S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నారాయణ తిరుమలలో అష్టోత్తర నామావళి

శ్రీకాకుళం(కల్చరల్), జూలై 2: నగరంలో గుజరాతీపేటలో ఉన్న నారాయణ తిరుమల ఆలయంలో శనివారం అష్టోత్తర నామావలి పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వెంకటేశ్వర స్వామిని పూజించుకున్నారు. అర్చకులు జి.శ్రీనివాసరావు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా దూదివారి వీధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు రేజేటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలు పూజలు నిర్వహించారు. కలెక్టర్ బంగ్లాదరి వెంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు బాలమురళీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు. ఆలయ ధర్మకర్త బెహరా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రాత్రి భజన కార్యక్రమాలు నిర్వహించారు. బ్యాంకర్స్ కాలనీ వద్ద ఉన్న శివబాలాజీ ఆలయంలో కూడా భక్తులు విరివిగా పాల్గొని పూజలు నిర్వహించారు.

గుంటూరు మహాసభలను విజయవంతం చేయండి
రణస్థలం, జూలై 2: గుంటూరులో ఏపి టి ఎఫ్ ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్ర విద్యావైజ్ఞానిక మహాసభలకు ఉపాధ్యాయులందరూ తరలిరావాలని ఏ పి టి ఎఫ్ రాష్ట్ర కౌనె్సలర్ ఎం. కృష్ణానందం పిలుపునిచ్చారు. మం డల కేంద్రంలో ఏ పి టి ఎఫ్ నూతన కార్యవర్గ ఏర్పాటుకు సంబంధించి జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ బాధ్యతలకు నిలబడి హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నా రు. ఈ సందర్భంగా రణస్థలం మం డల శాఖ గౌరవధ్యక్షులు పి.నర్శునాయుడు, అద్యక్షులు మీసాల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా బొంతు అప్పలనాయుడులను ఇతర ప్రతినిధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.