జూలై 2: నియోజక వర్గం పరిధిలో గల జిల్లా కేంద్రంలోని అతిపెద్ద జామియా మసీదు, కళింగపట్నం ప్రాంతంలో గల మదీనా దర్గాలు పర్యాటక పరంగా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి స్పష్టం చేసారు. రంజాన్ సందర్భంగా మండలం కళింగపట్నం పంచాయతీ ఆవరణంలో ముస్లిం సామాజిక వర్గానికి తోఫా పథకం ద్వారా రేషను సరుకులను అందజేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మీదేవి మాట్లాడుతూ మత సమ్మేళనంతో అన్ని మతాలు, కులాలు వారు అన్యోన్యంగా ఉండాలన్న ఉద్ధేశ్యంతో ముఖ్యమంత్రి అన్ని మతాలకు చెందిన పండుగలు ఘనంగా నిర్వహించుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారన్నారు. కళింగపట్నం ప్రాంతంలో గల మదీనా దర్గాకు మత ప్రతీకగా గొప్ప చరిత్ర ఉందని, ఇక్కడి దర్గాకు మత బేధాలు లేకుండా అన్ని మతాలు వారు వస్తుండడం స్వాగతించతగ్గదన్నారు. పేద ముస్లిం కుటుంబాలు సంక్షేమానికి రోషిని, దుఖాన్, మకాన్ పథకాలు అమలుచేసే దిశగా ముఖ్యమంత్రి యోచిస్తున్నారన్నారు. మసీదులు అభివృద్ధికి ప్రభుత్వం నిధులు వెచ్చించిందన్నారు. నియోజక వర్గం అభివృద్ధకి తన వంతు కృషి చేస్తున్నానన్నారు. ఈ సందర్భంగా మండలంలో పలు పంచాయతీ ప్రాంతాల్లో గల ముస్లిం కుటుంబాలకు తోఫా పథకం ద్వారా ప్రభుత్వం అందజేసిన సరుకులు పంపిణీ గావించారు. అదేవిధంగా పెన్సన్లు కూడా అందజేసారు. ఈ కార్యక్రమంలో పి.డి. తనూజారాణి, మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు గుండ భాస్కరరావు, ఎం.పి.డి.ఓ. స్వరూపరాణి, తహశీల్దారు సింహాచలం, సర్పంచులు పి. క్రిష్ణమూర్తి, బడగల వెంకటప్పారావు, కొయ్యాన జగదీష్, గొండు వెంకటరమణమూర్తిలతో పాటు పీస వెంకటరమణమూర్తి, లోపింటి రాధాక్రిష్ణారెడ్డి, పొట్నూరు వైకుంఠం, ప్రసాదరావు తదితరులు ఉన్నారు.