S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పేద కళాకారులకు రంగస్థలం పెద్ద వరం

శ్రీకాకుళం(కల్చరల్), జూలై 2: శ్రీకాకుళం రంగస్థలం కళాకారులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద కళాకారులకు పింఛన్లు అందించడం మంచి సేవా కార్యక్రమంగా చేస్తున్నారని విశ్రాంతి సి ఇవో సురంగి మోహనరావు అన్నారు. శనివారం స్థానిక బాపూజీకళామందిర్‌లో శ్రీకాకుళం రంగ స్థల కళాకారుల సమాఖ్య ఆధ్వర్యంలో 201వ నెల సంస్కృతిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్యను వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టరేట్ పొందిన ప్రముఖ నృత్య కళాకారుడు రఘుపాత్రుని శ్రీకాంత్ సమాఖ్య సన్మానించింది. అనంతరం ఆమదాలవలసకు చెందిన బి.కిరణ్‌కుమార్, ఎస్.రాజేంద్రప్రసాద్ ల ఆధ్వర్యంలో 15మంది కళాకారులచే జనాపధ నృత్య ప్రదర్శనలు, దశావతారములు నృత్యరూపకమలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రంగస్థల కళాకారులు సమాఖ్య అధ్యక్షులు ఎల్.రామలింగస్వామి, సీనియర్ న్యాయవాధి జీ వి రమణ, సివిల్ ఇంజినీర్ డి.సుధాకర్, పన్నాల నర్శింహమూర్తి, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.