S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మీరు స్మార్టైతేనే మీ సిటీ స్మార్ట్

విశాఖపట్నం, జూలై 2: మీరు స్మార్ట్‌గా ఉంటేనే మీ సిటీ స్మార్ట్‌గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్‌కె బీచ్ వద్ద వైజాగ్ స్టీల్ నైట్ బే మారథాన్ పోటీలను శనివారం ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ అమెరికా సహకారంతో విశాఖ నగరం స్మార్ట్‌సిటీగా రూపుదిద్దుకోనుందని, స్మార్ట్‌సిటీ ప్రజానీకం అంతే స్మార్ట్‌గా ఉండాలన్నారు. కష్ట,నష్టాలను ధైర్యంగా ఎదుర్కొని నిలిచే తత్వం ఉన్న విశాఖ అంటే తనకెంతో ఇష్టమని, విశాఖను అన్ని రంగాల్లోను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే తన తొలి ప్రాధాన్యమని అన్నారు. హుదూద్ తుపాను పెను విషాదాన్ని మిగిల్చినప్పటికీ నగర ప్రజలు ఎక్కడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదన్నారు. ఇక్కడి ప్రజల ధైర్యం, పట్టుదల అబ్బురపరచిందన్నారు. అందుకే అంతర్జాతీయ స్థాయిలో 42 దేశాల ప్రతినిధులు పాల్గొన్న భాగస్వామ్య సదస్సును విశాఖలో నిర్వహించామన్నారు. అలాగే ప్రపంచ దేశాల్లో భారత నౌకాదళం ప్రతిభా పాటవాలను ప్రదర్శించే విధంగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను విశాఖలో నిర్వహించగా 52 దేశాలకు చెందిన నౌకాదళాలు పాలుపంచుకున్నాయన్నారు. తొలి సారిగా నిర్వహించిన నైట్ మారథాన్‌లో యుకె, కెన్యా, స్విట్జర్లాండ్, ఇథియోఫియా, నేపాల్ తదితర తొమ్మిది దేశాల నుంచి మారథాన్‌లో పాల్గొన్నారన్నారు. తొలి ప్రయత్నంలోనే 7,500 మంది ఔత్సాహికులు మారథాన్‌లో పాల్గొన్నారని, వచ్చే ఏడాది ఇదే స్పూర్తితో మరింత అద్భుతంగా మారథాన్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఇదేమాదిరి అన్ని జిల్లాల్లోని ముఖ్యపట్టణాల్లో మారథాన్ నిర్వహించనున్నట్టు తెలిపారు. కీలక పట్టణాల్లో సైక్లింగ్ పోటీలను నిర్వహించనున్నట్టు తెలిపారు. సైక్లింగ్ వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. దేశ చరిత్రలోనే తొలి సారిగా విశాఖ సాగరతీరంలో నిర్వహించిన నైట్ బే మారథాన్‌కు అనూహ్య స్పందన లభించిందని, ఈ స్పందన చూస్తుంటే భవిష్యత్‌లో విశాఖ మారథాన్ కేంద్రంగా మారుతుందనడంలో సందేహం లేదన్నారు. మీ అందరికీ అండగా ఉంటా, ఈ ప్రాంత అభివృద్ధికి చేయూతనిస్తానని హామీ ఇచ్చారు. వాతావరణం సరిగా అనుకూలించనప్పటికీ నిర్వాహకులు, అధికారులు చేసిన ఏర్పాట్లతో పాటు మారథాన్‌లో పాల్గొనేందుకు వచ్చిన యువత, చిన్నారుల్లో ఉత్సాహం తనకు మరింత బలాన్నిచ్చిందన్నారు.
అనంతరం 10కె రన్‌లో విజేత విజయనగరం జిల్లాకు చెందిన శ్రీను, అడవివరం ప్రాంతానికి చెందిన ఆర్మీ ఉద్యోగి పి కిరణ్, 21కె రన్‌లో విజేత దీపక్ కుమార్, కెన్యాకు చెందిన ఐజాక్‌లకు ఆయన పతకాలను, ప్రైజ్‌మనీ అందజేశారు. 10కె రన్ మహిళా విభాగంలో నవ్యా పటేల్ ప్రథమ, ఢిల్లీకి చెందిన సీమా ద్వితీయ స్థానంలో నిలిచారు. అలాగే నల్గొండ జిల్లా సూర్యాపేటకి చెందిన నవ్యా వడ్డేకు సిఎం చంద్రబాబు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు సిహెచ్ అయ్యన్నపాత్రుడు, కె అచ్చెన్నాయుడు, ఎంపిలు కె హరిబాబు, ఎం శ్రీనివాసరావు, కె రామ్మోహన నాయుడు, ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్‌కుమార్, పల్లా శ్రీనివాస్, పి విష్ణుకుమార్ రాజు, జెడ్పీ చైర్ పర్సన్ లాలం భవానీ, ఎమ్మెల్సీలు కలెక్టర్ ఎన్ యువరాజ్, జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్, ఇపిడిసిఎల్ సిఎండి ఆర్ ముత్యాలరాజు, వుడా విసి బాబూరావు నాయుడు, స్టీల్‌ప్లాంట్ సిఎండి మధుసూదన్, రన్ నిర్వాహకుడు విజయ్ నన్నపనేని తదితరులు పాల్గొన్నారు.