S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సిద్ధాంతాల ముసుగులో మావోయిస్టుల అక్రమ దందా

విశాఖపట్నం(క్రైం), జూలై 2: సిద్ధాంతాల ముసుగులో మావోయిస్టు నేతలు డబ్బులు వసూలు చేసే గూండాలుగా వ్యవహరిస్తున్నారని నర్సీపట్నం అదనపు ఎస్‌పి ఐశ్వర్య రస్తోగి మండి పడ్డారు. ఇటీవల కాలంలో గిరిజన యువతి, యువకుల పట్ల దళంలో ఉన్న మావోయిస్టు అగ్ర నాయకులు చూపుతున్న వివక్షకు బాధపడి సుమారు పది మంది మహిళా మావోయిస్టులు స్వచ్ఛంధంగా లొంగపోవడం జరిగిందని శనివారం ఆయన పంపిన ప్రకటనలో తెలిపారు. దీనిని మావోయిస్టులు జీర్జించుకోలేక, గత 15సంవత్సరాలుగా దళంలో పని చేస్తున్న కొయ్యూరు మండలానికి చెందిన రస్సో, ఝాన్సీ అనే ఇద్దరు మహిళలను బలవంతంగా ప్రజాకోర్టు వంతమర్రి గ్రామంలో నిర్వహించి వారిని దోషులుగా చేసి, గ్రామం విడిచి మూడు సంవత్సరాల వరకు ఎక్కడికి వెళ్లకూడదని ఆంక్షలు విధించడం అమానుష చర్య అని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి అనాగరిక చర్యలు వలన మావోయిస్టు పార్టీ గిరిజనుల నుండి విశ్వాసాన్ని కోల్పోతుందని, మాట వినని గిరిజనులను బెదిరించడం, ఇన్‌ఫార్మర్‌ల పేరుతో కొట్టడం, చంపడం చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. సంతాలకు వచ్చే చిరు వ్యాపారుల నుండి, గ్రామాలలో కిరాణా దుకాణుదారుల నుండి, కాంట్రాక్టర్లు, గంజాయి వ్యాపారుల నుండి గూండాల తరహాలో మావోయిస్టులు డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. జాంబ్రి, సత్తి, బలరామ్, శోభన్, సత్తి నర్సింగ్, సుధీర్ వంటి దళం నెంబర్లు ఈ దోపిడీలకు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇటువంటి పద్దతులను వారు మార్చుకోవాలని లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గిరిజన పెద్దలు, యువతీ యువకులు, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు మావోయిస్టుల చర్యలను గమనించి ఖండించాలని ఆయన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.